INDI bloc Meeting: ఇండి కూటమి నేతల కీలక భేటీ, ఖర్గే ఇంట్లో సోనియా సహా 33 మంది హాజరు
Telugu Latest News: ఇండి కూటమి నేతల సమావేశం ఢిల్లీలో జరిగింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో కూటమి పార్టీ నేతలు భేటీ అయ్యారు. 33 మంది నేతలు ఈ సమావేశంలో ఉన్నారు.
INDI bloc Meeting in Delhi: సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. ఎన్డీఏకి స్పష్టమైన మెజారిటీ ఉండడంతో ఆ కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు, ఇండి కూటమి నేతలు కూడా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో ఇండి కూటమిలోని పార్టీ నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించామని, కూటమిలోని పార్టీలు అన్నీ కలిసి కట్టుగా ఎన్డీఏపై పోరాడారని అన్నారు.
కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండి కూటమి అందర్నీ ఆశ్చర్యపర్చేలా ఎన్నికల ఫలితాలు సాధించిన సంగతి తెలిసిందే. కూటమిలో పార్టీలు అన్ని కలిపి 234 సీట్లు గెలిచాయి. ప్రస్తుతం ఎన్డీఏలో ఉన్న చంద్రబాబు, నితీష్ కుమార్‌ను కూడా కలుపుకుంటే ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చని.. ఇండి కూటమి భావిస్తోంది. కానీ, వారు ఇద్దరూ ఎన్డీఏతో కలిసి సాగుతామని ఎన్డీఏ సమావేశంలో ప్రకటించారు.
ఇండి కూటమి సమావేశంలో పాల్గొన్న నేతలు
1. మల్లికార్జున్ ఖర్గే - కాంగ్రెస్
2. సోనియా గాంధీ - కాంగ్రెస్
3. రాహుల్ గాంధీ - కాంగ్రెస్
4. కె.సి. వేణుగోపాల్ - కాంగ్రెస్
5. శరద్ పవార్ - NCP
6. సుప్రియా సూలే - ఎన్సీపీ
7. ఎం.కె. స్టాలిన్ - డిఎంకె
8. టి.ఆర్. బాలు - డిఎంకె
9. అఖిలేష్ యాదవ్ - SP
10. రాంగోపాల్ యాదవ్ - SP
11. ప్రియాంక గాంధీ వాద్రా - కాంగ్రెస్
12. అభిషేక్ బెనర్జీ - AITC
13. అరవింద్ సావంత్ - SS(UBT)
14. తేజస్వి యాదవ్ - RJD
15. సంజయ్ యాదవ్ - RJD
16. సీతారాం ఏచూరి - సిపిఐ(ఎం)
17. సంజయ్ రౌత్ - SS(UBT)
18. డి.రాజా - సి.పి.ఐ
19. చంపై సోరెన్ - JMM
20. కల్పనా సోరెన్ - JMM
21. సంజయ్ సింగ్ - AAP
22. రాఘవ్ చద్దా - AAP
23. దీపాంకర్ భట్టాచార్య - CPI(ML)
24. ఒమర్ అబ్దుల్లా - JKNC
25. సయ్యద్ సాదిక్ అలీ షిహాబ్ తంగల్ - IUML
26. P. K. కున్హాలికుట్టి - IUML
27. జోస్ కె. మణి - కెసి(ఎం)
28. తిరు తోల్. తిరుమావళవన్ - VCK
29. ఎన్.కె. ప్రేమచంద్రన్ - RSP
30. డా. ఎం.హెచ్. జవహిరుల్లా - (MMK)
31. జి. దేవరాజన్ - AIFB
32. తిరు ఇ.ఆర్. ఈశ్వరన్ - (KMDK)
33. డి. రవికుమార్ - VCK
#NewDelhi | #INDIbloc leaders hold a meeting at the residence of Congress President #MallikarjunKharge pic.twitter.com/LC75tQTCN9
— DD News (@DDNewslive) June 5, 2024