తళతళ మెరిసిపోతున్న ఢిల్లీ రోడ్‌లు, G 20 థీమ్‌తో ఓ పార్క్‌లో కళ్లు చెదిరే డెకరేషన్
G20 Summit 2023: జీ 20 సదస్సు సందర్భంగా ఢిల్లీలోని ఓ పార్క్‌ని ఇదే థీమ్‌తో అలంకరించారు.
G20 Summit 2023:
ఢిల్లీలో జీ 20 సదస్సు
G 20 సదస్సుకి ఢిల్లీలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. పోలీసులతో పాటు సీఆర్‌పీఎఫ్ సిబ్బందితో భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలోనే సౌత్ ఢిల్లీలోని మున్సిపల్ పార్క్‌లో అతి పెద్ద థీమ్ లోగోతో పాటు జీ20లోని సభ్య దేశాల జాతీయ పతాకాలనూ ఏర్పాటు చేశారు. వీటికోసం ప్రత్యేకంగా 20 స్తంభాలు అరేంజ్ చేశారు. గ్రేటర్ కైలాశ్‌లో ఉన్న ఈ ప్రాంతంలోని పార్క్‌ని ఇలా అలంకరించారు. సదస్సుకి వచ్చే అతిథులు తమ ఆతిథ్యాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చూడడమే తమ ఉద్దేశమని స్థానిక ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ వెల్లడించారు. సెప్టెంబర్ 9-10వ తేదీల్లో జీ20 సదస్సు జరగనుంది. ఢిల్లీలోని రోడ్లన్నీ అలంకరించారు. ఎక్కడా చెత్త కనబడకుండా క్లీన్ చేశారు. గోడలపై కొత్త పెయింట్స్ వేశారు. ఈ క్రమంలోనే పార్క్‌ని G 20 థీమ్‌తో అలంకరించారు. ప్రస్తుతం స్థానికులు ఈ పార్క్‌ని G 20 పార్క్‌గా పిలుస్తున్నారు.
"20 స్తంభాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం. కాంక్రీట్ మిక్స్‌తో పాటు వుడెన్ టెక్ట్స్‌చర్‌తో వీటిని తయారు చేశాం. ప్రతి పిల్లర్‌పైనా G 20 దేశాల్లోని ప్రతి ఒక్క దేశానికీ ఓ జెండా అమర్చాం. ఇద్దరు ఆర్టిస్ట్‌లతో పాటు పది మంది కూలీలు ఇందుకోసం శ్రమించారు. ఈ పార్క్ చరిత్రలో నిలిచిపోవాలనే ఉద్దేశంతోనే ఇలా ప్రత్యేక ఏర్పాట్లు చేశాం."
- ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్
STORY | G20 commemorative park in Delhi displays logo, flags of member nations
— Press Trust of India (@PTI_News) August 29, 2023
READ: https://t.co/8M9fsLDLt1#G20India #G20Summit
(PTI Photo) pic.twitter.com/7uG5XgRAZQ
ఎప్పటికీ గుర్తుండిపోవాలనే..
అయితే...ఇదంతా మున్సిపల్ కార్పొరేషన్ ఫండ్స్ నుంచే ఖర్చు పెట్టారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఆ నిధులనే వినియోగించినప్పటికీ పెద్దగా ఖర్చు చేయలేదని స్పష్టం చేశారు. G 20 థీమ్ లోగో వెనకాల వరల్డ్ మ్యాప్ గీశారు. ఇక్కడికి వచ్చి వెళ్లే అతిథులు ఎప్పుడూ తమ ఆతిథ్యాన్ని మర్చిపోకూడదని, అందుకే ఇంతగా శ్రద్ధ పెడుతున్నామని వెల్లడించారు ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్. ఢిల్లీలోని పలు చారిత్రక కట్టడాలకూ పెయింట్స్ వేసి అందంగా తీర్చి దిద్దనున్నారు.
VIDEO | New Delhi is gearing up for G20 Leaders' Summit next month. To commemorate this historic event under India's presidency of the influential grouping, a commemorative park has been developed in the city. Flags of all 20 member nations have been mounted atop the decorative… pic.twitter.com/JIH8pmosVd
— Press Trust of India (@PTI_News) August 29, 2023
మూడు రోజుల పాటు ఢిల్లీలో లాక్డౌన్ విధించనున్నారు. ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపం కన్వెన్షన్ సెంటర్లో జరగనుందీ ఈ సమ్మిట్. ఈ రెండు, మూడు రోజుల పాటు ఎలాంటి ట్రాఫిక్ సమస్య కలగకుండా పూర్తిగా లాక్డౌన్ పెట్టారు. అంతే కాదు. పోలీసులు పలు చోట్ల తనిఖీలు చేపడుతున్నారు. ఆ రెండు రోజుల పాటు వ్యాపారాలూ బంద్ చేయాల్సిందేనని ప్రభుత్వం ఆదేశించింది. ఈ సమావేశానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ హాజరు కానున్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కీ భారత్ ఆహ్వానం పంపినప్పటికీ ఆయన రావడం లేదని తెలుస్తోంది. ఢిల్లీ, NCR ప్రాంతాల్లోని హోటల్స్‌లో రూమ్స్ బుకింగ్స్‌తో బిజీగా ఉన్నాయి.
Also Read: Google Flights: డబ్బు ఆదా చేసుకునేలా గూగుల్ కొత్త ఫీచర్- తక్కువ ధరకే విమాన టికెట్ల బుకింగ్స్