హిమాచల్ ప్రదేశ్‌కు వాతావరణ శాఖ హెచ్చరిక- అధికారులు అలర్ట్!
హిమాచల్ ప్రదేశ్‌లో కొన్నిప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడినమోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సిమ్లాలోని ప్రాంతీయ వాతావరణ విభాగం తెలిపింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
![హిమాచల్ ప్రదేశ్‌కు వాతావరణ శాఖ హెచ్చరిక- అధికారులు అలర్ట్! Himachal Pradesh To Get Light To Moderate Rainfall Yellow Alert Issued know details హిమాచల్ ప్రదేశ్‌కు వాతావరణ శాఖ హెచ్చరిక- అధికారులు అలర్ట్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/11/da694e0f383065466c4c337320b031111691738711701806_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
హిమాచల్ ప్రదేశ్ లోన్ని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సిమ్లాలోని ప్రాంతీయ వాతావరణ విభాగం తెలిపింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
రానున్న మూడు గంటల్లో బిలాస్‌పూర్, హమీర్‌పూర్, కాంగ్రా, కులు, మండి , సిమ్లా, సిర్మౌర్, సోలన్, చంబా ఉనాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్ర తెలిపింది.
సోలన్, సిమ్లా, సిర్మౌర్, కాంగ్రా , మండిలలో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశలున్నాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. "చంబా , కాంగ్రా, హమీర్‌పూర్ జిల్లాలో చాలా చోట్ల ఉరుములతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
నదౌన్, సుజన్‌పూర్ తీరా, సోలన్, సిర్మౌర్, సిమ్లా, బిలాస్‌పూర్, ఉనా , మండి, కులు, సోలన్ సిమ్లా, సిర్మౌర్, కాంగ్రా, మండి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మిగిలిన జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)