78th Independence Day Celebrations: గెలుపు పొందు వరకూ అలుపు లేదు మనకు- ఎర్రకోట నుంచి భవిష్యత్ ప్రణాళిక వివరించిన ప్రధామంత్రి మోదీ
PM Modi Calls For 'Ease Of Living':చేసే ప్రతి పని వేసే ప్రతి అడుగు ప్రజల ఆకాంక్షలు, దేశాభివృద్ధి కోసమే అన్నారు ప్రధానమంత్రి మోదీ. 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి స్పీచ్ ఇచ్చారు.
![78th Independence Day Celebrations: గెలుపు పొందు వరకూ అలుపు లేదు మనకు- ఎర్రకోట నుంచి భవిష్యత్ ప్రణాళిక వివరించిన ప్రధామంత్రి మోదీ Independence Day 2024 Celebration We Want To Lead By Bringing World's Best Practices Forward PM Modi powerful speech at red fort 78th Independence Day Celebrations: గెలుపు పొందు వరకూ అలుపు లేదు మనకు- ఎర్రకోట నుంచి భవిష్యత్ ప్రణాళిక వివరించిన ప్రధామంత్రి మోదీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/15/3db6bcdaef3665c0d077416a9f94c5411723692159747215_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
PM Modi's Powerful Speech At Red Fort: మూడవసారి దేశానికి సేవ చేసే అవకాశాన్ని ఇచ్చిన ప్రజలకు మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. దేశంలో 60 ఏళ్ల తర్వాత వరుసగా మూడోసారి దేశానికి సేవ చేసే అవకాశాన్ని ఒక పార్టీకి ప్రజలు కల్పించారని ప్రధాని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ప్రజల ఆశీర్వాదాల్లో తనకు ఒకే ఒక సందేశం కనిపిస్తోందన్నారు. ప్రతి వ్యక్తికి సేవ, ప్రతి కుటుంబానికి సేవ, ప్రతి ప్రాంతానికి సేవ చేస్తూ అభివృద్ధిలో కొత్త శిఖరాలు చేరుకోవాలనే సందేశం ప్రజలు ఇచ్చారన్నారు. ఇలాంటి తీర్పు ఇచ్చిన ప్రజలకు తాను కృతజ్ఞత తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు.
కరోనా మహమ్మారి సృష్టించిన కష్టాల మధ్యే భారతదేశం తన ఆర్థిక వ్యవస్థను వేగంగా విస్తరించిందని ప్రధాని మోదీ అన్నారు. కుల, మత, వర్గాలకు అతీతంగా ప్రతి ఇంట్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినప్పుడే దేశానికి దిశానిర్దేశం చేసినట్లన్నారు. నేడు దేశం మొత్తం త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోందని ప్రతి ఇంటిలో మూడు రంగుల జెండా ఎగురుతోందన్నారు. కులము, ఎక్కువ తక్కువ తేడా లేదు అందరూ భారతీయులేనని సందేశాన్ని చాటిచెప్పామన్నారు.
ప్రజలకు స్వేచ్ఛ లభించిందన్నారు మోదీ. ప్రతి పని, సౌకర్యం కోసం ప్రభుత్వానికి చేయి చాచే పని లేదన్నారు ప్రధాని మోదీ. నేడు ప్రభుత్వం ఇంటింటికీ కుళాయి నీరు, గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తోంది. ఇవి చిన్నచిన్నవే అయినా ప్రపంచ దేశాల్లో భారతదేశ ప్రతిష్ట పెరిగిందన్నారు.
2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన భారతదేశంగా మార్చేందుకు సూచనలు చేయాలని ప్రజలను కోరారు మోదీ. ఇప్పటికే వచ్చిన సూచనలు మన పౌరుల కలలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తున్నాయన్నారు. కొంతమంది భారతదేశాన్ని నైపుణ్యాల రాజధానిగా మార్చాలని సూచించారని పేర్కొన్నారు. మరికొందరు భారతదేశం తయారీ కేంద్రాలు కావాలని అన్నారు. దేశం స్వావలంబన సాధించాలని, గ్రీన్‌ఫీల్డ్ నగరాలు నిర్మించాలి, భారతదేశం సొంతగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలి ఇలా చాలా సూచనలు ప్రజలు చేశారు. వీటి కోసం మరింత కష్టపడి పని చేస్తామన్నారు. .
ప్రతి రంగాన్ని పరుగులు పెట్టించడంపై మా ఫోకస్: ప్రధాని మోదీ
దేశ ప్రజలు చాలా ఆకాంక్షలతో ఉన్నారని ప్రధాని మోదీ అన్నారు. ప్రతి రంగంలో పనిని వేగవంతం చేయడంపై దృష్టి పెట్టామన్నారు. మార్పు కోసం అవసరమైన మౌలిక సదుపాయాలపై పని చేద్దామన్నారు. పౌరుల మౌలిక వసతులు పటిష్టం చేయాలని అభిప్రాయపడ్డారు. దీనివల్ల ప్రజల ఆదాయం రెట్టింపు అవుతుందన్నారు. గత దశాబ్ద కాలంలో రోడ్లు, రైల్వేలు, హైవేలు, పాఠశాలలు,కళాశాలలు, ఆసుపత్రులు, వైద్య కళాశాలలు, రెండు లక్షల పంచాయతీలకు ఆప్టికల్ ఫైబర్, నాలుగు కోట్ల పక్కా ఇళ్ల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాలు కల్పించామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
1500 కంటే ఎక్కువ చట్టాలు రద్దు చేశాం: ప్రధాని మోదీ
దేశ ప్రజల కోసం అవసరం లేని 1500కు పైగా చట్టాలు రద్దు చేశామని గుర్తు చేశారు. చిన్న చిన్న తప్పులకే జైల్లో పెట్టే చట్టాలు రద్దు అయ్యాయని వివరించారు. క్రిమినల్ లా మార్చామన్నారు. ఈజ్ ఆఫ్ లివింగ్ మిషన్ దిశగా అడుగులు వేయడానికి సహాయం చేయమని ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు.
అంతరిక్ష రంగమే మనతో ముడిపడి ఉన్న భవిష్యత్తు అని మోదీ అన్నారు. అంతరిక్ష పరిశోధన రంగంలో చాలా మెరుగుపడ్డామన్నారు. వందలాది స్టార్టప్‌లు వచ్చాయని తెలిపారు. భారతదేశాన్ని బలోపేతం చేయడంలో ఈ అంతరిక్ష రంగం ముఖ్యమైందిగా అభివర్ణించారు. నేడు ప్రైవేట్ ఉపగ్రహాలు, రాకెట్లను ప్రయోగిస్తున్నారు. మన విధానం, ఉద్దేశాలు సరైనవి అయితే కచ్చితంగా మంచి ఫలితాలు లభిస్తాయని అన్నాకుయ
జాతీయ ప్రయోజనాల కోసం సంస్కరణలు చేసాము - ప్రధాని మోదీ
తమపై నమ్మకంతో బాధ్యతల అప్పగించినప్పుడు భారీ సంస్కరణలు చేపట్టాం. మేము కేవలం చప్పట్లు కొట్టడం కోసం కాకుండా మార్పు కోసం సంస్కరణలు ఎంచుకున్నాం. బలవంతంగా సంస్కరణలు అణలు చేయడం లేదు, కానీ బలోపేతం చేయడానికి అమలు చేస్తున్నాం. రాజకీయాల కోసం సంస్కరించడంలేదు. భారతదేశం గొప్పగా మారాలనే సంకల్పంతో అడుగులు వేస్తున్నాం.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)