Gyanvapi Mosque Case: జ్ఞానవాపి మసీదులో సర్వేకి లైన్ క్లియర్, అనుమతినిచ్చిన అలహాబాద్ హైకోర్టు
Gyanvapi Mosque Case: జ్ఞానవాపి మసీదులో ASI సర్వేకి అలహాబాద్ హైకోర్టు అనుమతినిచ్చింది.

Gyanvapi Mosque Case:
సర్వే చేయాల్సిందే: అలహాబాద్ హైకోర్టు
జ్ఞానవాపి మసీదులో ఆర్కియాలజీ సర్వేకి అలహాబాద్ హైకోర్టు అంగీకరించింది. ASI సర్వే చేయొచ్చని తీర్పునిచ్చింది. ఈ సర్వే చేయడాన్ని సవాలు చేస్తూ మసీదు కమిటీ వేసిన పిటిషన్‌ని తోసిపుచ్చిన న్యాయస్థానం...సర్వేకి అనుమతినిచ్చింది. నిజానికి జులై 21వ తేదీనే ASI సర్వే చేపట్టాలని వారణాసి కోర్టు ఆదేశించింది. అది మసీదా లేకపోతే ఆలయమా తేలాలంటే ఈ సర్వే చేయాల్సిందేనని ఓ మహిళ వేసిన పిటిషన్ ఆధారంగా ఈ తీర్పునిచ్చింది. జులై 24న సర్వే మొదలైనా...మసీదు కమిటీ సుప్రీంకోర్టుని ఆశ్రయించిన కారణంగా స్టే విధించాల్సి వచ్చింది. ఈ సర్వే కారణంగా మసీదు నిర్మాణం పాక్షికంగా దెబ్బ తింటుందని, అక్కడ తవ్వడం వల్ల కూలిపోయే ప్రమాదమూ ఉందని వాదించింది మసీదు కమిటీ. అయినా ఇలాంటి ప్రాంతాల్లో సర్వే చేయడం చట్ట విరుద్ధమని తేల్చి చెప్పింది. దీనిపై అలహాబాద్ హైకోర్టుని ఆశ్రయించింది Anjuman Intezamia Masjid Committee. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం...అంతకు ముందు వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పుని సమర్థించింది. న్యాయం జరగాలంటే కచ్చితంగా ఈ సర్వే జరపాల్సిందే అని స్ఫష్టం చేసింది. ఈ తీర్పుపై స్పందించిన యూపీ డిప్యుటీ సీఎం కేశవ్ ప్రసాద్... ఈ తీర్పుతో త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Allahabad HC allows ASI to conduct survey of Gyanvapi mosque complex in Varanasi
— ANI Digital (@ani_digital) August 3, 2023
Read @ANI Story | https://t.co/4WQcnhxeTR#AllahabadHC #Gyanvapi #ASI #gyanvapisurvey pic.twitter.com/0Ubv9B8YCA
"జ్ఞానవాపి మసీదులో ASI సర్వే చేపట్టిన తరవాత నిజాలన్నీ బయటకు వస్తాయని ఆశిస్తున్నాను. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్న నమ్మకముంది"- కేశవ్ ప్రసాద్ మౌర్య, యూపీ డిప్యుటీ సీఎం
అయితే...ఈ తీర్పుపై ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (AIMPLB) మాత్రం అసహనం వ్యక్తం చేస్తోంది. ఈ తీర్పుని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకి వెళతామని వెల్లడించింది.
"మాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకముంది. దాదాపు 600 ఏళ్లుగా ఇక్కడ ముస్లింలు ప్రార్థనలు చేస్తున్నారు. చట్టం అన్ని ప్రార్థనా మందిరాలకూ వర్తించాలనేదే మా ఆకాంక్ష. వీటినీ గౌరవించాల్సిన అవసరముంది"
- మౌలానా ఖలీద్, AIMPLB ప్రతినిధి
#WATCH | Allahabad HC has said that ASI survey of Gyanvapi mosque complex to start. Sessions court order upheld by HC: Vishnu Shankar Jain, representing the Hindu side in Gyanvapi survey case pic.twitter.com/mnQJrTzS09
— ANI (@ANI) August 3, 2023
జ్ఞానవాపి మసీదు కేసుపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మసీదులో ఆవరణలో త్రిశూలం ఎందుకు ఉందని ప్రశ్నించారు. ముస్లిం పిటిషనర్లు చారిత్రక తప్పిదాన్ని సరి చేసే పరిష్కారంతో ముందుకు రావాలని డిమాండ్ చేశారు. ANIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ప్రస్తావన తీసుకొచ్చారు.
"మసీదులో త్రిశూలం ఎందుకుంది..? మేమేమీ పెట్టలేదే. అక్కడ కచ్చితంగా జ్యోతిర్లింగం ఉంది. దేవుడి ప్రతిమలున్నాయి. అక్కడి గోడలు మనకు ఏవో చెబుతున్నాయి. ఇది కచ్చితంగా ఓ చారిత్రక తప్పిదమే. దీనికి పరిష్కారం చూపించేందుకు ముస్లిం పిటిషనర్లు ముందుకు రావాలి. మాకు కావాల్సింది ఇదే. "
- యోగి ఆదిత్యనాథ్, యూపీ ముఖ్యమంత్రి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

