Book Uber via Whatsapp: ఇకపై వాట్సాప్‌లోనే సింపుల్‌గా క్యాబ్ బుక్ చేసుకోవచ్చు, ఎలా అంటే?
Book Uber via Whatsapp: ఉబర్ సంస్థ వాట్సాప్‌లోనే క్యాబ్ బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ప్రస్తుతానికి ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో సేవలు అందుబాటులోకి రానున్నాయి.
Book Uber via Whatsapp:
ప్రస్తుతానికి ఆ ప్రాంతంలోనే సర్వీసులు..
ఇప్పుడు సిటీల్లో క్యాబ్‌లు బుక్ చేసుకోవాలంటే ఆ కంపెనీ యాప్ తప్పకుండా ఉండాల్సిందే. ఇందుకోసం ప్లే స్టోర్‌లో యాప్ డౌన్‌లోడ్ చేసి, రిజిష్టర్ చేసుకోకతప్పదు. ఈ ప్రయాస ఏమీ పడకుండా, ఫోన్ స్టోరేజ్‌ను సేవ్ చేసుకునే పరిష్కారం చూపించింది ఉబర్. వాట్సాప్‌తో టై అప్ అయ్యింది. వాట్సాప్ ద్వారానే బుక్ చేసుకునే వెసులుబాటు వచ్చేసింది. వాట్సాప్ లేని స్మార్ట్‌ఫోన్ ఉండటం లేదు. అందుకే తమ సేవలను మరింత విస్తృతం చేసుకునేందుకు వాట్సాప్ ద్వారానే క్యాబ్, బైక్ బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది ఉబర్. అయితే ఇది ప్రస్తుతం దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతానికి మాత్రమే పరిమితం కానుంది. ఈ వారమే ఈ సర్వీసెస్ మొదలు కానున్నాయి. ఈ మేరకు ఉబర్ సంస్థ అధికారిక ప్రకటన చేసింది. "ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఉండే వాళ్లు ఎక్కడి నుంచైనా సరే వాట్సాప్‌లోని మా చాట్‌బోట్‌తో ఉబర్ రైడ్ బుక్ చేసుకోవచ్చు. ఈ వారంలోనే సేవలు ప్రారంభమవుతాయి" అని వెల్లడించింది. ఉబర్-వాట్సాప్ ఇంటిగ్రేటర్ సేవలు గతేడాది డిసెంబర్‌లోనే లక్నోలో మొదలయ్యాయి. ఈ చాట్‌బోట్ ఇంగ్లీష్‌తో పాటు హిందీలోనూ అందుబాటులో ఉంటుంది. ట్రిప్ పూర్తయ్యాక, ఈ చాట్‌బోట్‌లోనే రైడ్ రిసీట్లు కూడా వస్తాయి.
రైడ్ ఎలా బుక్ చేసుకోవాలి..?
1. ఉబర్ అఫీషియల్ బిజినెస్ నంబర్ +91-7292000002 కి వాట్సాప్‌లో Hi అని మెసేజ్ పంపాలి.
2. ఇంగ్లీష్ లేదా హిందీలో ఏదో ఓ లాంగ్వేజ్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.
3. లాంగ్వేజ్ ఎంపిక చేసుకున్నాక...పికప్ లొకేషన్ వివరాలు అడుగుతుంది. ఈ వివరాల ఆధారంగా లొకేషన్ ఆప్షన్స్ ఇస్తుంది. ఇలా కాదంటే..నేరుగా వాట్సాప్ ద్వారానే కరెంట్ లొకేషన్‌ను పంపొచ్చు.
4. ఇదే ప్రాసెస్ ఫాలో అయిపోయి...డ్రాప్ లొకేషన్‌నూ సెలెక్ట్ చేసుకోవాలి.
5. రిజిష్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి.
6. OTPవెరిఫికేషన్ పూర్తయ్యాక, ఎలాంటి రైడ్ కావాలో మనం ఎంపిక చేసుకోవచ్చు.
7.ఈ వివరాలన్నీ మరోసారి ఎడిట్ చేసుకునేందుకు అవకాశముంటుంది. అప్పుడే రైడ్ కన్‌ఫమ్ లేదా క్యాన్సల్ చేయొచ్చు.
8. రైడ్ కన్‌ఫమ్ చేయగానే, డ్రైవర్ డిటైల్స్ వాట్సాప్‌లోనే వస్తాయి.
మొబైల్ నంబర్‌తో ఉబర్ రిజిష్ట్రేషన్ చేసిన వాళ్లు మాత్రమే ఈ సేవలు వినియోగించుకునేందుకు అవకాశముంటుంది. అయితే వాట్సప్‌లో బుక్ చేసుకునేందుకు కాస్త టైమ్ పడుతోంది. ఇప్పుడిప్పుడే సర్వీసెస్ మొదలయ్యాయని, ఇలాంటి సమస్యల్ని అధిగమించి మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఉబర్ ప్రకటించింది.
Also Read: Tollywood: మా మధ్య ఎటువంటి గొడవలు లేవు - 'దిల్' రాజు
Also Read: Anxiety: ఇలాంటి కలలు వస్తున్నాయంటే అర్థం మీకు అలాంటి మానసిక సమస్య ఉన్నట్టే