News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

R Thyagarajan: రూ.6210 కోట్లు దానం చేసిన బిజినెస్‌మెన్, ఆఖరికి మొబైల్ కూడా వాడరు

R Thyagarajan: ప్రతి ఒక్కరూ చేతిలో ఐఫోన్, ఖరీదైన కారు, ఇల్లు ఉండాలను కుంటారు. కానీ కోట్లకు పడగలెత్తిన ఓ వ్యక్ చిన్న ఇంట్లో ఉంటూ కోట్ల ఆస్తిని పంచేశాడు. 

FOLLOW US: 
Share:

R Thyagarajan: ఈ రోజుల్లో సాధారణ జీవితం గడపడం చాలా అరుదు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఉన్నతంగా జీవించాలనే అనుకుంటారు. చేతిలో ఐఫోన్, ఖరీదైన కారు, ఇల్లు ఉండాలను కుంటారు. కానీ కోట్లకు పడగలెత్తిన ఓ వ్యక్తి కనీసం చేతిలో ఫోన్‌కూడా ఉపయోగించడంటే నమ్ముతారా? అంతేకాదు చిన్న ఇంట్లో ఉంటూ కేవలం ఐదు వేల డాలర్లు తన వద్ద ఉంచుకుని తన రూ.6210 కోట్లు ఆస్తిని పంచేశాడు. 

ఆయనే శ్రీరాం చిట్స్ అధినేత టి.త్యాగరాజన్. ఆయన ఎక్కువగా ప్రజల మధ్య జీవించడానికి ఇష్టపడతారు. కొన్నాళ్లుగా ఆయన హ్యుందాయ్ హ్యాచ్‌బ్యాక్‌ కారు వాడుతున్నారు. మొబైల్ ఫోన్ వ్యసనం అని దానిని వాడనని చెబుతారు. తనకు అప్పుడో ఇప్పుడో డబ్బు అవసరం లేదని చెబుతారు. శాస్త్రీయ సంగీతం వింటూ, పాశ్చాత్య వ్యాపార పత్రికలను గంట పాటు చదువుతూ ఉంటారు. 

ఏ వాహనం కొనుగోలు కైనా రుణం, ఇన్సూరెన్స్ సేవలు అందిస్తుంది శ్రీరాం చిట్స్. ఇందులో 1,08,000 మందికి పనిచేస్తున్నారు. ఈ సంస్థ షేర్లు  ఈ సంవత్సరం 35% పెరిగి జూలైలో రికార్డ్‌ నమోదు చేశాయి. ఇది భారతదేశపు బెంచ్‌మార్క్ స్టాక్ ఇండెక్స్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ. ఈ సంస్థకు అధినేతగా ఉన్న త్యాగరాజన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సాధారణ ఆదాయం లేని వ్యక్తులకు రుణాలు ఇవ్వడం ప్రమాదకరం కాదని నిరూపించడానికి తాను పరిశ్రమలోకి ప్రవేశించానని చెప్పారు. రూ.6210 కోట్లు  ఆస్తిని దానం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. 

త్యాగరాజన్ 1974లో చెన్నైలో సంస్థను స్థాపించారు. సామన్య ప్రజల జీవితాల్లో సమస్యలు తొలగించాలని నిర్ణయించుకున్నారు.  దేశంలో  1.4 బిలియన్ల మంది ప్రజలు మధ్య తరగతికి చెందినవారు. పేదలకు రుణాలు ఇవ్వడం ఒక రకమైన సోషలిజం అని త్యాగరాజన్ వాదించారు. బ్యాంక్ రేట్ల కంటే తక్కువకు రుణాలు ఇవ్వడం ద్వారా  వ్యాపారం సురక్షితం, లాభదాయకంగా ఉంటుందని ఆయన నిరూపించడానికి ప్రయత్నించారు.  

ప్రస్తుతం దేశంలో 9,400 షాడో బ్యాంక్‌లు ఉన్నాయి. ఇవి ఎక్కువగా సంప్రదాయ రుణదాతల ద్వారా ప్రజలకు ఆర్థిక సేవలను అందిస్తాయి. KPMG ఇండియాలో సీనియర్ పార్ట్‌నర్, కార్పొరేట్ ఫైనాన్స్ హెడ్ శ్రీనివాస్ బాలసుబ్రమణియన్ మాట్లాడుతూ..  కొంతమంది మాత్రమే చాలా కాలం పాటు కొనసాగుతూ అభివృద్ధి సాధిస్తారని అన్నారు. 

