అన్వేషించండి

FASTag Annual Pass: ఫాస్టాగ్ ఇయర్‌ పాస్ ఎప్పుడు? ఎలా తీసుకోవాలి? పరిమితులు ఏంటీ? ట్రిప్‌ను ఎలా లెక్కిస్తారు? ఓఆర్‌ఆర్‌పై పని చేస్తుందా?

Nitin Gadkari Fastag Annual Pass: ఆగస్టు నుంచి అమలులోకి రానున్న ఫాస్టాగ్‌ ఏడాది పాస్‌పై చాలా అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. వీటిపై పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.

Nitin Gadkari Fastag Annual Pass: భారత ప్రభుత్వం ఫాస్టాగ్ ఇయర్‌ పాస్ అనే కొత్త విధానం తీసుకొచ్చింది. రూ. 3,000పెట్టి ఈ పాస్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. నేషనల్ హైవేలపై ఉన్న రద్దీని తగ్గించేందుకు ఈ విధానం తీసుకొచ్చినట్‌టు కేంద్రం చెబుతోంది. అంతే కాకుండా ఒకేసారి ఏడాదికి పాస్ తీసుకుంటే వాహనదారుడికి కూడా లాభం ఉంటుందని పేర్కొంటోంది. ఈ కొత్త విధానం 15 ఆగస్టు 2025 నుంచి అమల్లోకి రానుంది. 

ఏంటీ ఫాస్టాగ్ ఇయర్ పాస్?
ఫాస్టాగ్ ఇయర్ పాస్ అనేది ప్రైవేట్ వాహనాల కోసం రూపొందించిన విధానం. జాతీయ  రహదారులపై ఉన్న టోల్‌గేట్‌ల వద్ద ఉన్న రద్దీ, ఇతర సమస్యలు తగ్గించేందుకు  రూపొందించిన ప్రక్రియ. ఒకసారి రూ. 3,000తో రీఛార్జ్ చేస్తే ఒక సంవత్సరం పాటు వాడుకోవచ్చు. లేదా 200 సార్లు ప్రయాణాల చేసేందుకు కూడా వాడుకోవచ్చు. ఏది ముందు అవుతుందో దాన్ని పరిగణలోకి తీసుకుంటారు. 

ఈ ఇయర్ పాస్ తీసుకోవడంతో రోజు వారి పాస్ చెల్లింపులు పూర్తిగా తగ్గిపపోతాయి. అలాంటి వాహనాల కోసం ప్రత్యేకంగా రూట్‌ క్లియరెన్స్ ఉంటుంది. ఎలాంటి రద్దీ లేకుండా టోల్‌ స్టేషన్‌ల వద్ద ట్రాఫిక్‌లో ఇరుక్కోకుండా వెళ్లిపోవచ్చు. రహదారిపై రాకపోకలు సులభతరం అవుతుందనే ఉద్దేశంతోనే ఈ పథకాన్ని తీసుకొచ్చినట్టు రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఈ ప్రక్రియతో జాతీయ రహదారులపై ప్రయాణం మరింత వేగవంతా సులభతరం అవుతుదని అభిప్రాయపడ్డారు.  

ఈ పాస్ ఎప్పుడు? ఎలా కొనాలి?
ఫాస్టాగ్ ఇయర్ పాస్ 15 ఆగస్టు 2025 నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి వస్తుంది. రాజ్‌మార్గ్ యాత్ర యాప్ లేదా జాతీయ రహదారి అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI),  రోడ్డు రవాణా అండ్‌ రహదారుల శాఖ (MoRTH) అధికారిక వెబ్‌సైట్‌ల ద్వారా ఈ వార్షిక పాస్ కొనుగోలు చేయవచ్చు. ఈ పాస్‌ను కొనేందుకు మీకు ఫాస్టాగ్ ఖాతా, వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్‌, ఆన్‌లైన్ వెరిఫికేషన్ అవసరం అవుతాయి. కొనుగోలు ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. యాప్‌లో లేదా వెబ్‌సైట్‌లో ఒకసారి లాగిన్ అయిన తర్వాత వాహనానికి సంబంధించిన వివరాలు ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. తర్వాత రూ. 3,000 చెల్లించాలి. ఆ తర్వాత మీ ఫాస్టాగ్‌కు ఈ పాస్ అటాచ్ అవుతుంది.

షరతులు వర్తిస్తాయి
ఈ పాస్ ఒక సంవత్సరం మాత్రమే పని చేస్తుంది. లేదా 200 ట్రిప్‌లు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఈ రెండింటిలో ఏది ముందు అయితే దాన్నే పరిగణలోకి తీసుకుంటారు. ఒక ట్రిప్ అంటే ఒక టోల్ గేట్‌ను దాటడాన్ని ట్రిప్ అంటారు. ఉదాహరణకు హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి వెళ్లే మార్గంలో చాలా టోల్‌ గేట్‌లు ఉంటాయి. అందులో ఒక్కో టోల్‌గేట్‌ ప్రవేశం నుంచి ఎగ్జిట్ వరకు ఒకే ప్రయాణంగా లెక్కిస్తారు. అంటే ఎన్ని టోల్‌గేట్‌లు దాటితే అన్ని ట్రిప్‌లగా గుర్తిస్తారు. ఇలా 200 ప్రయాణాలు పూర్తైన తర్వాత మళ్లీ రూ. 3,000 చెల్లించి రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.  

