Corona Cases: దేశంలో తగ్గిన కరోనా వ్యాప్తి, కొత్తగా 13 వేల పాజిటివ్ కేసులు
India Corona Cases: గడిచిన 24 గంటల్లో కరోనా పాజిటివ్ కేసులుల 15 వేల దిగువన నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
CoronaVirus Cases In India: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో కరోనా పాజిటివ్ కేసులుల 15 వేల దిగువకు వచ్చాయి. నిన్న ఒక్కరోజు భారత్‌లో 13,405 (13 వేల 405) మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారించారు. డైలీ పాజిటివిటీ రేటు 1.24 శాతానికి దిగొచ్చింది. రికవరీ రేటు ఏకంగా 98.38 శాతానికి పెరిగింది. దేశంలో ప్రస్తుతం 1,81,075 మంది కరోనాకు చికిత్స (Active Corona Cases In India) పొందుతున్నారు.
సోమవారం ఒక్కరోజులో 34,226 మంది కరోనా మహమ్మారిని జయించి ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యారు. వారితో కలిపితే భారత్‌లో కరోనా బారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,21,58,510 (4 కోట్ల 21 లక్షల 58 వేల 510)కు చేరింది. అదే సమయంలో మరో 235 మంది కొవిడ్ తో పోరాడుతూ చనిపోయారు. దేశంలో కరోనా మరణాల సంఖ్య 5,12,344కు చేరనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. దేశంలో కరోనా మరణాలు సంఖ్య 5,12,344 (5 లక్షల 12 వేల 344)2కు చేరినట్లు అధికారులు తెలిపారు.
175 కోట్ల డోసులు..
గత ఏడాది జనవరిలో కరోనా వ్యాక్సిన్ ప్రారంభించినప్పటి నుంచి నేటి ఉదయం వరకు దేశంలో 1,75,83,27,441 (175 కోట్ల 83 లక్షల 27వేల 441) డోసుల కొవిడ్ టీకాలు పంపిణీ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 425.7 మిలియన్ల మంది మొత్తం కరోనా బాధితులు కాగా, కరోనా మరణాలు 58 లక్షల 90వేలకు చేరాయని జాన్ హాప్ కిన్స్ యూనివర్సిటీ తెలిపింది. కరోనా మహమ్మారి కట్టడిలో 1038 కోట్ల డోసుల కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ జరిగినట్లు పేర్కొంది.
Also Read: Chicken: మళ్లీ బర్డ్ ఫ్లూ కేసులు, చికెన్ తింటే ప్రమాదమా, బర్డ్ ఫ్లూ మనుషులకు కూడా వస్తుందా?
Also read: కరోనాలాంటి మహమ్మారులు మళ్లీ రాకుండా ఉండాలంటే చెట్లు పెంచాల్సిందే, చెబుతున్న కొత్త అధ్యయనం