అన్వేషించండి

Donald Trump Tariff on India: భారత్-అమెరికా ట్రేడ్ డీల్: ఎంత టారిఫ్ విధించబోతున్నారో తెలిపిన డొనాల్డ్ ట్రంప్

US Tariff on India | భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. భారత్ మీద ఎంత టారిఫ్ విధించే అవకాశం ఉందో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.

India US Trade Deal from August 1: అమెరికా ప్రభుత్వం విధిస్తున్న కొత్త సుంకాలు ఆగస్టు 1 నుంచి పలు దేశాల్లో అమల్లోకి రానున్నాయి. ఇంకా భారత్, అమెరికా దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరలేదు. డెడ్ లైన్ దగ్గర పడుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారతదేశంపై ఎంత శాతం సుంకం విధించబోతున్నారో తన మనసులో మాటల్లో చెప్పారు. తాజాగా ట్రంప్ మాట్లాడుతూ.. భారత్ తమకు మిత్రదేశమని పేర్కొన్నారు. తమ సూచన మేరకు భారత్, పాకిస్తాన్ యుద్ధాన్ని విరమించుకున్నాయని మరోసారి ప్రస్తావించారు. భారత్ -అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. భారతదేశంపై అమెరికా 20-25 శాతం వరకు సుంకాలు విధించే అవకాశం ఉందని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.

 అమెరికా నుంచి ఎక్కువ సుంకాలు వసూలు చేస్తున్న భారత్

ఇటీవల ఎయిర్ ఫోర్స్ వన్ లో జరిగిన మీడియా సమావేశంలో డొనాాల్డ్ ట్రంప్ మాట్లాడారు. భారత్ తమకు మిత్రదేశం అని, ఇతర దేశాలలాగే వారిపై సైతం టారిఫ్ విధిస్తాం అన్నారు. అమెరికా భారతదేశంపై 20 నుంచి 25 శాతం వరకు సుంకాలు విధించనుందని స్పష్టం చేశారు. ఇతర దేశాలతో పోలిస్తే అమెరికా నుండి భారత్ ఎక్కువ సుంకాలు వసూలు చేస్తోందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. తాను పదవిలో ఉన్నంత కాలం టారిఫ్ కొనసాగుతాయని ట్రంప్ అన్నారు. ఇప్పటివరకు అమెరికా విధించనున్న సుంకాలకు సంబంధించి భారతదేశానికి అధికారికంగా ఎలాంటి లేఖ రాలేదని అధికారులు తెలిపారు.

అమెరికాకు భారత్ గుడ్ ఫ్రెండ్.. కానీ

"భారత్ అమెరికాకు మంచి మిత్రుడు, కానీ గత కొన్నేళ్లుగా ఇతర దేశాలతో పోలిస్తే భారత్ మా మీద ఎక్కువ సుంకాలు విధించింది. ఇక నుంచి ఇలాంటివి జరగకుండా చూసుకుంటాను. వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. నా నిర్ణయాలు అమెరికాకు చాలా ప్రయోజనాలు చేకూర్చుతాయి" అన్నారు. భారతదేశం నుండి అమెరికాకు వచ్చే ఉత్పత్తులపై ఏప్రిల్ 22న ట్రంప్ 26 శాతం సుంకం విధించారు. తరువాత  కొంతకాలం పాటు నిషేధం విధించారు.

వాణిజ్య ఒప్పందంపై భారతదేశం వైఖరి ఏమిటి?

కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ ఇటీవల మాట్లాడుతూ.. భారత్, అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు మొదలయ్యాయి. ప్రస్తుతానికి అంతా బాగుంది. భారత్ ఎంతో ఆత్మవిశ్వాసంతో చర్చలు జరుపుతోంది. ఇదే ఆత్మవిశ్వాసం మనల్ని స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి ప్రోత్సహిస్తుంది" అని అన్నారు. గత వారం ప్రధానమంత్రి మోదీ బ్రిటన్ పర్యటన సందర్భంగా, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ సైతం ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA)పై అమెరికాతో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. 

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Indiramma Indlu in Urban Area: తెలంగాణ పట్టణాల్లో గూడులేని పేదలకు గుడ్‌న్యూస్- జి ప్లస్1 తరహాలో ఇల్లు కట్టుకునేందుకు అవకాశం
తెలంగాణ పట్టణాల్లో గూడులేని పేదలకు గుడ్‌న్యూస్- జి ప్లస్1 తరహాలో ఇల్లు కట్టుకునేందుకు అవకాశం
Tuni Rapist Issue: తుని కీచక వృద్ధుడిపై పోక్సో కేసు - తమ పార్టీ కాదన్న టీడీపీ - చంద్రబాబు,లోకేష్ స్పందన
తుని కీచక వృద్ధుడిపై పోక్సో కేసు - తమ పార్టీ కాదన్న టీడీపీ - చంద్రబాబు,లోకేష్ స్పందన
Nakkapalli Bulk Drug Park: నక్కపల్లి బల్క్‌డ్రగ్‌ పార్క్‌ చుట్టూ రాజకీయం ! ప్రజల బలహీనతతో ఆడుకుంటున్న పార్టీలు! 
నక్కపల్లి బల్క్‌డ్రగ్‌ పార్క్‌ చుట్టూ రాజకీయం ! ప్రజల బలహీనతతో ఆడుకుంటున్న పార్టీలు! 
8th Pay Commission: ఎనిమిదో వేతన సంఘంపై శుభవార్త! కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పెద్ద అప్‌డేట్ వచ్చింది!
ఎనిమిదో వేతన సంఘంపై శుభవార్త! కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పెద్ద అప్‌డేట్ వచ్చింది!
Advertisement

వీడియోలు

1987 Opera House Jewelry Heist | 40 సంవత్సరాలుగా దొరకని దొంగ
టెస్ట్‌ సిరీస్ కెప్టెన్‌గా పంత్.. వైస్ కెప్టెన్‌గా సాయి సుదర్శన్
ఒరే ఆజామూ..  1000 రోజులైందిరా!
బీసీసీఐ వార్నింగ్‌కి బెదరని నఖ్వి.. ట్రోఫీ నేనే ఇస్తానంటూ మొండి పట్టు
బంగ్లాదేశ్‌పై శ్రీలంక గెలుపుతో ఇండియాకి లైన్ క్లియర్!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Indlu in Urban Area: తెలంగాణ పట్టణాల్లో గూడులేని పేదలకు గుడ్‌న్యూస్- జి ప్లస్1 తరహాలో ఇల్లు కట్టుకునేందుకు అవకాశం
తెలంగాణ పట్టణాల్లో గూడులేని పేదలకు గుడ్‌న్యూస్- జి ప్లస్1 తరహాలో ఇల్లు కట్టుకునేందుకు అవకాశం
Tuni Rapist Issue: తుని కీచక వృద్ధుడిపై పోక్సో కేసు - తమ పార్టీ కాదన్న టీడీపీ - చంద్రబాబు,లోకేష్ స్పందన
తుని కీచక వృద్ధుడిపై పోక్సో కేసు - తమ పార్టీ కాదన్న టీడీపీ - చంద్రబాబు,లోకేష్ స్పందన
Nakkapalli Bulk Drug Park: నక్కపల్లి బల్క్‌డ్రగ్‌ పార్క్‌ చుట్టూ రాజకీయం ! ప్రజల బలహీనతతో ఆడుకుంటున్న పార్టీలు! 
నక్కపల్లి బల్క్‌డ్రగ్‌ పార్క్‌ చుట్టూ రాజకీయం ! ప్రజల బలహీనతతో ఆడుకుంటున్న పార్టీలు! 
8th Pay Commission: ఎనిమిదో వేతన సంఘంపై శుభవార్త! కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పెద్ద అప్‌డేట్ వచ్చింది!
ఎనిమిదో వేతన సంఘంపై శుభవార్త! కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పెద్ద అప్‌డేట్ వచ్చింది!
Telangana:  తెలంగాణ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ట్రాన్స్‌పోర్ట్ చెక్‌పోస్టుల మూసివేత - అవినీతి ఆరోపణలే కారణం
తెలంగాణ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ట్రాన్స్‌పోర్ట్ చెక్‌పోస్టుల మూసివేత - అవినీతి ఆరోపణలే కారణం
Tuni Crime News: బాలికపై టీడీపీ నేత అత్యాచారయత్నం..! తోటలోకి తీసుకెళ్లి వెకిలి చేష్టలు.. పోక్సో కేసు
బాలికపై టీడీపీ నేత అత్యాచారయత్నం..! తోటలోకి తీసుకెళ్లి వెకిలి చేష్టలు.. పోక్సో కేసు
Amazon: ఐ ఫోన్‌ ఆర్డరిస్తే ఐక్యూ ఫోన్ డెలివరీ - అమెజాన్‌ను కోర్టుకు లాగిన కర్నూలు వాసి !
ఐ ఫోన్‌ ఆర్డరిస్తే ఐక్యూ ఫోన్ డెలివరీ - అమెజాన్‌ను కోర్టుకు లాగిన కర్నూలు వాసి !
Mass Jathara First Review: 'మాస్ జాతర' ఫస్ట్ రివ్యూ... ఆ గంటసేపూ ఊగిపోతాయ్ - రవితేజ అభిమానులకు కిక్ ఇచ్చేలా!
'మాస్ జాతర' ఫస్ట్ రివ్యూ... ఆ గంటసేపూ ఊగిపోతాయ్ - రవితేజ అభిమానులకు కిక్ ఇచ్చేలా!
Embed widget