అన్వేషించండి

Dry Day: రామ మందిర ప్రతిష్టాపన - ఈ నెల 22న ఆ 3 రాష్ట్రాల్లో 'డ్రై డే'

Wine Shops: ఈ నెల 22న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి రామతీర్థ క్షేత్ర ట్రస్ట్ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో ఆ రోజున 3 రాష్ట్రాలు 'డ్రై డే'గా ప్రకటించాయి.

Dry Day Due to Ram Mandir Temple Inauguration: అయోధ్యలో (Ayodhya) ఈ నెల 22న (సోమవారం) రామ మందిర ప్రారంభోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని మోదీ (Modi) చేతుల మీదుగా రామ మందిరం ప్రారంభం కానుంది. బాలరాముడిని ఆయన చేతుల మీదుగా ప్రతిష్టించనున్నారు. ఈ వేడుకకు ముందు దాదాపు 11 రోజులు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టనుంది. ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది తరలి రానున్నారు. వేలాది మంది సాధువులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. రామ మందిరాన్ని నిర్మించిన కూలీల కుటుంబ సభ్యులకూ ఆహ్వానం అందింది. దాదాపు 11 వేల మంది ప్రముఖులు ఈ వేడుకకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అతిథులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రామతీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాట్లు చేస్తోంది.

ఆ రాష్ట్రాల్లో 'డ్రై డే'

రామ మందిర వేడుక నేపథ్యంలో ఈ నెల 22న పలు రాష్ట్రాలు 'డ్రై డే'గా (Dry Day) ప్రకటించాయి. ఆ రోజున అయోధ్యతో సహా రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలను మూసివేయాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్ణయించారు. అలాగే, మాంసం దుకాణాలు సైతం మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రత్యేక కార్యక్రమం నేపథ్యంలో ఆ రోజున రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అదే బాటలో ఛత్తీస్ గఢ్, అసోం సైతం ఆ రోజును 'డ్రై డే'గా పాటించనున్నారు. రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఈ నెల 22న రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాలు, పబ్బులు మూసి వేయనున్నట్లు ఛత్తీస్ గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయ్ తెలిపారు. అలాగే, అయోధ్యకు 300 మెట్రిక్ టన్నుల సువాసన గల బియ్యాన్ని పంపనున్నట్లు చెప్పారు. ఆ రోజున అస్సాంలో సైతం మద్యం దుకాణాలు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జయంత్ మల్లా వెల్లడించారు. అటు, రాజస్థాన్ లోని కొన్ని ప్రాంతాల్లోనే ఆంక్షలు విధించారు. జైపూర్ మున్సిపాలిటీ పరిధిలోని హెరిటేజ్ ఏరియాల్లో 22న మాంసం దుకాణాలు మూసివేయనున్నారు.

'డ్రై డే' అంటే.?

'డ్రై డే' అంటే మద్యం పానీయాల అమ్మకాలకు అనుమతించని రోజు అని అర్థం. ఆ రోజున మద్యం దుకాణాలు సహా పబ్బులు, రెస్టారెంట్లలోనూ మద్యం విక్రయాలకు అనుమతించరు. జనవరి 22న జాతీయ పండుగలా జరుపుకొంటామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే ప్రకటించారు. న్యూయార్క్ లోని ఐకానిక్ టైమ్ స్క్వేర్ నుంచి రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో దేశంలోని వేలాది దేవాలయాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ భారతీయ రాయబార కార్యాలయాలు, కాన్సులేట్స్ ల్లోనూ ప్రసారం చేయనున్నారు.

పూర్తి షెడ్యూల్ ఇదే

  • ఈ నెల 15న అయోధ్యలో యజ్ఞ క్రతువులు ప్రారంభం కానున్నాయి. రాముడి విగ్రహాన్ని యాగశాల మండపంలోకి తీసుకొస్తారు.
  • ఈ నెల 16న శ్రీరాముని విగ్రహానికి ప్రతిష్టాపన ఆచారాలు ప్రారంభం, 17న విగ్రహ ఊరేగింపు, 18న మండప ప్రవేశ పూజ, వాస్తు, వరుణ, గణేశ పూజలతో ప్రాణ ప్రతిష్ట పవిత్రోత్సవానికి శ్రీకారం
  • ఈ నెల 19న యజ్ఞ అగ్ని గుండం స్థాపన, 20న 81 కలశాలతో పుణ్యాహవచనంతో రామ మందిర గర్భగుడిని వేద మంత్రాలతో పవిత్రం చేస్తారు.
  • ఈ నెల 21న జలాధివాసం అంటే అయోధ్య రాముడి విగ్రహాన్ని 125 కలశాల పవిత్ర జలాలతో అభిషేకం. ఈ నెల 22న అయోధ్య రామయ్య విగ్రహ ప్రతిష్టాపన. ఆ రోజున మృగశిర నక్షత్రం సందర్భంగా.. మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 8 సెకనుల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల మధ్య 84 సెకన్ల పాటు శుభ ఘడియల సమయంలో గర్భగుడిలో కేటాయించిన స్థలంలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. 
  • ఈ నెల 24 నుంచి అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు భక్తులకు అనుమతించనున్నారు.

