చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతల వివరాలివే, మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చిన ఇస్రో
Chandrayaan-3 Update: చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతలకు సంబంధించిన ఇస్రో కీలక అప్‌డేట్ ఇచ్చింది.

Chandrayaan-3 Update:
ఉష్ణోగ్రతల వివరాలు..
ఇస్రో చంద్రయాన్ 3 మిషన్‌పై మరో ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చింది. చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతలకు సంబంధించిన వివరాలు వెల్లడించింది. ఇక్కడి విక్రమ్ ల్యాండర్‌కి అనుసంధానించిన Chandra’s Surface Thermophysical Experiment (ChaSTE) పేలోడ్ అక్కడి ఉష్ణోగ్రతలను రికార్డ్ చేసింది. చంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలంపై ఉష్ణోగ్రతల వివరాలు తెలిపింది. ఈ సమాచారం ద్వారా అక్కడి థర్మల్ బిహేవియర్‌ని అర్థం చేసుకోవడం శాస్త్రవేత్తలకు సులభతరం కానుంది. ఇదే విషయాన్ని ఇస్రో అధికారికంగా ట్వీట్ చేసింది. ChaSTE పే లోడ్ కంట్రోల్డ్ పెనట్రేషన్ మెకానిజంతో పని చేస్తుంది. చంద్రుడి ఉపరితలంపై దాదాపు 10 సెంటీమీటర్ల లోతు వరకూ వెళ్లగలిగే కెపాసిటీ ఉంటుంది. దీనికి దాదాపు 10 టెంపరేచర్ సెన్సార్లు అనుసంధానించారు. ఈ సెన్సార్లే అక్కడి ఉష్ణోగ్రతల వివరాలను అందిస్తాయి. ఉపరితలంపై ఒక్కో చోట ఒక్కో విధమైన ఉష్ణోగ్రతలు నమోదైనట్టు ఇస్రో ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఓ మ్యాప్‌ని కూడా షేర్ చేసింది. లూనార్ సౌత్ పోల్ నుంచి ఇలాంటి ప్రొఫైల్ రావడం ఇదే తొలిసారి. ప్రస్తుతానికి అందిన సమాచారాన్ని వెల్లడించిన ఇస్రో...పూర్తి వివరాలను త్వరలోనే చెబుతామని తెలిపింది.
Chandrayaan-3 Mission:
— ISRO (@isro) August 27, 2023
Here are the first observations from the ChaSTE payload onboard Vikram Lander.
ChaSTE (Chandra's Surface Thermophysical Experiment) measures the temperature profile of the lunar topsoil around the pole, to understand the thermal behaviour of the moon's… pic.twitter.com/VZ1cjWHTnd
చంద్రయాన్-3 మిషన్ లో భాగంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై ప్రజ్ఞాన్ రోవర్ పరిశోధనలు సాగిస్తోంది. ఈ మేరకు విక్రమ్ ల్యాండర్ కు ఎప్పటికప్పుడు తన పరిశోధన ఫలితాలను పంపిస్తోంది. అక్కడి నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు డేటాను సేకరిస్తున్నారు. ఈ వీడియోలను ఎప్పటికప్పుడు ఇస్రో తన ట్విట్టర్ ఖాతా ద్వారా సోషల్ మీడియా యూజర్లతో పంచుకుంటోంది. ఇందులో భాగంగా తాజాగా మరో వీడియోను షేర్ చేసింది ఇస్రో. చంద్రుని ఉపరితలంపై తిరగాడుతున్న ప్రజ్ఞాన్ రోవర్.. తన పరిశోధనా విధుల్లో భాగంగా చక్కర్లు కొడుతోంది. ఇటీవలే రోవర్ శివశక్తి పాయింట్ వద్ద తిరగాడుతున్న దృశ్యాలు ఇస్రో షేర్ చేసిన వీడియోలో చూడవచ్చు.
Chandrayaan-3 Mission:
— ISRO (@isro) August 26, 2023
🔍What's new here?
Pragyan rover roams around Shiv Shakti Point in pursuit of lunar secrets at the South Pole 🌗! pic.twitter.com/1g5gQsgrjM
మైక్రోవేవ్ సైజులో ఉన్న ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై 500 మీటర్లు అంటే 1640 అడుగుల వరకు ప్రయాణించేలా రూపొందించారు. దీని బరువు 26 కిలోలు. రోవర్ లో కెమరా, స్పక్ట్రో మీటర్, మాగ్నెటో మీటర్ తో సహా అనేక రకాల పరికరాలతో అమర్చారు. ఇది చంద్రుడిపై వాతావరణం, భూగర్భం శాస్త్రం, ఖనిజ శాస్త్రం, చరిత్ర, స్థితిగతుల గురించి అధ్యయనం చేయడానికి ప్రయోగాలు చేస్తోంది. చంద్రుడి ఉపరితలంపై అడుగు పెట్టిన వెంటనే ల్యాండర్ విక్రమ్ కూడా వెంటనే పని మొదలు పెట్టేసింది. ఇప్పటికే అక్కడి నుంచి నాలుగు ఫొటోలను షేర్ చేసింది.
Also Read: తిరువనంతపురంలో ఇస్రో చీఫ్ ప్రత్యేక పూజలు, ఆదిత్య మిషన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు





















