(Source: ECI/ABP News/ABP Majha)
India Corona Cases: దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా.. భయపెడుతున్న డెల్టా ప్లస్, కొత్త కేసులు ఎన్నంటే..
దేశంలో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసులు 3,16,55,824కు చేరాయి. మొత్తం మరణాలు 4,24,351 గా నమోదయ్యాయి. ఇక దేశంలో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 3,08,20,521కు చేరింది.
ఇండియాలో కొత్తగా వస్తున్న కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వారం రోజుల క్రితం 30 వేల దశలో ఉన్న కరోనా కేసులు ఆదివారం రోజు మరోసారి 40 వేలు దాటాయి. ఒక్క శనివారమే దేశ వ్యాప్తంగా కొత్తగా 41,831 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. కొవిడ్19 బారిన పడి మరో 541 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 39,258 మంది వైరస్ నుంచి కోలుకోగా, దేశ వ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 97.36 శాతానికి చేరింది. దీంతో దేశంలో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసులు 3,16,55,824 (3.16 కోట్ల)కు చేరాయి. మొత్తం మరణాలు 4,24,351 గా నమోదయ్యాయి. ఇక దేశంలో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 3,08,20,521కు చేరింది. యాక్టివ్ కేసులు ప్రస్తుతం 4,10,952గా ఉన్నాయి.
మరోవైపు, దేశంలో ఇప్పటివరకు 47,02,98,596 టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. శనివారం ఒక్కరోజే 60,15,842 డోసులు అందించినట్లు తెలిపింది. శనివారం 17,89,472 కరోనా టెస్టులు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పేర్కొంది.
తెలంగాణలో కరోనా కేసులు ఇలా..
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన ఒక రోజులో కొత్తగా 621 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 6,44,951కి పెరిగాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ జులై 31న హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. వైరస్ బారినపడిన వారిలో 691 మంది కోలుకున్నారు. వైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాలు 3,802కు చేరాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇవాళ్టివరకు మొత్తం 6,32,080 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. ఇంకా 9,069 యాక్టివ్ కేసులు తెలంగాణలో ఉన్నాయి. జులై 31న రాష్ట్రవ్యాప్తంగా 1,13,012 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది.
ఏపీలో రెండు రోజులుగా స్థిరంగా..
ఇక ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 78,992 నమూనాలను పరీక్షించగా.. 2,058 మందికి పాజిటివ్ అని నిర్ధరించారు. తాజాగా నమోదైన కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో 19,66,175 మంది కరోనా బారిన పడ్డారు. ఇక రోజులో 2,053 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా రికవరీ అయిన వారి సంఖ్య 19,31,618 లకు చేరింది. శుక్రవారం కంటే శనివారం కేసులు కాస్త తగ్గాయి. శుక్రవారం నాడు 2,068 కొత్త కరోనా కేసులు నమోదు కాగా.. శనివారం 10 తక్కువగా 2,058 పాజిటివ్ అని గుర్తించారు. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 364 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
Also Read: Nalgonda: పూడ్చిన శవాన్ని తవ్వి తీసి పడేశారు.. రోడ్డుపై శవపేటిక, నల్గొండలో అమానవీయ ఘటన