ఈ పాస్ జాతీయ రహదారుల మీద మాత్రమే పనిచేస్తుంది. రాష్ట్ర రహదారులు లేదా స్థానిక టోల్ గేట్‌ల వద్ద పని చేయదు. అక్కడ కచ్చితంగా టోల్ రుసుములు చెల్లించాలి. ఇది కార్లు, జీపులు, వ్యాన్‌లు వంటి వ్యక్తిగత అవసరాల కోసం నిర్దేశించిన వాహనాలకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఈ పాస్ మాల్స్, విమానాశ్రయాలు, లేదా పార్కింగ్ స్థలాల్లో పనిచేయదు.  

అవుటర్ రింగ్‌రోడ్డుపై పని చేస్తుందా?
హైదరాబాద్‌ అవుటర్ రింగ్‌రోడ్డుపై కూడా టోల్ స్టేషన్‌లు ఉన్నాయి. అక్కడ మాత్రం ఈ ఇయర్‌ టోల్‌ పాస్ పని చేయదు. అక్కడ మీరు ఎప్పటికప్పుడు చెల్లింపులు చేసుకోవాల్సి ఉంటుంది. 

ఈ పాస్ ఎవరికి ఉపయోగపడుతుంది?
రోజూ జాతీయ రహదారిపై ప్రయాణించే వారికి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, వైజాగ్, విజయవాడ వంటి పెద్ద నగరాల మధ్య ఎక్కువ సార్లు తిరిగే వాళ్లకు యూజ్ అవుతుంది. 

టాప్ హెడ్ లైన్స్

అన్నమాచార్య కీర్తనకు అంతర్జాతీయ ఖ్యాతి: విదేశీయుల గొంతులో 'బ్రహ్మమొక్కటే' గూస్ బంప్స్!
అన్నమాచార్య కీర్తనకు అంతర్జాతీయ ఖ్యాతి: విదేశీయుల గొంతులో 'బ్రహ్మమొక్కటే' గూస్ బంప్స్!
Thiruparankundram Deepam: తిరుప్పరంకుండ్రం రాతిస్తంభంపై ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం.. కన్నీళ్లు పెట్టుకున్న భక్తులు
తిరుప్పరంకుండ్రం రాతిస్తంభంపై ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం.. కన్నీళ్లు పెట్టుకున్న భక్తులు
Anant Ambani: బృందావన్ వెళ్లి గోవర్ధన గిరి ప్రదక్షిణ చేసిన అనంత్ అంబానీ.. తాతయ్య, అమ్మమ్మలే ఆశీస్సులే కారణమని వెల్లడి
బృందావన్ వెళ్లి గోవర్ధన గిరి ప్రదక్షిణ చేసిన అనంత్ అంబానీ.. తాతయ్య, అమ్మమ్మలే ఆశీస్సులే కారణమని వెల్లడి
PM Modi: మా సంకల్పం అచంచలమైనది, ధైర్యంగా అడుగేద్దాం: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై ప్రధాని మోదీ
మా సంకల్పం అచంచలమైనది, ధైర్యంగా అడుగేద్దాం: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై PM Modi

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thiruparankundram Deepam: తిరుప్పరంకుండ్రం రాతిస్తంభంపై ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం.. కన్నీళ్లు పెట్టుకున్న భక్తులు
తిరుప్పరంకుండ్రం రాతిస్తంభంపై ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం.. కన్నీళ్లు పెట్టుకున్న భక్తులు
PM Modi: మా సంకల్పం అచంచలమైనది, ధైర్యంగా అడుగేద్దాం: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై ప్రధాని మోదీ
మా సంకల్పం అచంచలమైనది, ధైర్యంగా అడుగేద్దాం: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై PM Modi
విశాఖ కైలాసగిరిపై స్కూల్ బస్సు బోల్తా, విద్యార్థులకు గాయాలు - ఘటనపై పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఆరా
విశాఖ కైలాసగిరిపై స్కూల్ బస్సు బోల్తా, విద్యార్థులకు గాయాలు - ఘటనపై పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఆరా
MP Seats In AP and Telangana: గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..
గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..
పుప్పాలగూడలో అర్ధరాత్రి రియల్ ఎస్టేట్ సంస్థ దౌర్జన్యం.. కబ్జా చేసి రోడ్డు నిర్మాణంపై బాధితుల ఆగ్రహం
పుప్పాలగూడలో అర్ధరాత్రి రియల్ ఎస్టేట్ సంస్థ దౌర్జన్యం.. కబ్జా చేసి రోడ్డు నిర్మాణంపై బాధితుల ఆగ్రహం
Adilabad News: జాబ్ మానేసి బ్రోకలీ సాగు, ఆదిలాబాద్ యువ రైతుకు అధిక లాభాలు.. ఆదర్శంగా నిలుస్తున్న శివశంకర్
జాబ్ మానేసి బ్రోకలీ సాగు, ఆదిలాబాద్ యువ రైతుకు అధిక లాభాలు.. ఆదర్శంగా నిలుస్తున్న శివశంకర్
Rohit Sharma - Pollard Combo: కొత్త కోచ్‌ పొలార్డ్ పై MI కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. సరైన వ్యక్తి అతడేనంటూ ప్రశంసలు
కొత్త కోచ్‌ పొలార్డ్ పై MI కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. సరైన వ్యక్తి అతడేనంటూ ప్రశంసలు
Delimitation Bill 2026: డీలిమిటేషన్ బిల్లు 2026.. ఇండియా కూటమికి స్టాలిన్, పవార్ షాక్ ? కేంద్రం పంతం నెగ్గుతుందా
డీలిమిటేషన్ బిల్లు 2026.. ఇండియా కూటమికి స్టాలిన్, పవార్ షాక్ ? కేంద్రం పంతం నెగ్గుతుందా
Embed widget