దర్శన టైమింగ్స్ ఇవే

ప్రతిరోజూ ఉదయం 7 నుంచి 11:30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు, ప్రత్యేక సందర్భాల్లో.. పండుగల సమయాల్లో దర్శన వేళల్లో మార్పులుంటాయని అయోధ్య రామ తీర్ధ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. అలాగే, ఉదయం 6 : 30 గంటలకు శృంగార్ హారతి, మధ్యాహ్నం 12 గంటలకు భోగ్ హారతి, సాయంత్రం 07:30  గంటకు సంధ్యా హారతి నిర్వహించనున్నట్లు తెలిపింది. భక్తులందరికీ రామ మందిరంలోకి ప్రవేశం ఉచితమే కానీ ప్రత్యేక దర్శనం చేసుకోవాలనుకునే భక్తులకు టిక్కెట్లు కూడా అందుబాటులో ఉంచనున్నారు. వీటిని ఆన్‌లైన్‌లో కొనుక్కోవచ్చు. టిక్కెట్ ధర ఒక్కొక్కరికి రూ.100 నుంచి రూ.300 వరకు ఉంటుంది. 

నిబంధనలివే

  • రామ మందిరంలోనికి ప్రవేశించేటప్పుడు భక్తులు తప్పనిసరిగా డ్రెస్ కోడ్‌ను పాటించాలి. ఆలయంలోనికి ప్రవేశించే సమయంలో భక్తులు సంప్రదాయ బద్ధమైన దుస్తులు మాత్రమే ధరించాలి.
  • పురుషులు ధోతీ, గంచా, కుర్తా-పైజామాను ధరించాల్సి ఉంటుంది. మహిళలు చీర లేదా సల్వార్ సూట్స్, పంజాబీ డ్రెస్ ధరించవచ్చు. జీన్స్ ప్యాంట్స్, షర్ట్స్, టాప్స్, షార్ట్స్ లేదా వెస్ట్రన్ డ్రెస్సులను అస్సలు అనుమతించరు.
  • భక్తులు తమ వెంట మొబైల్ ఫోన్లను తీసుకుని వెళ్లడం నిషేధం, పర్సులు, హ్యాండ్ బ్యాగులు, వాలెట్స్, ఇయర్ ఫోన్లు, హెడ్ ఫోన్లు, రిమోట్‌తో కూడిన కీ- చైన్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను ఆలయంలోనికి తీసుకెళ్లకూడదు, గొడుగులు, బ్లాంకెట్లు, గురు పాదుకలను తీసుకెళ్లడంపైనా నిషేధం ఉంది.

Also Read: Ram Mandir Inauguration: రాముడి ప్రాణప్రతిష్ఠ చేసేందుకే దేవుడు నన్ను పుట్టించాడేమో - ప్రధాని మోదీ భావోద్వేగం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Good News For Farmers: సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
Tirumala Brahmotsavalu 2024: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
Ola Offer: రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
Telangana News: కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rupai Village Story | ఈ ఊరి పేరు వెనుక స్టోరీ వింటే ఆశ్చర్యపోతారు | ABP DesamThalapathy69 Cast Reveal | తలపతి విజయ్ ఆఖరి సినిమా కథ ఇదేనా.? | ABP DesamRohit Sharma on Virat Kohli | టెస్ట్ క్రికెట్ లో టీమిండియా ప్రభంజనం..ఓపెన్ అయిన రోహిత్ | ABP Desamఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Good News For Farmers: సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
Tirumala Brahmotsavalu 2024: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
Ola Offer: రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
Telangana News: కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
Jio Best 5G Plan: జియో చవకైన 5జీ ప్లాన్ - రూ.200 లోపే అన్‌లిమిటెడ్ డేటా!
జియో చవకైన 5జీ ప్లాన్ - రూ.200 లోపే అన్‌లిమిటెడ్ డేటా!
Raashi Khanna : గ్రే సూట్​లో హాట్​ ఫోటోషూట్ చేసిన రాశీ ఖన్నా.. స్టైలిష్​ లుక్స్​ చూశారా?
గ్రే సూట్​లో హాట్​ ఫోటోషూట్ చేసిన రాశీ ఖన్నా.. స్టైలిష్​ లుక్స్​ చూశారా?
Nagarjuna Defamation: మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన నాగార్జున, ఏం డిమాండ్ చేశారంటే!
మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన నాగార్జున, ఏం డిమాండ్ చేశారంటే!
Happy Dussehra 2024 : దసరా శుభాకాంక్షలు సోషల్ మీడియాలో ఇలా చెప్పేయండి.. ఫేస్​బుక్, వాట్సాప్​ల​లో ఇవి షేర్ చేసేయండి
దసరా శుభాకాంక్షలు సోషల్ మీడియాలో ఇలా చెప్పేయండి.. ఫేస్​బుక్, వాట్సాప్​ల​లో ఇవి షేర్ చేసేయండి
Embed widget