Prophet Muhammad Row: 'ముందు మీ పని చూసుకోండి'- పాకిస్థాన్‌కు భారత్ కౌంటర్
Prophet Muhammad Row: మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యల అంశంలో పాకిస్థాన్ చేసిన ఆరోపణలపై భారత్ తీవ్రంగా స్పందించింది.
Prophet Muhammad Row: మహ్మద్ ప్రవక్తపై భాజపా నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై అంతర్జాతీయంగా వ్యక్తమవుతోన్న విమర్శలను భారత్ తిప్పికొట్టింది. ఇస్లామిక్ సహకార సంస్థ(ఓఐసీ) చేసిన విమర్శలు అసమంజసంగా, సంకుచిత ధోరణితో ఉన్నాయని భారత విదేశాంగ శాఖ పేర్కొంది.
Our response to media queries regarding recent statement by General Secretariat of the OIC:https://t.co/961dqr76qf pic.twitter.com/qrbKgtoWnC
— Arindam Bagchi (@MEAIndia) June 6, 2022
భాజపా నేతలు చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలను ఖండిస్తూ సౌదీ అరేబియా, ఖతర్, ఇరాన్, కువైట్ దేశాలు ప్రకటనలు చేశాయి. సదరు వ్యక్తులపై భాజపా తీసుకున్న చర్యలను సౌదీ అరేబియా స్వాగతించింది.
పాక్ కుటిల నీతి
Our response to media queries regarding tweet by the Pakistani Prime Minister and statement by its Ministry of Foreign Affairs:https://t.co/bTcrX0WH4X pic.twitter.com/IfR4YdFnsO
— Arindam Bagchi (@MEAIndia) June 6, 2022
మరోవైపు పాకిస్థాన్ ఈ వ్యవహారంపై నిరసన వ్యక్తం చేస్తూ భారత దౌత్యవేత్తకు సమన్లు జారీ చేయడంపై విదేశాంగ శాఖ మండిపడింది. ఎన్నో ఏళ్ల నుంచి మైనారిటీ హక్కులను కాలరాస్తున్న పాకిస్థాన్ మరో దేశంలోని మైనారిటీల వ్యవహారాలపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని విదేశాంగ శాఖ పేర్కొంది.
పాకిస్థాన్ ముందుగా వారి దేశంలో శాంతి, భద్రతల పరిస్థితులపై, అక్కడి మైనారిటీల సంక్షేమంపై దృష్టిసారించాలని భారత విదేశాంగ శాఖ హితవు పలికింది.
Also Read: Salman Khan Security: హీరో సల్మాన్ ఖాన్‌కు సెక్యూరిటీ పెంచిన మహారాష్ట్ర సర్కార్
Also Read: Delhi road rage: షాకింగ్ వీడియో- రోడ్డుపై వాగ్వాదం, బైకర్‌ను ఢీ కొట్టిన స్కార్పియో డ్రైవర్!