Covid-19 In India: విజృంభిస్తున్న కరోనా - ఆక్సిజన్ సిలిండర్లపై రాష్ట్రాలకు సూచనలతో కేంద్రం లేఖ
Liquid Oxygen Cylinders: ఆసుపత్రులలో ఆక్సిజన్ సిలిండర్ల లభ్యత, సరఫరాపై దృష్టి సారించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది.
Regular Supply Of Medical Oxygen: కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. ఆసుపత్రులలో ఆక్సిజన్ సిలిండర్ల లభ్యత, సరఫరాపై దృష్టి సారించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. గతంలో వచ్చిన కరోనా వేవ్ లో ఆక్సిజన్ లభ్యత లేక, సరఫరా కొరత కారణంగా ఆసుపత్రుల్లో ఎంతో మంది కరోనా బాధితులు తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారు. చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, థాయిలాండ్ నుంచి భారత్ కు వస్తున్న ప్రయాణికులకు ఆర్‌టీ పీసీఆర్ టెస్టులు తప్పనిసరి చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ తెలిపారు. ఒకవేళ ఎవరికైనా పాజిటివ్ అని తెలితే, వారిని క్వారంటైన్ కు తరలించాలని కేంద్ర మంత్రి కీలక సూచనలు చేశారు.
చైనాలో గత కొన్ని రోజులుగా భారీగా ఒమిక్రాన్ వేరియంట్ కు సంబంధించి బీఎఫ్ 7 వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల దేశంలోనూ కరోనా కేసులు పెరగడంతో పాటు బీఎఫ్ 7 కేసులు మొదలయ్యాయి. మళ్ళీ కరోనా వ్యాప్తి ఎక్కువై, విపత్కర పరిస్థితి ఎదురైనట్లయితే, పరిస్థితిని విజయవంతంగా ఎదుర్కోవడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం ఈ సూచనలు చేసింది. లిక్విడ్ ఆక్సిజన్ లభ్యత, సరఫరాతో పాటు తగినన్ని ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్స్, ఎస్పీఓ 2, బిఐపీఏపీ వంటి అన్ని సౌకర్యాలు సిద్ధం చేసి కరోనాను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించింది.
The Ministry of Health and Family Welfare writes to all States/UTs to ensure a functional and regular supply of medical oxygen for Covid19 pandemic management pic.twitter.com/WFQC8LlqTs
— ANI (@ANI) December 24, 2022
పలు దేశాల్లో విజృంభిస్తున్న కరోనా
ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రన్ సబ్ వేరియంట్ అయిన బీఎఫ్ -7 వేరియంట్ వల్ల చైనా, దక్షిణ కొరియా, థాయ్ లాండ్, జపాన్, హాంకాంగ్ వంటి దేశాల్లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటం వల్ల ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు RT-PCR టెస్టులు తప్పనిసరి అని చేసింది కేంద్రం. దేశానికి వచ్చే ప్రయాణికుల్లో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వారిని కచ్చితంగా క్వారంటైన్‌లో ఉంచాలని ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయ తెలిపారు.
కరోనా కేసులపై చైనా తప్పుడు నివేదిక !
చైనాలోని ఒక నగరంలో ప్రతిరోజు దాదాపు ఐదులక్షల మందికి కరోనా వ్యాపిస్తోందని, అక్కడి ప్రభుత్వం ప్రకటిస్తున్న నివేదికలలో తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఒక ఉన్నత ఆరోగ్య అధికారి తెలిపినట్లు ఏఎఫ్‌పీ వార్త సంస్థ పేర్కొంది. చైనా అధ్యక్షుడు జీరో కోవిడ్ విధానం పేరుతో సుదీర్ఘమైన లాక్ డౌన్లు, నిర్భంధం, ప్రయాణ ఆంక్షలతో అనుసరిస్తున్న ఈ విధానానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ ఆందోళనల నేపథ్యంలో ఈ నెల ప్రారంభంలో ఈ విధానానికి స్వస్తి పలికింది. జీరో కోవిడ్ విధానాన్ని ఎత్తివేసిన తర్వాత చైనాలో కరోనా వ్యాప్తి ఎక్కువై, మరణాలు సైతం పెరుగుతున్నాయని సమాచారం. పెరుగుతున్న కరోనా కేసుల వల్ల ఆసుపత్రులు అన్ని కరోనా బాధితులతో నిండిపోయాయని.. మెడికల్ షాపులలో మందుల కొరత ఏర్పడి చైనా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
#WATCH | Air Suvidha portal to be implemented for passengers arriving from China, Japan, South Korea, Hong Kong & Thailand, RT-PCR to be made mandatory for them. After arriving in India, if they test positive, they'll be quarantined: Union Health Min Dr Mandaviya pic.twitter.com/ST7ypqmy1V
— ANI (@ANI) December 24, 2022