![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
India Corona Cases: దేశంలో తాజాగా 2,35,532 కరోనా కేసులు.. 50 శాతం పెరిగిన కొవిడ్ మరణాలు
నిన్నటితో పోల్చితే దేశంలో 10 వేల పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. రెండు రోజుల కిందట నమోదైన సంఖ్యతో పోల్చితే కరోనా మరణాలు 50 శాతం పెరిగాయి.
![India Corona Cases: దేశంలో తాజాగా 2,35,532 కరోనా కేసులు.. 50 శాతం పెరిగిన కొవిడ్ మరణాలు Corona Cases: India Reports 2,35,532 COVID cases, 871 Deaths in the last 24 hours India Corona Cases: దేశంలో తాజాగా 2,35,532 కరోనా కేసులు.. 50 శాతం పెరిగిన కొవిడ్ మరణాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/29/1a50caa492da72670d1289e54f13f848_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
India Corona Cases: భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. నిన్నటితో పోల్చితే దేశంలో దాదాపు 10 వేల పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 2,35,532 (2 లక్షల 35 వేల 532) మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో మరో 871 మంది కరోనా మహమ్మారితో పోరాడుతూ చనిపోయారు. రెండు రోజుల కిందట నమోదైన కేసులతో పోల్చితే పోల్చితే దేశంలో కరోనా మరణాలు 50 శాతం పెరిగాయి. దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 4 కోట్లు దాటిపోయింది.
దేశంలో నిన్న ఒక్కరోజులో 3,35,939 (3 లక్షల 35 వేల 939) మంది కరోనాను జయించారు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 20,04,333కు దిగొచ్చింది. భారత్‌లో కరోనా యాక్టివ్ కేసులు చాలా రోజుల తరువాత క్రితం రోజుతో పోల్చితే తగ్గాయి. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 13.39 శాతానికి తగ్గినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది. భారత్‌లో కొవిడ్ డోసుల పంపిణీ 165.04 కోట్ల మైలురాయికి చేరుకుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతా వద్ద దాదాపు 13 కోట్ల డోసుల వరకు నిల్వ ఉన్నాయని తెలిపింది.
నిన్నటితో పోల్చితే దేశంలో తగ్గిన కరోనా కేసులు
తాజాగా 2,35,532 పాజిటివ్ కేసులు, 871 మంది మృతి
భారత్‌లో 20,04,333కు చేరుకున్న యాక్టివ్ కేసులు
రోజువారీ పాజిటివిటీ రేటు 13.39 శాతం
వ్యాక్సినేషన్ పూర్తయిన డోసులు 1,65,04,87,260 (165 కోట్ల 4 లక్షల 87 వేల 260)
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకూ 36.94 కోట్ల మందికి కరోనా సోకింది. 56.4 లక్షల మందిని కరోనా మహమ్మారి బలిగొనడం విషాదదాయకం. వైరస్ వ్యాప్తిని నిర్మూలించేందుకు 992 కోట్ల డోసుల వ్యాక్సిన్లను ప్రజలు తీసుకున్నారని ప్రముఖ జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ తాజాగా తెలిపింది.
Also Read: Cough and Cold: దగ్గు, జలుబు వేదిస్తున్నాయా? ఈ ఆహారానికి దూరంగా ఉండండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)