అన్వేషించండి

EPFO WhatsApp services: ఈపీఎఫ్‌ఓ గుడ్‌న్యూస్‌.. ఇకపై వాట్సప్‌లోనే సేవలు, ఆటోమేటిక్‌ సెటిల్‌మెంట్‌!

EPFO WhatsApp services: ఈపీఎఫ్ఓ చందాదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు వాట్సాప్ నెంబర్‌ను ప్రారంభించింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కేంద్ర మంత్రి ఈపీఎఫ్ఓ వాట్సాప్ సేవలను అధికారికంగా ప్రారంభించారు.
  • 8796441800కు హాయ్ పంపితే పీఎఫ్ వివరాలు లభ్యం.
  • వెయ్యి లోపు నిష్క్రియ ఖాతాలకు ఆటోమేటిక్ సెటిల్‌మెంట్ వర్తిస్తుంది.
  • లక్ష ఖాతాల్లో రూ.5 కోట్ల నిధులు లబ్ధిదారులకు చేరుతాయి.

EPFO WhatsApp services: ఈపీఎఫ్ఓ తమ సబ్‌స్క్రైబర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై వాట్సాప్‌లోనూ ఈపీఎఫ్ఓ సేవలు అందుబాటులోకి తీసుకురానుంది.  ఈపీఎఫ్‌ఓ 74వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్‌ మాండవీయ ఈ కొత్త సేవలను అధికారికంగా ప్రకటించారు. డిజిటల్ సేవలను మరింత విస్తరింపజేసేలా వాట్సాప్ చాట్‌బాట్ సేవలతో పాటు, ఇనాక్టివ్ ఖాతాల కోసం ఆటోమేటిక్ సెటిల్‌మెంట్ విధానాన్ని ప్రారంభించారు.

వాట్సాప్‌ ద్వారా ఈపీఎఫ్‌ఓ సేవలు

ఇకపై పీఎఫ్‌ చందాదారులు తమ మొబైల్‌లో 8796441800 నెంబర్ సేవ్ చేసుకుని, వాట్సాప్ ద్వారా ఆ నెంబరుకు 'Hi' లేదా 'Hello' అని మెసేజ్ చేస్తే సరిపోతుంది. వెంటనే ఈపీఎఫ్‌ఓ చాట్‌బాట్ స్పందించి, వివిధ రకాల ఆప్షన్లను చూపిస్తుంది. ఈ సేవలను మరింత సులభంగా పొందడానికి, పీఎఫ్‌ అకౌంట్‌కు లింక్ చేసిన మొబైల్ నెంబర్ నుంచే వాట్సాప్ చాట్ చేయడం బెస్ట్ ఆప్షన్.

వాట్సాప్‌లో సేవలు 

  1. పీఎఫ్‌ బ్యాలెన్స్ చెక్ చేయడం
  2. పీఎఫ్ పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేసుకోవడం
  3. లాస్ట్ 5 లావాదేవీల చెక్ చేయడం 

ఆటోమేటిక్ సెటిల్‌మెంట్‌  

చాలా కాలంగా వాడుకలో లేని పీఎఫ్‌ ఖాతాల కోసం ఈపీఎఫ్‌ఓ సరికొత్త ఆటోమేటిక్ సెటిల్‌మెంట్ విధానానికి శ్రీకారం చుట్టింది. ఆధార్‌తో వెరిఫికేషన్ అయ్యి, వాడకంలో లేని రూ.1,000 వరకు బ్యాలెన్స్ ఉన్న ఖాతాలకు ఇది వర్తిస్తుంది. ఈ తక్కువ మొత్తాన్ని విత్‌డ్రా చేయడానికి చందాదారులు ఎటువంటి ప్రత్యేక క్లెయిమ్‌లు ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. గుర్తింపు, బ్యాంక్ ఖాతా ధ్రువీకరణ పూర్తయిన తర్వాత, ఈపీఎఫ్‌ఓ సంస్థే స్వయంగా ఆ డబ్బును లబ్ధిదారుల ఖాతాకు జమ చేస్తుంది. దీనివల్ల సుమారు లక్ష ఖాతాల్లో నిరుపయోగంగా ఉన్న రూ.5 కోట్ల నిధులు నేరుగా లబ్ధిదారులకు చేరనున్నాయి.

దేశవ్యాప్తంగా 8 కోట్ల మందికి పైగా సభ్యులు ఈపీఎఫ్‌ఓలో రూ.32 లక్షల కోట్లను దాచుకున్నారు. చందాదారులకు మరింత మెరుగైన సేవలు అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని మంత్రి మన్సుఖ్‌ మాండవీయ వెల్లడించారు.

వాట్సాప్ చాట్‌బాట్ సేవలను వినియోగించుకునే సమయంలో యూనివర్సల్ అకౌంట్ నెంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు యాక్టివ్‌గా ఉండటం ముఖ్యం. ఒకవేళ మీ మొబైల్ నంబర్ పీఎఫ్ ఖాతాకు లింక్ అయి ఉండకపోతే, ముందుగా అధికారిక ఈపీఎఫ్‌ఓ పోర్టల్ ద్వారా నెంబర్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. వాట్సాప్‌తో పాటు పీఎఫ్ సేవలు పొందడానికి ఉమంగ్ యాప్, ఈపీఎఫ్‌ఓ మెంబర్ పోర్టల్, టోల్-ఫ్రీ నంబర్ల సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయి.

Frequently Asked Questions

ఈపీఎఫ్ఓ వాట్సాప్ సేవలను ఎప్పుడు ప్రారంభించింది?

ఈపీఎఫ్ఓ తన 74వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వాట్సాప్ చాట్‌బాట్ సేవలను ప్రారంభించింది. కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్‌ మాండవీయ ఈ కొత్త సేవలను ప్రకటించారు.

ఈపీఎఫ్ఓ వాట్సాప్ సేవలను ఎలా ఉపయోగించాలి?

మీ మొబైల్‌లో 8796441800 నెంబర్‌ను సేవ్ చేసుకుని, వాట్సాప్ ద్వారా 'Hi' లేదా 'Hello' అని మెసేజ్ చేయాలి. పీఎఫ్‌ అకౌంట్‌కు లింక్ చేసిన మొబైల్ నెంబర్ నుంచే చాట్ చేయడం ఉత్తమం.

వాట్సాప్ ద్వారా ఎలాంటి పీఎఫ్ సేవలు పొందవచ్చు?

వాట్సాప్ ద్వారా పీఎఫ్‌ బ్యాలెన్స్ చెక్ చేయడం, పీఎఫ్ పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేసుకోవడం, చివరి 5 లావాదేవీలను చెక్ చేయడం వంటివి చేయవచ్చు.

ఇనాక్టివ్ పీఎఫ్ ఖాతాలకు ఆటోమేటిక్ సెటిల్‌మెంట్ అంటే ఏమిటి?

చాలా కాలంగా వాడకంలో లేని, ఆధార్‌తో వెరిఫై అయిన రూ.1,000 వరకు బ్యాలెన్స్ ఉన్న ఖాతాలకు ఇది వర్తిస్తుంది. చందాదారులు క్లెయిమ్ చేయకుండానే ఈపీఎఫ్ఓ స్వయంగా డబ్బును లబ్ధిదారుల ఖాతాకు జమ చేస్తుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

EPFO కొత్త రూల్స్.. హోమ్ లోన్ కోసం పీఎఫ్ ఖాతా నుంచి ఎంత విత్‌డ్రా చేయవచ్చు
EPFO కొత్త రూల్స్.. హోమ్ లోన్ కోసం పీఎఫ్ ఖాతా నుంచి ఎంత విత్‌డ్రా చేయవచ్చు
Kolathur By Election 2026: కొళత్తూర్ ఉపఎన్నికతో అసెంబ్లీలో స్టాలిన్ రీఎంట్రీ ఛాన్స్.. తమిళనాట వేడెక్కిన రాజకీయం!
కొళత్తూర్ ఉపఎన్నికతో అసెంబ్లీలో స్టాలిన్ రీఎంట్రీ ఛాన్స్.. తమిళనాట వేడెక్కిన రాజకీయం!
Rajasthan Panchayat Polls: రాజస్థాన్ పంచాయతీ ఎన్నికల్లో అధికార బీజేపీకి షాక్.. సిరోహిలో 27కి 22 జడ్పీ స్థానాలు హస్తగతం!
రాజస్థాన్ పంచాయతీ ఎన్నికల్లో అధికార బీజేపీకి షాక్.. సిరోహిలో 27కి 22 జడ్పీ స్థానాలు హస్తగతం!
UP CM Yogi Tears: తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Movie Piracy Gang Arrest: సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
Reliance Beverage Plant: 12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
Union Minister Kishan Reddy On Drugs: హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
Job Fraud: మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
Rukmini Kota Vs Nagarjuna Yadav: ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల పరువు నష్టం దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
CM Chandrababu: ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
Consumer Loan: దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
UP CM Yogi Tears: తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
Embed widget