అన్వేషించండి

Chandrayaan 3 Launched: చంద్రయాన్ 3ని విజయవంతంగా లాంఛ్ చేసిన ఇస్రో, ప్రముఖుల ప్రశంసలు

Chandrayaan 3 Launched: చంద్రయాన్ 3 మిషన్‌ని ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది.

Chandrayaan 3 Launched:


ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించింది. దాదాపు నాలుగేళ్లుగా ఈ మిషన్‌పై పని చేస్తోంది. మధ్యాహ్నం 2.35 నిముషాలకు నింగిలోకి దూసుకుపోయిన చంద్రయాన్ 3 స్పేస్‌క్రాఫ్ట్...విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశించింది. చంద్రయాన్ 3 బరువు 3,921కిలోలు. భూమి నుంచి చంద్రుడి వరకూ దాదాపు 4 లక్షల కిలోమీటర్ల వరకూ ప్రయాణిస్తుంది. దీన్ని బాహుబలి రాకెట్‌గా చెప్పిన ఇస్రో ఆ తరవాత దానికి  Launch Vehicle Mark 3 గా పేరు పెట్టింది. దీని బరువు 642 టన్నులు. చంద్రయాన్ 3 ఉపగ్రహం చంద్రుడి వైపుగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. చంద్రయాన్ 3 ని ఎల్వీఎం 3 రాకెట్ ద్వారా భూ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టామని తెలిపారు. ఈ ప్రయోగానికి సంబంధించిన మూడు దశలూ పూర్తయ్యాయి. ప్రపల్షన్ మాడ్యూల్ రాకెట్ నుంచి విడిపోయింది.

ఈ ప్రయోగం సక్సెస్ అవడంపై ప్రధాని మోదీ సహా పలువురు కీలక నేతలు ప్రశంసలు కురిపించారు. కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్‌తో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇస్రో సైంటిస్ట్‌లకు అభినందనలు తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ప్రశంసించారు. 

ఎవరేమన్నారు..?

"భారత్‌ చంద్రయాన్ 3 ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఇందుకోసం కృషి చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు. స్పేస్‌ సైన్స్ టెక్నాలజీలో ఇండియా ఎంత పురోగతి సాధిస్తోందో చెప్పడానికి ఇదే ఉదాహరణ"

- ద్రౌపది ముర్ము, రాష్ట్రపతి 

India successfully launches Chandrayaan-3 marking another significant milestone in space exploration.

Heartiest congratulations to the @ISRO team and everyone who worked relentlessly to accomplish the feat!

It demonstrates the nation's unwavering commitment to advancement in…

— President of India (@rashtrapatibhvn) July 14, 2023

 

ప్రధాని నరేంద్ర మోదీ ఇస్రోకి అభినందనలు తెలిపారు. భారత దేశ అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైందని ప్రశంసించారు. చంద్రయాన్ 3 ప్రతి భారతీయుడి కలల్ని, ఆకాంక్షల్ని మోసుకెళ్లిందని అన్నారు. ఇది మన శాస్త్రవేత్తల పట్టుదలకి, నిబద్ధతకి నిదర్శనం అని కొనియాడారు. 

"భారత దేశ అంతరిక్ష చరిత్రలో చంద్రయాన్ 3 కొత్త అధ్యాయాన్ని లిఖించింది. దేశంలోని ప్రతి పౌరుడి ఆకాంక్షల్ని, కలల్ని ఇది నింగిలోకి మోసుకెళ్లింది. మన శాస్త్రవేత్తల నిబద్ధతకు ఈ ప్రయోగమే నిదర్శనం. వాళ్ల ఆత్మవిశ్వాసానికి, పట్టుదలకి సెల్యూట్"

- ప్రధాని నరేంద్ర మోదీ 

Chandrayaan-3 scripts a new chapter in India's space odyssey. It soars high, elevating the dreams and ambitions of every Indian. This momentous achievement is a testament to our scientists' relentless dedication. I salute their spirit and ingenuity! https://t.co/gko6fnOUaK

— Narendra Modi (@narendramodi) July 14, 2023

 

చంద్రయాన్ మిషన్‌ని సక్సెస్ చేయడంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్క సైంటిస్ట్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రతిభ, పట్టుదల, నైపుణ్యాలే ఈ విజయానికి కారణం. మేమంతా మిమ్మల్ని చూసి గర్విస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరపున మీకు అభినందనలు. 

- మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు 

 

Our collective happiness is Over the Moon !!
Thanks to the tremendous ingenuity, dedication, skill and hard work of our scientists, engineers and everyone involved in the successful launch of #Chandrayaan3 Mission.

We are extremely proud of each one of you for this remarkable… pic.twitter.com/Sqh0f1di96

— Mallikarjun Kharge (@kharge) July 14, 2023

" భారత దేశం గర్వంతో ఉప్పొంగిపోయే అపురూప క్షణాలివి. కంగ్రాట్స్ ఇండియా. చంద్రయాన్‌ 3 ని సక్సెస్‌ఫుల్‌గా లాంఛ్ చేసిన ఇస్రో సైంటిస్ట్‌లకు అభినందనలు. ఈ క్షణాల్ని మేమెప్పటికీ గుర్తు పెట్టుకుంటాం. ప్రతి భారతీయుడూ గర్వపడేలా చేశారు"

- మన్‌సుఖ్ మాండవీయ, కేంద్రమంత్రి 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sandhya Theater: సంధ్య థియేటర్ ఘటన - బాధిత కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షల సాయం
సంధ్య థియేటర్ ఘటన - బాధిత కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షల సాయం
Vizag news: వైజాగ్ ప్రజలకు బిగ్ అలర్ట్ -  జనవరి ఒకటి నుంచి భూముల విలువ పెంపు - ఎక్కడెక్కడ ఎంత పెరగనున్నాయంటే ?
వైజాగ్ ప్రజలకు బిగ్ అలర్ట్ - జనవరి ఒకటి నుంచి భూముల విలువ పెంపు - ఎక్కడెక్కడ ఎంత పెరగనున్నాయంటే ?
Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Non Detention Policy: 5, 8 తరగతుల విద్యార్థులు పాస్ కావాల్సిందే - 'నాన్ డిటెన్షన్ విధానం' రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం
5, 8 తరగతుల విద్యార్థులు పాస్ కావాల్సిందే - 'నాన్ డిటెన్షన్ విధానం' రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ట్రాన్స్ జెండర్స్ ఆన్ డ్యూటీ, నేటి నుంచే హైదరాబాద్ రోడ్లపై..సహనం కోల్పోయిన సీపీ, తిట్టేసి క్షమాపణలు!Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sandhya Theater: సంధ్య థియేటర్ ఘటన - బాధిత కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షల సాయం
సంధ్య థియేటర్ ఘటన - బాధిత కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షల సాయం
Vizag news: వైజాగ్ ప్రజలకు బిగ్ అలర్ట్ -  జనవరి ఒకటి నుంచి భూముల విలువ పెంపు - ఎక్కడెక్కడ ఎంత పెరగనున్నాయంటే ?
వైజాగ్ ప్రజలకు బిగ్ అలర్ట్ - జనవరి ఒకటి నుంచి భూముల విలువ పెంపు - ఎక్కడెక్కడ ఎంత పెరగనున్నాయంటే ?
Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Non Detention Policy: 5, 8 తరగతుల విద్యార్థులు పాస్ కావాల్సిందే - 'నాన్ డిటెన్షన్ విధానం' రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం
5, 8 తరగతుల విద్యార్థులు పాస్ కావాల్సిందే - 'నాన్ డిటెన్షన్ విధానం' రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం
Allu Arjun Father-in-law: కాంగ్రెస్‌ పెద్దలతో అల్లు అర్జున్ మామ సమావేశం, సంధ్య థియేటర్ ఎపిసోడ్‌లో నెక్ట్స్ ఏం జరగబోతోంది?
కాంగ్రెస్‌ పెద్దలతో అల్లు అర్జున్ మామ సమావేశం, సంధ్య థియేటర్ ఎపిసోడ్‌లో నెక్ట్స్ ఏం జరగబోతోంది?
Paatal Lok 2: సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ 'పాతాళ్‌ లోక్‌' సీజన్‌ 2 - స్ట్రీమింగ్‌ డేట్ వచ్చేసిందోచ్ 
సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ 'పాతాళ్‌ లోక్‌' సీజన్‌ 2 - స్ట్రీమింగ్‌ డేట్ వచ్చేసిందోచ్ 
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Sania Mirza And Shami : దుబాయ్‌లో జంటగా కనిపించిన సానియా మీర్జా, షమీ - సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందా ?
దుబాయ్‌లో జంటగా కనిపించిన సానియా మీర్జా, షమీ - సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందా ?
Embed widget