By: ABP Desam | Updated at : 15 May 2023 09:49 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
హర్యానా ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఎంచక్కా పని చేస్తూనే ఆఫీసుల్లో మందు తాగచ్చొని ఫ్రీడం ఇచ్చేసింది. కొత్తగా తీసుకొచ్చిన మద్యం పాలసీలో ఈమేరకు నిర్ణయం తీసుకుంది.
కార్పొరేట్ ఆఫీసుల్లో సాధారణంగా టీ, కాఫీ, కూల్‌డ్రింక్స్ తాగడం మనం చూసే ఉంటాం. ఇకపై హర్యానాలోని కార్పొరేట్ ఆఫీసులకు వెళ్తే మాత్రం లిక్కర్ బాటిళ్లు దర్శనం ఇవ్వబోతున్నాయి. ఇప్పటి వరకు ఉన్న రూల్స్‌ను సడలించిన అక్కడి ప్రభుత్వం ఆఫీసుల్లో కూడా మద్యం సేవించవచ్చని రూల్స్ పాస్ చేసింది.
2023-24 వ సంవత్సరానికి సంబంధించిన కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చిన హర్యానా ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో హాట‌్ టాపిక్‌గా మారింది. కార్పొరేట్ ఆఫీసు క్యాంటీన్లలో మద్యం తాగొచ్చని రూల్ తీసుకొచ్చింది. ఆల్కహాల్ శాతం తక్కువ ఉన్న బీరు వైన్, వంటి మద్యాన్ని తాగేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
హర్యానా తీసుకొచ్చి ఈ కొత్త పాలసీ జూన్ 12 నుంచి అమల్లోకి రానుంది. దీనికి కొన్ని రూల్స్ పెట్టింది ప్రభుత్వం. ఇలా మద్యం సరఫరా చేయాలనుకుంటే 5వేల మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉండాలి. ఆఫీస్ విస్తీర్ణం కూడా లక్ష చదరపు అడుగులకుపైబడి ఉండాలనే షరతులు పెట్టింది ప్రభుత్వం. అలాంటి ఆఫీసుల్లోనే మద్యం తాగేందుకు అనుమతి ఉందని పేర్కొంది.
Coromandel Express Accident: ఒడిశా రైలు ప్రమాదంలో 316 మంది ఏపీ వాసులు సురక్షితం, 141 మంది ఫోన్లు స్విచ్ఛాఫ్!
Odisha Train Accident: రైల్వే మంత్రి రాజీనామా చేయాలని ప్రతిపక్షాల డిమాండ్, రైళ్లల్లో భద్రతపై ప్రశ్నల వర్షం
Odisha Train Accident LIVE: రైలు ప్రమాదంలో 288 మంది మృతి, మరో 56 మంది పరిస్థితి విషమం
ఒడిశా రైలు ప్రమాదంపై టాలీవుడ్ సినీ ప్రముఖుల దిగ్భ్రాంతి - రక్తదానం చేయాలని అభిమానులకు చిరు పిలుపు
PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ
Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!
Coromandel Express Accident: రాంగ్ ట్రాక్‌లోకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, అందుకే ఘోర ప్రమాదం - ప్రాథమిక రిపోర్ట్
Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్
Avinash Reddy To CBI : అవినాష్ రెడ్డిని 6 గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ - వాట్సాప్ కాల్స్ పైనే సమాచారం సేకరించారా ?