Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్‌పై హర్షం వ్యక్తం చేసిన రాజకీయ నాయకులు, ఎవరు ఏమన్నారంటే?
Chandrayaan-3: చంద్రయాన్-3 విజయవంతం కావడంపై రాజకీయ నాయకులు స్పందించారు. ఇస్రో సాధించిన ఘనతను కొనియాడారు.
Chandrayaan-3: చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి ఇస్రో చరిత్ర సృష్టించింది. నిర్దేశించిన సమయంలో విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై సురక్షితంగా సాఫ్ట్ ల్యాండ్ అయింది. ఇప్పటి వరకు ఏ దేశం కూడా వెళ్లని జాబిలి దక్షిణ ధ్రువానికి చేరుకుంది ఇస్రో. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సాధించిన ఈ అద్భుతమైన ఘనతను పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు అందరూ కొనియాడుతున్నారు.
'మానవ సమాజానికి మరో అతిపెద్ద ముందడుగు! చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రుడిపై ల్యాండ్ కావడం మానవుని ప్రతిభకు నిదర్శనం. ఈ అద్భుతమైన విజయం వెనక ఉన్న మేధావులకు అభినందనలు' అని అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ ట్విట్టర్ లో పోస్టు చేశారు.
Another giant leap for humanity! 🌕
— Himanta Biswa Sarma (@himantabiswa) August 23, 2023
Chandrayaan's triumphant landing is a testament to human ingenuity and exploration spirit. Congratulations to the brilliant minds behind this incredible achievement!@isro #Chandrayaan3 #Chandrayaan3Landing https://t.co/6paYz5pQfl
'140 కోట్ల మంది భారతీయులకు అభినందనలు' అని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పోస్టు చేశారు.
'चंद्रयान 3' मिशन की सफलता पर @isro के वैज्ञानिकों, पूरे प्रदेश एवं देशवासियों को बधाई संदेश देते हुए #UPCM @myogiadityanath pic.twitter.com/mA6AtCI32B
— CM Office, GoUP (@CMOfficeUP) August 23, 2023
'చంద్రయాన్-3 కి శుభాకాంక్షలు! దాని అద్భుతమైన విజయానికి అభినందనలు. ఇస్రోకు సెల్యూట్.భారత్ ఇప్పుడు అంతరిక్షంలో సూపర్ లీగ్ లో ఉంది. సాహసయాత్రలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు' అని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ట్వీట్ చేశారు.
Hail Chandrayaan-3!
— Mamata Banerjee (@MamataOfficial) August 23, 2023
Hail its stupendous success!!
Hail @isro!!
Hail our nation's magnificent achievement in sending an exploration mission successfully to the Moon!!
Our scientists have testified the country's scientific and technological progress. India is now in the super…
'ఇది సాటిలేని విజయం. ఈ అద్భుతమైన విజయం ఇస్రో అచంచలమైన స్ఫూర్తికి నిదర్శనం. వారి నిబద్ధత, నిరంతర కృషి ప్రతి భారతీయుడి హృదయాన్ని గర్వంతో ఉప్పొంగేలా చేశాయి' అని ఆప్ నేత రాఘవ్ చద్దా ట్వీట్ చేశారు.
We're over the moon!
— Raghav Chadha (@raghav_chadha) August 23, 2023
🚀 #Chandrayaan3 imprints our identity on the Moon's southern frontier, a triumph unmatched. This feat is a testament to ISRO's indomitable spirit, their commitment and hard work make every Indian's heart swell with pride.
This historic leap is a clarion… pic.twitter.com/TplJJ9cGmE
'1962లో ప్రారంభమైన భారతదేశ అంతరిక్ష కార్యక్రమం నేడు చంద్రయాన్-3 రూపంలో కొత్త శిఖరాన్ని నెలకొల్పింది. దేశ ప్రజలందరికీ ఇది సంతోషకరమైన క్షణం. శాస్త్రవేత్తలకు, దేశ ప్రజలందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. జై హింద్' అని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ట్వీట్ చేశారు.
1962 में शुरू हुए भारत के अंतरिक्ष कार्यक्रम ने आज चंद्रयान 3 के रूप में एक नई ऊंचाई तय की।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) August 23, 2023
पूरा देश आज भारतीय अंतरिक्ष कार्यक्रम की इस गौरवशाली यात्रा पर गर्व महसूस कर रहा है।
सभी देशवासियों के लिए खुशी का क्षण है । सभी वैज्ञानिकों व देशवासियों को बधाई व शुभकामनाएं।
जय…
'చంద్రయాన్-3 మిషన్ ప్రయోగం విజయవంతం అయినందుకు ఇస్రోకు అభినందనలు. చంద్రుని ఉపరితలాన్ని జయించిన నాల్గో దేశంగా భారత్ నిలవడం చిరస్మరణీయ విజయం. భారతదేశ అంతరిక్షణ పరిశోధనలకు ఇదో పెద్ద ముందడుగు' అని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ట్వీట్ చేశారు.
The Journey of Chandrayaan 3 : ఇస్రో చంద్రయాన్ 3 జర్నీ ఇక్కడ వీక్షించండి
https://news.abplive.com/chandrayaan-moon-landing
#India is on the #moon!
— M.K.Stalin (@mkstalin) August 23, 2023
Congratulations to @isro on the successful landing of #Chandrayaan-3! A monumental achievement that places India as the fourth country to conquer the lunar surface.
Kudos to the entire team for their tireless efforts and innovation. A giant leap for… pic.twitter.com/1H3PkIPgsC