Independence Day 2022 Live Updates: గోల్కొండ కోటలో జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
దేశం నేడు 75వ స్వాతంత్య్ర వేడుకలను జరుపుకుంటోంది. ఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఆవిష్కరించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తారు.
LIVE

Background
KCR Independence Day Celebrations: గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేసిన సీఎం కేసీఆర్
గోల్కొండ కోటపై తెలంగాణ సీఎం జాతీయ జెండాను ఎగురవేశారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం త్రివర్ణ శోభితంగా విలసిల్లుతోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. వేలాది మంది స్వాతంత్ర్య సమరయోధులు తమ ప్రాణాలు ఆర్పించి వెలుగును చాటారు. మహానీయుల త్యాగాల వల్లే స్వాతంత్ర్య ఫలాలు అనుభవిస్తున్నామని చెప్పారు. ప్రతి భారతీయుడి హృదయం ఉప్పొంగే సమయమిది అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భం ఇదని.. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ప్రభుత్వం పిలుపునిచ్చిందన్నారు. .దేశభక్తిని చాటే అనేక కార్యక్రమాలను జరుపుకోవాలన్నారు. ప్రతి భారతీయుడి గెండు అనందంతో ఉప్పొంగే సమయమిదని చెప్పారు.
KCR In Golconda Fort: గోల్కొండకు బయల్దేరిన సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ గోల్కొండ కోటకు బయలుదేరారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కోటపై సీఎం జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు గోల్కొండ కోటకు చేరుకోనున్నారు. కేసీఆర్ రాక సందర్భంగా దాదాపు వేయి మంది కళాకారులు స్వాగతం పలుకనున్నారు. జాతీయ పతాకావిష్కరణ అనంతరం పోలీస్ దళాలు, రాష్ట్రీయ సెల్యూట్ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారికి ఇప్పటికే ప్రత్యేక పాసులు జారీ చేశారు. మొత్తం కార్యక్రమాన్ని వీక్షించడానికి వీలుగా సమాచార శాఖ అధికారులు ప్రత్యేక తెరలను ఏర్పాటు చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమానికి హాజరయ్యే వారికి మంచినీటి సౌకర్యం, వర్షం వచ్చినా ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు వాటర్ ప్రూఫ్ టెంట్లను ఏర్పాటు చేశారు.
CM KCR: ప్రగతి భవన్ లో జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా 76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారితో పాటు పలువురు నాయకులు ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
CM Jagan Independence Day Celebrations: జెండా ఆవిష్కరించిన సీఎం జగన్
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో సీఎం జగన్ జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో పరేడ్ ప్రదర్శనను సీఎం జగన్ తిలకించారు. వాహనంలో సీఎంతో పాటు సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి ఉన్నారు. స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో 12 కంటిజెంట్స్ పరేడ్ నిర్వహించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో 10 బ్యాండ్స్ ప్రదర్శన చేస్తున్నారు. మరోవైపు ప్రదర్శన కోసం వివిధ శాఖలకు చెందిన శకటాలను అధికారులు ప్రదర్శిస్తున్నారు.
PM Modi Speech: చివరి వ్యక్తిని కూడా సమర్థుడ్ని చేయాలనేది ఆయన కల - మోదీ
చివరి వ్యక్తి కోసం శ్రద్ధ వహించాలనే కల, చివరి వ్యక్తిని కూడా సమర్థుడిగా మార్చాలనేది మహాత్మా గాంధీ ఆకాంక్ష. నేను దాని కోసం నన్ను అంకితం చేసుకున్నాను. ఆ ఎనిమిదేళ్లు, అనేక సంవత్సరాల స్వాతంత్య్ర అనుభవం ఫలితంగా 75 సంవత్సరాల స్వాతంత్య్రం సందర్భంగా నేను ఒక సామర్థ్యాన్ని చూడగలిగాను - మోదీ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

