News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

కొండపైనుంచి రాత్రి వేళ సునామీ సైరన్‌, భయంతో వణికిపోయిన ప్రజలు - చివర్లో ట్విస్ట్!

GOA: గోవాలో సునామీ సైరన్ కలకలం రేపింది. గోవాలో సునామీని రానున్నట్లు సైరన్‌ మోగడంతో తీర ప్రాంతంలో నివసించే ప్రజలంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

FOLLOW US: 
Share:

Goa: గోవాలో సునామీ సైరన్ కలకలం రేపింది. గోవాలో సునామీని రానున్నట్లు సైరన్‌ మోగడంతో తీర ప్రాంతంలో నివసించే ప్రజలంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ఉత్తర గోవా జిల్లాలోని పోర్వోరిమ్‌ కొండపై ఈడబ్ల్యూడీఎస్‌ (EWDS)ను ఏర్పాటు చేశారు. ఇది సునామీ సంభవించడానికి ముందు విపత్తును పసిగట్టి సైరన్‌ ద్వారా హెచ్చరిస్తుంది. దీంతో ప్రజలు అప్రమత్తం అవడానికి అవకాశం ఉంది. దూరంగా వెళ్లడానికి, పారిపోవడానికి ఛాన్స్ ఉంటుంది.

అయితే బుధవారం రాత్రి  పోర్వోరిమ్‌ కొండపై ఈడబ్ల్యూడీఎస్‌ (EWDS)ను ఏర్పాటు చేసిన సైరన్ మోగింది. కాసేపట్లో సునామీ రానున్నట్లు హెచ్చరిస్తూ మోగుతూనే ఉంది. దీంతో ఒక్కసారిగా అక్కడున్న వారంతా భయాందోళనలకు గురయ్యారు. సునామి వస్తుందోమోనని భయంతో పరుగులు తీశారు. దాదాపు 20 నిమిషాలపాటు సైరన్‌ మోగుతూనే ఉంది. చాలా సేపటి తరువాత అది తప్పుడు సమాచారం ఇస్తున్నట్లు ప్రజలు గ్రహించి ఊపిరి పీల్చుకున్నారు.

ఘటనపై జిల్లా కలెక్టర్‌ మము హేగే స్పందించారు. సైరన్‌ మోగుతోందని సమాచారం వచ్చిన వెంటనే ఈ విషయంపై సంబంధిత అధికారులతో చర్చించినట్లు చెప్పారు. భారత వాతావరణ శాఖ (IMD) నుంచి ఎలాంటి హెచ్చరికలు రాలేదని, సాంకేతిక సమస్య తలెత్తడం వల్లే సైరన్‌ మోగిందన్నారు. సైరన్‌ మోగడానికి గల సరైన కారణాలను తెలపాలని  రాష్ట్ర జలవనరుల శాఖ (WRD)ని కలెక్టర్‌ కోరారు. 

‘సైరన్ మోగుతున్నట్లు మాకు సమాచారం అందింది. వెంటనే వాతావరణశాఖ అధికారులతో చర్చించాం. వారు ఎలాంటి హెచ్చరికలు రాలేదన్నారు. సాంకేతిక సమస్యలతోనే సైరన్ మోగినట్లు వారు చెప్పారు. సైరన్ మోగడానికి కారణాలు చెప్పాలని అధికారులను కోరాం’ అని కలెక్టర్ తెలిపారు. 

సైరన్ గురించి స్థానికలు మాట్లాడుతూ.. ‘రాత్రి భోజనం చేసి ఇంటి బయటకు వెళ్లాం. ఆ సమయంలో సైరన్‌ మోగింది. దీంతో మేమంతా ఎంతో భయాందోళనలకు గురయ్యాం. చాలాసేపు అది మోగుతూనే ఉంది. చాలా మంది భయంతో పరుగులు తీశారు. అయితే ఎటువంటి ప్రమాదం జరగలేదు. కానీ సముద్రం నుంచి అలజడి లేదు. సైరన్‌ తప్పుడు హెచ్చరిక జారీ చేస్తోందని గ్రహించి ఊపిరి పీల్చుకున్నాం’ తెలిపారు. 

Published at : 07 Sep 2023 09:05 PM (IST) Tags: Tsunami Alarm Panic In Goa Tsunami warning

ఇవి కూడా చూడండి

Drugs Seized: 300 కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్‌ చేసిన జమ్మూకశ్మీర్ పోలీసులు

Drugs Seized: 300 కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్‌ చేసిన జమ్మూకశ్మీర్ పోలీసులు

UGC NET 2023 Notification: యూజీసీనెట్ (డిసెంబరు)-2023 నోటిఫికేషన్ విడుదల, పరీక్షలు ఎప్పుడంటే?

UGC NET 2023 Notification: యూజీసీనెట్ (డిసెంబరు)-2023 నోటిఫికేషన్ విడుదల, పరీక్షలు ఎప్పుడంటే?

చీపురు పట్టి ఊడ్చిన ప్రధాని మోదీ, స్వచ్ఛతా హీ సేవాలో భాగంగా గంటపాటు శ్రమదానం

చీపురు పట్టి ఊడ్చిన ప్రధాని మోదీ, స్వచ్ఛతా హీ సేవాలో భాగంగా గంటపాటు శ్రమదానం

ఎలక్ట్రిక్ కార్‌లో ఉన్నట్టుండి మంటలు, చూస్తుండగానే కాలి బూడిదైపోయింది - వైరల్ వీడియో

ఎలక్ట్రిక్ కార్‌లో ఉన్నట్టుండి మంటలు, చూస్తుండగానే కాలి బూడిదైపోయింది - వైరల్ వీడియో

కార్‌పూలింగ్‌ని బ్యాన్ చేసిన బెంగళూరు, ఉల్లంఘిస్తే రూ.10 వేల జరిమానా - కారణమిదే

కార్‌పూలింగ్‌ని బ్యాన్ చేసిన బెంగళూరు, ఉల్లంఘిస్తే రూ.10 వేల జరిమానా - కారణమిదే

టాప్ స్టోరీస్

Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు

Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు

బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా

బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా

Lal Salaam Release : సంక్రాంతి బరిలో రజనీకాంత్ సినిమా - రేసులో 'లాల్ సలాం'

Lal Salaam Release : సంక్రాంతి బరిలో రజనీకాంత్ సినిమా - రేసులో 'లాల్ సలాం'

ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్‌కి 3 కోట్లు తీసుకునే బాలీవుడ్ సెలబ్రిటీ ఎవరో తెలుసా?

ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్‌కి 3 కోట్లు తీసుకునే బాలీవుడ్ సెలబ్రిటీ ఎవరో తెలుసా?