India Corona Cases: భారత్‌లో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు, తాజాగా 1,217 మంది మృతి
24 గంటల్లో దేశవ్యాప్తంగా 71,365 (71 వేల 365) మందికి కరోనా వైరస్ బారిన పడ్డారు. కిందటి రోజుతో పోల్చితే దాదాపు నాలుగు వేల పాజిటివ్ కేసులు అధికంగా నమోదయ్యాయి.
Covid Cases In India: భారత్‌లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. కిందటి రోజుతో పోల్చితే దాదాపు నాలుగు వేల పాజిటివ్ కేసులు అధికంగా నమోదయ్యాయి. వరుసగా నాలుగోరోజు లక్ష దిగువన కరోనా కేసులు నిర్ధారించారు. 24 గంటల్లో 15 లక్షల 71 వేల 726 శాంపిల్స్ పరీక్షించగా దేశవ్యాప్తంగా 71,365 (71 వేల 365) మందికి కరోనా వైరస్ బారిన పడ్డారు. అదే సమయంలో నిన్న ఒక్కరోజులో కరోనాతో పోరాడుతూ 1,217 మంది మరణించారు. వరుసగా రెండో రోజు వెయ్యికి పైగా కొవిడ్ మరణాలు నమోదయ్యాయి.
నిన్న ఒక్కరోజులో 1,72,211 (1 లక్షా 72 వేల 211) మంది కరోనా మహమ్మారిని జయించారని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ తాజా ప్రకటనలో తెలిపింది. గడిచిన 24 గంటల్లో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. దేశంలో ప్రస్తుతం 8,92,828 (8 లక్షల 92 వేల 828) మంది కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు. తాజా మరణాలతో కలిపితే దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,05,279 (5 లక్షల 5 వేల 279)కు చేరింది. ఇక రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు రేటు 4.54 శాతానికి తగ్గింది.
170.8 కోట్ల కోవిడ్ డోసులు..
భారత్‌లో కొవిడ్ డోసుల పంపిణీ 170.8 కోట్ల మైలురాయికి చేరుకుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం డోసులు 170 కోట్ల 87 లక్షల డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతా వద్ద దాదాపు 12.11 కోట్ల మేర వ్యాక్సిన్ డోసుల వరకు నిల్వ ఉన్నాయి. దేశంలో యాక్టివ్ కేసుల రేటు 2.11 శాతానికి తగ్గగా, రికవరీ రేటు 96.70 శాతానికి పెరిగినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ తాజా బులెటిన్‌లో పేర్కొంది.
Also Read: USPC Protest: జీవో 317పై తగ్గేదే లే, నేడు ఇందిరాపార్క్ వద్ద యూఎస్‌పీసీ మహాధర్నా, వారి డిమాండ్లు ఇవే