అన్వేషించండి

G20 Summit: జీ-20 సదస్సుకు హాజరయ్యే అధినేతల సతీమణులకు ప్రత్యేక విందు, ఎక్కడంటే?

G20 Summit: జీ-20 సదస్సుకు హాజరయ్యే అధినేతల సతీమణులకు ప్రత్యేక విందు ఇవ్వబోతున్నారు. ఢిల్లీలోని జైపుర్ హౌస్ లో మధ్యాహ్నం విందు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

G20 Summit: జీ-20 సదస్సుకు హాజరు కాబోతున్న వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులు, ఇతర నేతల సతీమణులకు ప్రత్యేక విందు ఇచ్చేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా దిల్లీలోని జైపుర్‌ హౌస్‌లో స్పెషల్ గా మధ్యాహ్న విందు ఇవ్వాలని అనుకుంటున్నారు. ఈక్రమంలోనే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మెనూలో చిరు ధాన్యాల ఆహార పదార్థాలను కూడా చేర్చారు. నేషనల్‌ గ్యాలరీ ఆఫ్‌ మోడ్రన్‌ ఆర్ట్‌ (ఎన్‌జీఎంఏ)కు కేంద్రమైన జైపుర్‌ హౌస్‌లో ప్రత్యేక పెయింటింగ్స్‌, పేరొందిన శిల్పాలు, అద్భుతమైన ఫొటోలతో పాటు అనేక రకాల కళాకృతులు ఉన్నాయి. జైపుర్‌ మహారాజు కోసం ఈ భవనాన్ని 1936లో నిర్మించారు. పుసా-ఐఏఆర్‌ఐ క్యాంపస్‌లో జీ-20 సదస్సుకు హాజరు కాబోతున్న ప్రముఖ మహిళల కోసం ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. చిరు ధాన్యాలతో ఆహార పదార్థాలతోపాటు  అద్భుతమైన, రుచికరమైన పాకశాస్త్ర ప్రవీణులు స్టార్టర్‌లను కూడా వాటితో తయారు చేస్తున్నారు.

మరోవైపు జీ20 సదస్సుకు కోసం జోరుగా ఏర్పాట్లు

ప్రతిష్టాత్మక జీ20 సదస్సు కోసం దేశ రాజధాని ఢిల్లీలో సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఈ శిఖరాగ్ర సమావేశం కోసం కట్టుదిట్టమైన భద్రతతో పాటు అంబరాన్నంటే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో రెండ్రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుకు దేశవిదేశాలకు చెందిన నేతలు హాజరుకానున్నారు. జీ20 కూటమిలో 20 దేశాల అగ్రనేతలతో పాటు మరిన్ని దేశాల ప్రతినిధులు ఈ శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రాజధాని ఢిల్లీలో భారీగా ఏర్పాట్లు చేస్తోంది. జీ20 సదస్సు జరగనున్న ప్రదేశానికి ఎదురుగా భారీ నటరాజ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. భారీ ఏర్పాట్లపై మధ్య ఈ అతిపెద్ద నటరాజ విగ్రహం సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలవనుంది.

28 అడుగుల భారీ నటరాజ విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించింది కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. ఈ విగ్రహాన్ని తమిళనాడులో ప్రత్యేకంగా రూపొందించి ఢిల్లీకి తెప్పించారు. ఈ అతిపెద్ద నటరాజ విగ్రహాన్ని తమిళనాడు కుంభకోణం తాలూకా స్వామిమలైలోని దేవ సేనాపతి శిల్పకళాశాలలో తయారు చేశారు. దేవా. రాధాకృష్ణన్, దేవా.పి. కందన్, దేవా స్వామినాథన్ తమ సహోద్యోగులతో కలిసి ఆరు నెలల పాటు శ్రమించి ఈ నటరాజ విగ్రహాన్ని రూపొందించారు. ఈ భారీ విగ్రహాన్ని తమిళనాడు నుంచి ఢిల్లీకి రోడ్డు మార్గం ద్వారా తీసుకువచ్చారు. సుదీర్ఘమైన గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి దాదాపు రెండున్నర వేల కిలోమీటర్లు ఈ విగ్రహాన్ని తరలించారు. తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మీదుగా ఢిల్లీకి చేర్చారు. శిఖరాగ్ర సదస్సు జరిగే ప్రగతి మైదాన్ లోని భారత్ మండపంలో ఈ 19 టన్నుల విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఈ నటరాజ విగ్రహాన్ని బంగారం, వెండి సహా 8 లోహాలతో తయారు చేశారు. ఈ విగ్రహం రూపకల్పన కోసం కేంద్ర మంత్రిత్వ శాఖ ఆరు నెలల ముందే ఆర్డర్ ఇచ్చింది. విగ్రహం మొత్తం ఎత్తు 22 అడుగులు కాగా.. దాని స్టాండ్ 6 అడుగుల ఎత్తు ఉంటుంది. 21 అడుగుల వెడల్పు ఉంటుంది. దాదాపు రూ.10 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లు సమాచారం. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Tirumala News: తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
India vs Bangladesh: ఈ బంగ్లా జట్టుతో అంత ఈజీ కాదు , తొలి టెస్టుకు సర్వం సిద్ధం
ఈ బంగ్లా జట్టుతో అంత ఈజీ కాదు , తొలి టెస్టుకు సర్వం సిద్ధం
Embed widget