News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

G20 అతిథులకు రాష్ట్రపతి ప్రత్యేక విందు, మల్లికార్జున్ ఖర్గేకి అందని ఆహ్వానం

G20 Summit 2023: G20 సందర్భంగా రాష్ట్రపతి ఏర్పాటు చేసిన ప్రత్యేక విందుకి మల్లికార్జున్ ఖర్గే ఆహ్వానం అందలేదు.

FOLLOW US: 
Share:

G20 Summit 2023: 

రాష్ట్రపతి ప్రత్యేక విందు 

కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ మల్లికార్జున్ ఖర్గేకి G20 విందుకి ఆహ్వానం అందకపోవడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. G20 సదస్సు నేపథ్యంలో సెప్టెంబర్ 9న రాష్ట్రపతి విందు ఇవ్వనున్నారు. అయితే...రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఖర్గేకి ఆహ్వానం అందలేదని కాంగ్రెస్ వెల్లడించింది. పార్టీ అధ్యక్షుడి హోదాలో ఉన్న ఆయనకే ఇన్విటేషన్ రాకపోవడం అలజడి సృష్టించింది. అయితే...ఖర్గే ఒక్కరినే కాదని, మరే ఇతర పార్టీలకు చెందిన నేతల్నీ ఈ విందుకి ఆహ్వానించలేదని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కేవలం మంత్రులు, ముఖ్యమంత్రులకు మాత్రమే ఆహ్వానం అందిందని సమాచారం. మాజీ ప్రధానమంత్రులైన డాక్టర్ మన్మోహన్ సింగ్‌, హెచ్‌డీ దేవెగౌడనూ ఆహ్వానించారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కి ఆహ్వానం పంపారు. ఈ విందుకి హాజరవుతున్నట్టు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌ వెల్లడించారు. సెప్టెంబర్ 9 న (శనివారం) పార్లమెంట్‌ హౌజ్‌లో సాయంత్రం 6 గంటలకు విందు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలూ విధించారు. పార్లమెంట్ హౌజ్‌కి గెస్ట్‌లందరినీ సేఫ్‌గా తీసుకొచ్చేందుకు పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చశారు ఢిల్లీ పోలీసులు. భారత్ మండపంలోని మల్టీ ఫంక్షన్‌ హాల్‌లో ఈ విందు జరగనుంది. ఇదే సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలూ జరగనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ అతిథులందరినీ ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు. మొత్తం 40 మందికిపైగా ప్రతినిధులు హాజరు కానున్నారు. 

అదిరిపోయే ఆతిథ్యం..

 జీ20 సదస్సుకు వచ్చే అతిథులకు అదిరిపోయే ఆతిథ్యం ఇవ్వబోతున్నట్లు ప్రత్యేక కార్యదర్శి ముక్తేశ్ పరదేశి తెలిపారు. స్థానిక వంటకాలతో పసందుగా విందు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులకు చిరు ధాన్యాలతో కూడిన భారతీయ వంటకాల రుచి చూపిస్తామని చెప్పారు. అలాగే చిరు ధాన్యాల పౌడర్ తో ఫ్రూట్ సలాడ్లు, బెల్లం రాగి ఖీర్, స్పెషల్ మిల్లెట్ థాలి, మిల్లెట్ పలావ్, మిల్లెట్ ఇండ్లీ వంటి వంటకాలు చేయబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా రాజస్థానీ దాల్ బాటీ ఖుర్మా, పశ్చిమ బెంగాల్ రసగుల్లా, దక్షిణాది మసాలా దోశ బిహార్ లిట్టీ చోకాలనూ అతిథిలకు వండి వడ్డించబోతున్నట్లు స్పష్టం చేశారు. అలాగే చాందినీ చౌక్ వంటకాలను కూడా తినిపిస్తామని స్పష్టం చేశారు. భారతదేశం సంస్కృతి, ప్రతిబింబించేలా వెండి, బంగారు పూత పూసిన పాత్రల్లో భోజనం, ఆతిథ్యం అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అతిథులకు విలాసవంతమైన విందు కోసం వివిధ లగ్జరీ హోటళ్లలో ఈ వస్తువులను ఏర్పాటు చేశారు. అత్యంత ఆకర్షణీయమైన, అందమైన పాత్రలను ఐకానిక్ ITC తాజ్‌ హోటల్‌తో సహా 11 హోటళ్లకు పంపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందు కోసం క్రోకరీ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు. భద్రతా పరంగానూ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. AI కెమెరాలతో పహారా కాస్తున్నారు. 

Also Read: భారత్ డిజిటల్ ఇన్‌ఫ్రా అద్భుతం, 47 ఏళ్ల లక్ష్యాన్ని ఆరేళ్లలోనే సాధించింది - ప్రపంచ బ్యాంక్ కితాబు

Published at : 08 Sep 2023 12:49 PM (IST) Tags: G20 summit Mallikarjun Kharge g20 summit 2023 G20 Summit Live G20 Summit India

ఇవి కూడా చూడండి

US Visa: రికార్డు స్థాయిలో స్టూడెంట్ వీసాలు- 3 నెలల్లో 90 వేల వీసాలు ఇచ్చిన అమెరికా

US Visa: రికార్డు స్థాయిలో స్టూడెంట్ వీసాలు- 3 నెలల్లో 90 వేల వీసాలు ఇచ్చిన అమెరికా

AIADMK Breaks With BJP: ఎన్డీఏ కూటమికి అన్నాడీఎంకే గుడ్ బై - అన్నాదురైపై బీజేపీ వివాదాస్పద వ్యాఖ్యలతో కీలక నిర్ణయం

AIADMK Breaks With BJP: ఎన్డీఏ కూటమికి అన్నాడీఎంకే గుడ్ బై - అన్నాదురైపై బీజేపీ వివాదాస్పద వ్యాఖ్యలతో కీలక నిర్ణయం

Kerala: కేరళలో ఆర్మీ జవానుపై దుండగుల దాడి, తీవ్రంగా కొట్టి వీపుపై 'PFI' ముద్ర

Kerala: కేరళలో ఆర్మీ జవానుపై దుండగుల దాడి, తీవ్రంగా కొట్టి వీపుపై 'PFI' ముద్ర

Khalistani Issue: ఖలిస్థానీ ఉగ్రవాది అర్ష్‌దీప్‌కు లష్కరే తోయిబాతో సంబంధాలు?

Khalistani Issue: ఖలిస్థానీ ఉగ్రవాది అర్ష్‌దీప్‌కు లష్కరే తోయిబాతో సంబంధాలు?

C-295 MW: భారత వాయుసేనలోకి సీ-295 ఎండబ్ల్యూ తొలి విమానం

C-295 MW: భారత వాయుసేనలోకి సీ-295 ఎండబ్ల్యూ తొలి విమానం

టాప్ స్టోరీస్

బీజేపీపార్టీ ప్ర‌తినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

బీజేపీపార్టీ ప్ర‌తినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!

God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!

Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!

Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!