అన్వేషించండి

Manish Sisodia: మోదీకి అమిత్ షా! కేజ్రీవాల్‌కు సిసోడియా- మాస్టర్ మైండ్‌ను సైలెంట్ చేసి ఆప్ ను గద్దె దింపేశారు

Delhi Elections Results 2025 | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఎమ్మెల్యేగా సైతం అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించి అధికారం చేజిక్కుంచుకుంది.

నేషనల్ పాలిటిక్స్ బాగా ఫాలో అయ్యేవారికి తెలిసిన పేరు మనీశ్ సిసోడియా. ఢిల్లీ రాజకీయాలు.. ఇంకా చెప్పాలంటే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తావన వస్తే.. అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా పేర్లను వేరు చేసి చూడలేం. మాజీ ఉద్యోగి కేజ్రీవాల్ (IRS) ఈ దేశానికి ఏదో చేయాలని ఆసక్తితో తన ఉద్యోగానికి వీఆర్ఎస్ తీసుకున్నప్పుడు.. ఆయనతో పాటు జర్నలిస్ట్ ఉద్యోగాన్ని వదిలేశారు మనీశ్ సిసోడియా (Manish Sisodia). ఆప్ అధినేత కేజ్రీవాల్ రచించే ప్రతీ ప్లాన్‌కు వ్యూహకర్త మనీశ్ సిసోడియానే. 
మోదీకి అమిత్ షా.. కేజ్రీవాల్‌కు సిసోడియా
కేంద్ర రాజకీయాల్లో ప్రధాని మోదీకి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎలానో... ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ కు మనీశ్ సిసోడియా అలాగ. కేజ్రీవాల్‌తో కలిసి పరివర్తన్, కబీర్ లాంటి నాన్ ఫ్రాఫిట్ ఆర్గనైజేషన్స్ (NGO) నడిపినా, లోక్ పాల్ బిల్లు (Lokpal Bill) కోసం అన్నా హజారేతో కలిసి కేజ్రీవాల్ (Arvind Kejriwal) పోరాటాల్లో పాలు పంచుకున్నారు. కానీ తర్వాత రాజకీయాల్లోకి వెళ్దామనే కేజ్రీవాల్ నిర్ణయానికి అన్నా హజారే మద్దతు తెలపలేదు. ఈ విషయంలో కేజ్రీకి మద్దతు పలికి, అతడి ఆలోచనలకు రూపం ఇస్తూ ఆమ్ ఆద్మీ అనే పార్టీ ని డిజైన్ చేసినా అన్ని చోట్లా సిసోడియా ముద్ర బలంగా కనిపిస్తోంది.

వ్యూహాలు అమలు చేసే సిసోడియా

కేజ్రీవాల్ బాగా దగ్గరగా ఫాలో అయ్యే చెప్పేది ఏంటంటే.. కేజ్రీవాల్ బ్రెయిన్ అంతా థీసిస్ తో నిండిపోయి ఉంటుంది. అతనో సిద్ధాంత కర్త అయితే దాన్ని గ్రౌండ్ లెవల్లో అంతే కచ్చితంగా అమలు చేసే వ్యక్తి సిసోడియా. సిసోడియా వ్యూహాలు, జర్నలిజం  అనుభవమే ఆమ్ ఆద్మీ అనామక పార్టీని వరుసగా మూడు సార్లు ఢిల్లీ పీఠంపై కూర్చునేలా చేసింది. కేవలం అక్కడితో ఆగిపోలేదు మనీశ్ సిసోడియా. ఆమ్ ఆద్మీ గెలిస్తే ఏం చేయాలో..ఎలా ఈ సొసైటీలో మార్పులు తేవాలో కూడా పక్కాగా ప్లాన్ చేశాడు. ప్రధానంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ లో లాస్ట్ పదిహేనేళ్లలో వచ్చిన విప్లవాత్మక మార్పులకు మనీశ్ సిసోడియానే కారణం. మోడల్ టెక్నో స్కూళ్లకు పోటీ ఇచ్చేలా ప్రభుత్వ బడలు, డిజిటల్ క్లాస్ రూమ్ లు, ఈ లెర్నింగ్ క్లాసెస్...స్టూడెంట్స్ కి ట్యాబ్స్..ఈ రోజు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆ మార్పులకు కారణం సిసోడియా విద్యాశాఖ మంత్రిగా ఢిల్లీలో తెచ్చిన సంస్కరణలే. అంతే కాదు సంక్షేమ పథకాల రూపకల్పలోనూ సిసోడియాది మాస్టర్ మైండ్. 

ఢిల్లీలోనే సంక్షేమ పథకాలకు శ్రీకారం..

 మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్లలోపు ఫ్రీ కరెంట్, ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇలాంటి సంక్షేమ పథకాలను ముందు అమలు చేసింది ఢిల్లీలోనే. ఆమ్ ఆద్మీ బలోపేతం చేసి పంజాబ్ లాంటి రాష్ట్రంలోనూ అధికారంలోకి వచ్చేలా చేసిన సంస్కరణలు అవి. అలాంటి వ్యూహకర్త ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుపోవటం ఆమ్ ఆద్మీ పతనానికి నాందిగా మారింది. ఈడీ, సీబీఐ ప్రాథమిక విచారణల తర్వాత 2023 మార్చిలో మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేసి జ్యూడీషియల్ కస్టీడికీ తరలించారు. దీంతో కేజ్రీవాల్ కు భారీ దెబ్బపడింది. ఈ కేసు ఇంకా కోర్టులో విచారణలో ఉంది. ఇదే కేసులో సీఎంగా ఉండగానే కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయ్యారు.

2024 ఆగస్టు అంటే ఏడాదిన్నర జైలులోనే గడిపారు. ఈలోగా ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహకర్త సేవలను కోల్పోయి కకావికలం అయిపోయింది. కేజ్రీవాల్ కూడా సీఎంగా రిజైన్ చేసి ఆతిశీ కి ఆ బాధ్యతలను అప్పగించారు. పొలిటికల్ విశ్లేషకులు చెప్పేది ఏంటంటే ఓ స్ట్రాటజీ ప్రకారం కేజ్రీవాల్ ను వీక్ చేశారు. అతని ప్రధాన వ్యూహకర్త ను లైమ్ లైట్ నుంచి తప్పించటం ద్వారా ఆమ్ ఆద్మీ గ్రాడ్యూవల్ గా వీక్ అయిపోయేలా చేసి ఇప్పుడు నాలుగో సారి అధికారం పీఠం ఎక్కే అవకాశం లేకుండా చేయటంలో సక్సెస్ అయ్యారని చెబుతారు.

Also Read: Kejriwal On AAP Defeat: అధికారం కోసం రాజకీయాలు చేయలేదు, బీజేపీకి కంగ్రాట్స్: ఓటమిపై కేజ్రీవాల్ వీడియో విడుదల

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget