![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Coronavirus Updates: ఇండియాలో 17 నెలల కనిష్ఠానికి కరోనా యాక్టివ్ కేసులు.. భారీగా తగ్గిన కొవిడ్19 మరణాలు
భారత్‌లో ప్రస్తుతం కరోనా వ్యాప్తి కాస్త అదుపులో ఉంది. గత కొన్ని రోజులుగా 10 వేల కరోనా కేసులు నమోదవుతున్నా.. 522 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు దిగొచ్చాయి.
![Coronavirus Updates: ఇండియాలో 17 నెలల కనిష్ఠానికి కరోనా యాక్టివ్ కేసులు.. భారీగా తగ్గిన కొవిడ్19 మరణాలు Coronavirus Updates: Indias active cases stands at 1,35,918 is the lowest in 522 days Coronavirus Updates: ఇండియాలో 17 నెలల కనిష్ఠానికి కరోనా యాక్టివ్ కేసులు.. భారీగా తగ్గిన కొవిడ్19 మరణాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/10/eb74465e6265ab08d728a7e0738e8f49_original.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Coronavirus Updates: ఇండియాలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. తాజాగా 17 నెలల కనిష్ఠానికి దేశంలో కరోనా కేసులు చేరుకున్నాయి. మరోవైపు కరోనా మరణాలు క్రితం రోజుతో పోల్చితే సగానికి పైగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 11,271 కొత్త కేసులను నిర్ధారించారు. నిన్న ఒక్కరోజులో 285 మందిని కరోనా మహమ్మారి బలిగొంది. క్రితం రోజుతో పోల్చితే కొవిడ్ మరణాలు భారీగా తగ్గాయి. దేశంలో ఇప్పటివరకూ 4,63,530 మంది మహమ్మారికి బలయ్యారు.
India's active caseload that stands at 1,35,918 is the lowest in 522 days (17 months). Active cases account for less than 1% of total cases, currently at 0.39% - lowest since March 2020. Recovery Rate currently at 98.26% - highest since March 2020: Ministry of Health pic.twitter.com/6vFqQ54P12
— ANI (@ANI) November 14, 2021
భారత్‌లో నమోదవుతున్న కేసులలో సగానికి పైగా కేసులు ఒక్క కేరళ రాష్ట్రం నుంచే వస్తున్నాయి. నిన్న ఒక్కరోజులో కేరళ నుంచే 6,468 కేసులు, 23 మరణాలు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా నిన్న 11,376 మంది కరోనా మహమ్మారిని జయించి ఆరోగ్యంగా డిశ్ఛార్జ్ అయ్యారు. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,35,918 (ఒక లక్షా 35 వేల 918)కు దిగొచ్చింది. కాగా, గత 522 రోజులలో ఇవే అతి తక్కువ క్రియాశీల కేసులు అని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. దేశంలో ఇప్పటివరకూ 3,44,37,307 (3.44 కోట్ల) మంది కరోనా బారిన పడగా అందులో 3,38,37,859 (3.38 కోట్ల) మంది కోలుకున్నారు. దాంతో కొవిడ్19 రికవరీ రేటు 98.26 శాతానికి చేరింది.
Also Read: భోజనం చేసే మధ్యలో నీళ్లు ఎందుకు తాగకూడదు? తాగితే ఏమవుతుంది?
మొత్తం కరోనా కేసులలో యాక్టివ్ కేసులు 0.39 శాతానికి దిగొచ్చాయి. దేశంలో నిన్న ఒక్కరోజులో 57,43,840 (57 లక్షల 43 వేల 840) డోసుల కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు. ఇప్పటివరకూ భారత్‌లో 1,12,01,03,225 (112 కోట్ల 1 లక్షా 3 వేల 225) డోసుల కొవిడ్ టీకాలు పంపిణీ జరిగినట్లు హెల్త్ బులెటిన్‌లో వెల్లడించారు. కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గితే దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టేనని కేంద్ర వైద్య శాఖ భావిస్తోంది. కేరళలో మరణాలు తగ్గుతున్నా, కేసులు మాత్రం భారీ సంఖ్యలో నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
Also read: తెల్ల బ్రెడ్ లేదా బ్రౌన్ బ్రెడ్... రెండింటిలో ఏది తింటే బెటర్? ఏది తినకూడదు?
గత 41 రోజుల్లో వరుసగా రోజువారీ పాజిటివిటీ రేటు 2 కంటే తక్కువ శాతంగా ఉంది. వీక్లీ కరోనా పాజిటివిటీ రేటు సైతం గత 51 రోజులుగా 2 కంటే తక్కువగా ఉంది. ఇప్పటివరకూ 62.37 కోట్ల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. గత ఏడాది మార్చి నుంచి కరోనా రికవరీ రేటు ప్రస్తుతం అధికంగా ఉందని అధికారులు తెలిపారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)