అన్వేషించండి

G20 Summit: నో-ఫ్లై జోన్‌గా ఢిల్లీ, నేను జీ20 విందుకు వెళ్లేదెలా?: ఛత్తీస్‌గఢ్‌ సీఎం

G20 Summit: జీ20 సదస్సు వేళ రాష్ట్రపతి ఏర్పాటు చేయనున్న విందుకు తాను వెళ్లడం లేదని ఛత్తీస్‌గఢ్‌ సీఎం స్పష్టం చేశారు.

G20 Summit: ఢిల్లీ వేదికగా జరగనున్న జీ20 సదస్సుకు కేంద్ర సర్కారు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసింది. వివిధ దేశాల నుంచి రానున్న అగ్రనేతలకు ఆహ్వానం నుంచి బస వరకు అన్ని ఏర్పాట్లను చేశారు అధికారులు. ఒక్కొక్కరిగా దేశాధినేతలు ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఈ శిఖరాగ్ర సదస్సు కోసం ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో భద్రతా సిబ్బందితో పహారా కాస్తుండటంతో పాటు ఇతర రక్షణాత్మక ఏర్పాట్లను పకడ్బందీగా చేశారు. ఈ క్రమంలో ఢిల్లీలో పలు ఆంక్షలు విధించిన సంగతి కూడా తెలిసిందే. అలాగే ఢిల్లీని నో-ఫ్లై జోన్ గా ప్రకటించి భద్రతా ఏర్పాట్లు చేసింది కేంద్ర ప్రభుత్వం. కాగా, జీ20 సదస్సు కోసం వచ్చే దేశాధినేతలకు రాష్ట్రపతి విందు ఇవ్వనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆయా నేతలతో పాటు దేశంలోని వివిధ పార్టీల సీనియర్ నాయకులు, ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు పంపించింది కేంద్ర సర్కారు. శుక్రవారం నాడు రాష్ట్రపతి ఇచ్చే జీ20 విందుకు తాను హాజరు కావడం లేదని తెలిపారు ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్.

జీ20 సమ్మిట్ ను పురస్కరించుకుని ఢిల్లీని నో-ఫ్లై జోన్ గా ప్రకటించారని.. మరి ఢిల్లీకి ఎలా వెళ్లాలంటూ ఛత్తీస్‌గఢ్‌ సీఎం ప్రశ్నించారు. ముందుగా షెడ్యూల్ చేసిన, జీ20 సమ్మిట్ స్పెషల్ విమానాలను మాత్రమే అనుమతిస్తామని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఇప్పటికే స్పష్టం చేసింది. సాధారణ ఏవియేషన్, నాన్ షెడ్యూల్డ్ చార్టర్డ్ విమానాలతో సహా అన్ని విమానాలు ఈ రెండు రోజులూ నిషేధించినట్లు పేర్కొంది.

శనివారం భారత మండపంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన ప్రత్యేక విందుకు జీ20 ప్రముఖులతో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులకు భారత ప్రభుత్వం ప్రత్యేక ఆహ్వానాలు పంపించింది. మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, హేమంత్ సోరెన్, నితీష్ కుమార్ లు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, ఈ విందుకు పలువురు విపక్ష నేతలకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానాలు పంపలేదు. వీరిలో కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎంపీ మల్లిఖార్జున ఖర్గే కూడా ఉన్నారు. ఈ అంశంపై ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ స్పందించారు. కేంద్రం తీరును తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకులను గౌరవించాలని అన్నారు. ఖర్గేను విందుకు ఆహ్వానించకపోవడం ప్రజాస్వామ్యంపై దాడిగా సీఎం అభివర్ణించారు.

అతిథులకు అదిరిపోయే ఆతిథ్యం

జీ20 సదస్సుకు వచ్చే అతిథులకు అదిరిపోయే ఆతిథ్యం ఇవ్వబోతున్నట్లు ప్రత్యేక కార్యదర్శి ముక్తేశ్ పరదేశి తెలిపారు. స్థానిక వంటకాలతో పసందుగా విందు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులకు చిరు ధాన్యాలతో కూడిన భారతీయ వంటకాల రుచి చూపిస్తామని చెప్పారు. అలాగే చిరు ధాన్యాల పౌడర్ తో ఫ్రూట్ సలాడ్లు, బెల్లం రాగి ఖీర్, స్పెషల్ మిల్లెట్ థాలి, మిల్లెట్ పలావ్, మిల్లెట్ ఇండ్లీ వంటి వంటకాలు చేయబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా రాజస్థానీ దాల్ బాటీ ఖుర్మా, పశ్చిమ బెంగాల్ రసగుల్లా, దక్షిణాది మసాలా దోశ బిహార్ లిట్టీ చోకాలనూ అతిథిలకు వండి వడ్డించబోతున్నట్లు స్పష్టం చేశారు. అలాగే చాందినీ చౌక్ వంటకాలను కూడా తినిపిస్తామని స్పష్టం చేశారు. 

అలాగే బంగారు, వెండి పాత్రల్లో భోజనం 

భారత్ సెప్టెంబరు 9, 10 తేదీల్లో జీ20 సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరిగే సమ్మిట్‌కు ప్రపంచ స్థాయి నాయకులు, విదేశీ ప్రతినిధులు హాజరుకానున్నారు. అందు కోసం ఢిల్లీలోని హోటళ్లు ప్రత్యేకమైన రీతిలో VVIP లకు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి. దేశాధినేతలు, ఇతర ప్రపంచ నాయకులకు వెండి, బంగారు పూత పూసిన పాత్రల్లో భోజనం అందించనున్నారు. భారతదేశం సంస్కృతి, ప్రతిబింబించేలా వెండి, బంగారు పూత పూసిన పాత్రల్లో భోజనం, ఆతిథ్యం అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అతిథులకు విలాసవంతమైన విందు కోసం వివిధ లగ్జరీ హోటళ్లలో ఈ వస్తువులను ఏర్పాటు చేశారు. అత్యంత ఆకర్షణీయమైన, అందమైన పాత్రలను ఐకానిక్ ITC తాజ్‌ హోటల్‌తో సహా 11 హోటళ్లకు పంపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందు కోసం క్రోకరీ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు. ఈ సందర్భగా పాత్రల తయారీ సంస్థ యజమానులు రాజీవ్, అతని కుమారుడు మాట్లాడుతూ.. తాము మూడు తరాలుగా ఈ పాత్రలను తయారు చేస్తున్నట్లు చెప్పారు. విదేశీ సందర్శకులకు తమ డైనింగ్ టేబుల్‌లపై భారతదేశ రుచిని అందించడమే తమ లక్ష్యం అని చెప్పారు. ఈ పాత్రలు జైపూర్, ఉదయపూర్, వారణాసి, కర్నాటకలో కళాత్మకంగా రూపొందించినట్లు చెప్పారు. 

టాప్ హెడ్ లైన్స్

CJP Protest: రెండు డిమాండ్లకు ప్రభుత్వం సిద్ధం! ధర్మేంద్ర రాజీనామా వీడని చిక్కుముడి! రెండో విడత సమావేశంలో ఏం జరిగిందో తెలుసుకోండి!
రెండు డిమాండ్లకు ప్రభుత్వం సిద్ధం! ధర్మేంద్ర రాజీనామా వీడని చిక్కుముడి! రెండో విడత సమావేశంలో ఏం జరిగిందో తెలుసుకోండి!
NEET Paper Leak:పరీక్ష పత్రాల లీకేజీకి పదేళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల జరిమానా! ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం !
పరీక్ష పత్రాల లీకేజీకి పదేళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల జరిమానా! ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం !
Breaking News: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం- లోయలో పడిన కారు, 13 మంది మృతి 
హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం- లోయలో పడిన కారు, 13 మంది మృతి 
NEET Paper Leak Talks: NEET వివాదంపై కేంద్రంతో సీజేపీ చర్చలు - రెండు డిమాండ్లకు ఓకే.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపైనే చిక్కుముడి !
NEET వివాదంపై కేంద్రంతో సీజేపీ చర్చలు - రెండు డిమాండ్లకు ఓకే.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపైనే చిక్కుముడి !

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget