India First Underwater Metro: దేశంలోనే ఫస్ట్ అండర్ వాటర్ మెట్రో రైలు సర్వీసు నేడు ప్రారంభం
దేశంలో నిర్మించిన తొలి జలాంతర్గ మెట్రోరైలు సర్వీసును ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ రోజు ప్రారంభించనున్నారు. దీనిని పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో నిర్మించారు. ఈ నిర్మాణానికిరూ.120 కోట్లు వెచ్చించారు.
India's first underwater metro: దేశంలో నిర్మించిన మొట్టమొదటి జలాంతర్గ మెట్రోరైలు(Metry rail) సర్వీసును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(PM Narendra modi) బుధవారం ప్రారంభించనున్నారు. దీనిని పశ్చిమబెంగాల్(West Bengal) రాజధాని(Capital) కోల్‌కతాలో నిర్మించారు. కోల్‌కతా ఈస్ట్ - వెస్ట్ మెట్రో కారిడార్ కింద దాదాపు 120 కోట్ల రూపాయల(Rs.120 crores) వ్యయంతో ఈ సొరంగ రైలు మార్గాన్ని హుగ్లీ నది దిగువన చేపట్టారు. కోల్‌కతా ఈస్ట్ - వెస్ట్ మెట్రో మార్గం పొడవు మొత్తం 16.6 కిలోమీటర్లు కాగా.. 10.8 కిలోమీటర్లు భూగర్భంలో ఉంటుంది. ఇందులో ప్రధాన పట్టణం హౌరా మైదాన్ నుంచి ఎస్‌ప్లెనెడ్ స్టేషన్ల మధ్య 4.8 కిలోమీటర్ల మేర ఉన్న లైనులో భాగంగా 520 మీటర్ల పొడవైన అండర్‌వాటర్ మెట్రో టన్నెల్ నిర్మించారు. నదిలోని ఈ దూరాన్ని మెట్రోరైలు 45 సెకన్లలో చేరుకోనుంది. ప్రస్తుతం హౌరా నుంచి సీల్దాకు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే గరిష్ఠంగా 90 నిమిషాల సమయం పడుతోంది. అండర్‌వాటర్ మెట్రో మార్గం ఏర్పాటుతో ఈ ప్రయాణ సమయం 40 నిమిషాలకు తగ్గనుంది. ఈ కారిడార్ పరిధిలో ఎస్‌ప్లెనెడ్, మహాకారణ్, హావ్‌డా, హావ్‌డా మైదాన్ వంటి ముఖ్యమైన స్టేషన్లు ఉన్నాయి.
ఇవీ విశేషాలు
+ నీటి అడుగున మెట్రో కోల్‌కతా జంట నగరాలు, హౌరా మరియు సాల్ట్ లేక్‌లను కలుపుతుంది. ఈ మార్గంలో ఆరు ప్రధాన స్టేషన్లు ఉన్నాయి. వాటిలో మూడు భూగర్భంలో ఉన్నాయి. ఈ మార్గాన్ని ప్రధాని ప్రారంభించనున్నరు. దీనికి పలువురు ప్రముఖులు మరియు అధికారులు హాజరవుతారు. ప్రారంభించిన వెంటనే ప్రజలకు ఈ మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి.
+ కోల్‌కతా మెట్రో హౌరా మైదాన్-ఎస్ప్లానేడ్ విభాగం ప్రత్యేకమైంది. ఇది నీటి అడుగున రైలు ప్రయాణాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం. హౌరా మెట్రో స్టేషన్ కూడా భారతదేశంలోనే అత్యంత లోతైనది. హౌరా మైదాన్-ఎస్ప్లానేడ్ విభాగం హుగ్లీ నది కింద ఏర్పాటు చేశారు.
+ హౌరా, సాల్ట్ లేక్ నగరాలు ఈ నదికి తూర్పు, పడమర ఒడ్డున ఉన్నాయి.
+ ఏప్రిల్ 2023లో, కోల్‌కతా మెట్రో ట్రయల్స్‌లో భాగంగా హుగ్లీ నది కింద సొరంగం గుండా రైలును నడిపారు. ఈ రైలు మొత్తం 4.8 కిలోమీటర్ల పొడవున ఉన్న హౌరా మైదాన్‌ను ఎస్ప్లానేడ్‌కు కలుపుతుంది. ఇది తూర్పు-పశ్చిమ మెట్రో కారిడార్‌లో భాగం. హౌరా మైదాన్‌ను ఐటీ హబ్ సాల్ట్ లేక్ సెక్టార్ Vతో కలుపుతుంది.
+ కేవలం 45 సెకన్లలో హుగ్లీ నది కింద 520 మీటర్ల మేర మెట్రో ప్రయాణించనుంది.
+ ఎస్ప్లానేడ్, సీల్దా మధ్య ఈస్ట్-వెస్ట్ అలైన్‌మెంట్ భాగం ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. అయితే, సాల్ట్ లేక్ సెక్టార్ V నుండి సీల్దా భాగం ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. మెట్రో ఆటోమేటిక్ ట్రైన్ ఆపరేషన్ (ATO) వ్యవస్థను ఉపయోగిస్తుంది. అంటే బటన్‌ను నొక్కిన తర్వాత రైలు ఆటోమేటిక్‌గా తదుపరి స్టేషన్‌కు వెళుతుంది.
+ ఈస్ట్-వెస్ట్ మెట్రో మొత్తం 16.6 కిలోమీటర్లలో, 10.8 కిలోమీటర్లు భూగర్భంలో ఉన్నాయి. ఇందులో హుగ్లీ నది కింద సొరంగం ఉంది. మిగిలినవి భూమిపైన ఉన్నాయి.
+ కోల్‌కతా మెట్రో జూన్, జూలైలో సాల్ట్ లేక్ సెక్టార్ V, హౌరా మైదాన్ మధ్య మొత్తం తూర్పు-పశ్చిమ మార్గం కోసం వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
+ భారతదేశ రవాణా రంగం అభివృద్ది దిశలో సాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఈ జలాంతర్గ మెట్రో సేవలు మరింతగా భారత కీర్తిని ప్రపంచ వ్యాప్తం చేస్తాయని అధికారులు భావిస్తున్నారు.