త్యాగరాజన్ చెన్నైలో గ్రాడ్యుయేట్,  మాస్టర్స్ స్థాయిలో గణితాన్ని అభ్యసించారు. తరువాత కోల్‌కతాలోని  ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్‌లో మూడు సంవత్సరాలు చదివారు. 1961లో అతను భారతదేశంలోని అతిపెద్ద బీమా సంస్థల్లో ఒకటైన న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలో చేరారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు వైశ్యా బ్యాంక్,  రీఇన్స్యూరెన్స్ బ్రోకర్ సంస్థ  JB బోడా & కోలో పనిచేశారు. తరువాత స్నేహితులు, బంధువులు సాయంతో శ్రీరామ్‌ సంస్థను ఏర్పాటు చేసి భీమా నుంచి స్టాక్ బ్రోకింగ్ వరకు 108,000 మందికి ఉపాధి కల్పించారు. అలాగే వాహనాల కొనుగోలుకు సాధారణ ప్రజలకు రుణాలు అందించారు.  

క్రమక్రమంగా కంపెనీని అభివృద్ధి చేశారు.  శ్రీరామ్స్ సంస్థల కారణంగా వడ్డీ రేట్లు 30%-35% నుంచి 17%-18%కి తగ్గాయి.  ప్రస్తుతం శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ మార్కెట్ విలువ సుమారు $8.5 బిలియన్లు. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో సుమారు $200 మిలియన్ల లాభాలను ఆర్జించింది. స్టాక్‌ను ట్రాక్ చేస్తున్న 34 మంది విశ్లేషకులలో ఒకరు మాత్రమే దానిని విక్రయించాలని సిఫార్సు చేస్తున్నారు. అంతేకాకుండా శ్రీరామ్ గ్రూప్ దాదాపు 23 మిలియన్ల కస్టమర్లకు సేవలు అందిస్తోంది. 

పేదలకు రుణాలు మంజూరు చేసే క్రమంలో బ్యాంకుల తరహాలో శ్రీరామ్స్ సంస్థలు క్రెడిట్ స్కోర్‌లను చూడదని, బదులుగా గతంలో వినియోగదారుల సూచనలపై ఆధారపడుతుందని త్యాగరాజన్ వివరించారు. అంతర్గతంగా, కంపెనీ పరిహారం కోసం ఒక ప్రత్యేకమైన విధానాన్ని కూడా తీసుకుంటుంది. మార్కెట్‌ ధరల కంటే తక్కువ ధరకే లభిస్తున్నప్పటికీ సిబ్బందికి ఎక్కువ జీతం ఇవ్వాలని త్యాగరాజన్‌ చాలా కాలంగా నమ్ముతున్నారు. ‘ఈ ఉద్యోగం అందించే మనశ్శాంతి, స్థిరత్వం, సౌకర్యానికి విలువ ఇస్తాను’  అంటూ ముంబైకి చెందిన శ్రీరామ్ ఫైనాన్స్ బ్రాంచ్ మేనేజర్ తెలిపారు. అలాగే శ్రీరామ్ గ్రూప్ ఉద్యోగులు సంతోషంగా ఉన్నారని, వారు ఎక్కువ ఒత్తిడికి గురికానివ్వమని త్యాగరాజన్ తెలిపారు.

వ్యాపారవేత్త శ్రీరామ్ కంపెనీలలో తన వాటాలన్నింటినీ ఉద్యోగుల సమూహానికి ఇచ్చి, వారిని 2006లో ఏర్పాటు చేసిన శ్రీరామ్ ఓనర్‌షిప్ ట్రస్ట్‌కు బదిలీ చేశారు. శాశ్వత ట్రస్ట్‌లో 44 గ్రూప్ ఎగ్జిక్యూటివ్‌లు ఉన్నారు. ఎగ్జిక్యూటివ్‌లు పదవీ విరమణ చేసినప్పుడు లక్షలాది డాలర్లు తీసుకుని వెళ్లిపోతారు. ట్రస్ట్ హోల్డింగ్ యొక్క మొత్తం విలువ $750 మిలియన్లను మించిపోయింది.

