Congress On Parliament Session: అగ్నిపథ్, ఎల్‌పీజీ ధరల పెరుగుదల- పార్లమెంటులో కాంగ్రెస్ ఆయుధాలు ఇవే!
Congress On Parliament Session: పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించేందుకు కాంగ్రెస్ కీలక నేతలు సమావేశమయ్యారు.
Congress On Parliament Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు కాంగ్రెస్ కీలక సమావేశం నిర్వహించింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. పార్టీ పార్లమెంటరీ స్ట్రాటజీ కమిటీ బృందం సమావేశం గంటపాటు సాగింది. ఈ సమావేశంలో రాబోయే సమావేశంలో లేవనెత్తాల్సిన అంశాలపై నేతలు చర్చించారు.
Delhi | Congress general secretary in-charges, state in-charges and PCC presidents attend a meeting at the party headquarters pic.twitter.com/VVCGDZcP2q
— ANI (@ANI) July 14, 2022
సామాన్య ప్రజలను ప్రభావితం చేసే ఎల్‌పీజీ ధరల పెరుగుదలకు కాంగ్రెస్ ప్రాధాన్యం ఇస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. అలాగే కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకం గురించి కూడా మాట్లాడతామన్నారు.
దేశంలో నిరుద్యోగం, రూపాయి పతనంతో పాటు తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దు వెంట పరిస్థితులపై పార్లమెంట్‌లో చర్చకు డిమాండ్ చేస్తామని ఖర్గే అన్నారు.
పార్టీపై
వీటితో పాటు పార్టీ సంస్థాగత ఎన్నికలు, అధ్యక్షుడి ఎన్నికపై కూడా చర్చించినట్లు సమాచారం. సమావేశంలో పార్టీ సీనియర్ నేతలు అధిర్ రంజన్ చౌదరి, పీ చిదంబరం, జైరాం రమేశ్, కే సురేష్, మాణికం ఠాగూర్, ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 18న ప్రారంభమై.. ఆగస్ట్ 12 వరకు కొనసాగనున్నాయి.
రాహుల్ డుమ్మా
ఈ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డుమ్మా కొట్టారు. మరోసారి ఆయన విదేశీ పర్యటనకు వెళ్లారు. వ్యక్తిగత పర్యటన కింద రాహుల్ ఐరోపా వెళ్లినట్లు సమాచారం. రాష్ట్రపతి ఎన్నికలు, పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 18న ప్రారంభం కానున్నాయి. ఇలాంటి కీలక సమావేశాల ముందు రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు వెళ్లడంంతో మరోసారి చర్చ మొదలైంది. రాహుల్ గాంధీ ఆదివారం తిరిగి వస్తారని సమాచారం. దీంతో కాంగ్రెస్ కీలక సమావేశాలకు ఆయన దూరం కానున్నారు. ఇప్పటికే ఆయన విదేశీ పర్యటనలపై చాలా సార్లు భాజపా ఆరోపణలు చేసింది.
Also Read: Sri Lanka Crisis: శ్రీలంక అధ్యక్షుడు పరుగో పరుగు- సింగపూర్ నుంచి సౌదీ చెక్కేసిన రాజపక్స!
Also Read: Suspicious Cylinder In J&K: జమ్ముకశ్మీర్‌లో అనుమానాస్పద సిలిండర్ స్వాధీనం!