డిసెంబర్‌లో శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ కో. శ్రీరామ్ క్యాపిటల్ లిమిటెడ్, శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్‌లను షేర్-స్వాప్ డీల్‌లో విలీనం చేసుకుంది. శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ట్రక్కులకు ఆర్థిక సహాయం చేస్తుంది, శ్రీరామ్ సిటీ యూనియన్ వినియోగదారుల వస్తువులు, మోటార్‌సైకిళ్ల కొనుగోళ్లకు నిధులు సమకూరుస్తుంది. ఎగ్జిక్యూటివ్‌లు ఏళ్ల తరబడి ప్లాన్‌ చేశారని, అయితే ఆ వివరాల్లో తనకు సంబంధం లేదని త్యాగరాజన్ చెప్పారు. కానీ ప్రతి పదిహేను రోజులకు, సీనియర్ మేనేజర్లు ఆయనకు సంస్థ గురించి క్లుప్తంగా వివరిసస్తారు. ఆయన సలహాలు తీసుకుంటారు.  

Published at : 10 Aug 2023 12:42 PM (IST) Tags: Indian Tycoon R Thyagarajan 750 Million Dollor Shriram Chits

ఇవి కూడా చూడండి

గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ పెంచిన కేంద్రం, కేబినెట్ సమావేశంలో నిర్ణయం

గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ పెంచిన కేంద్రం, కేబినెట్ సమావేశంలో నిర్ణయం

NCPతో మాది రాజకీయ మైత్రి మాత్రమే, దేవేంద్ర ఫడణవీస్ కీలక వ్యాఖ్యలు

NCPతో మాది రాజకీయ మైత్రి మాత్రమే, దేవేంద్ర ఫడణవీస్ కీలక వ్యాఖ్యలు

RBI Jobs: రిజర్వ్ బ్యాంకులో 450 అసిస్టెంట్ పోస్టులు, దరఖాస్తుకు నేటితో ఆఖరు

RBI Jobs: రిజర్వ్ బ్యాంకులో 450 అసిస్టెంట్ పోస్టులు, దరఖాస్తుకు నేటితో ఆఖరు

బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది, అందుకే ఈ ఈడీ సోదాలు - కేజ్రీవాల్ విమర్శలు

బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది, అందుకే ఈ ఈడీ సోదాలు - కేజ్రీవాల్ విమర్శలు

LCA Tejas: ఎల్సీఏ తేజస్ ట్విన్-సీటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఎయిర్‌ఫోర్స్‌కు అందించిన హెచ్ఏఎల్

LCA Tejas: ఎల్సీఏ తేజస్ ట్విన్-సీటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఎయిర్‌ఫోర్స్‌కు అందించిన హెచ్ఏఎల్

టాప్ స్టోరీస్

Nobel Prize 2023 in Chemistry: రసాయన శాస్త్రంలో ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం

Nobel Prize 2023 in Chemistry: రసాయన శాస్త్రంలో ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం

APSRTC News: దసరాకు ఏపీఎస్ఆర్టీసీ 5,500 స్పెషల్‌ సర్వీసులు - ఈ నగరాల నుంచే

APSRTC News: దసరాకు ఏపీఎస్ఆర్టీసీ 5,500 స్పెషల్‌ సర్వీసులు - ఈ నగరాల నుంచే

AR Rahman: ఏఆర్ రెహమాన్‌కు ఆగ్రహం, సర్జన్స్ అసోసియేషన్‌పై రూ.10 కోట్ల పరువు నష్టం దావా

AR Rahman: ఏఆర్ రెహమాన్‌కు ఆగ్రహం, సర్జన్స్ అసోసియేషన్‌పై రూ.10 కోట్ల పరువు నష్టం దావా

Minister KTR: పంప్ హౌస్ వల్ల నిర్మల్ వాసుల కల సాకారమైంది, మంత్రి కేటీఆర్

Minister KTR: పంప్ హౌస్ వల్ల నిర్మల్ వాసుల కల సాకారమైంది, మంత్రి కేటీఆర్