Chandrayaan 3 Live Streaming Record: రికార్డులు బద్దలుకొట్టిన చంద్రయాన్ 3 లైవ్ స్ట్రీమింగ్, 9.1 మిలియన్లతో ఇస్రో సరికొత్త చరిత్ర
Chandrayaan 3 Live Streaming Record: చంద్రయాన్ 3 ప్రయోగం సందర్భంగా స్పానిష్ లైవ్ స్ట్రీమర్ Ibai అరుదైన రికార్డు నమోదు చేసింది.
Chandrayaan 3 Live Streaming Record: రికార్డులు బద్దలుకొట్టిన చంద్రయాన్ 3
ఇస్రో శాస్త్రవేత్తలు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. చంద్రయాన్ 3 స్పేస్ క్రాఫ్ట్ ల్యాండర్ విక్రమ్ చంద్రుడి నేలపైన సాఫ్ట్ ల్యాండింగ్ విజయవంతం అయింది. తద్వారా చంద్రుడి దక్షిణ ధృవంపై కాలుమోపిన తొలి దేశంగా భారత్ నిలిచింది. దాదాపు 7 వారాలుగా ఎదురు చూస్తున్న భారతీయులు విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్ వీక్షిస్తూ సంబరపడ్డారు. చంద్రయాన్ 2 నేర్పిన పాఠాలతో భారత శాస్త్రవేత్తలు చంద్రయాన్ 3లో విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్ అయిన క్షణంలో ఒక్కసారిగా శాస్త్రవేత్తల ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. దేశమంతా అరగంట పాటు టీవీలు, ఫోన్లకు అతుక్కుపోయి ఉత్కంఠగా సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియను వీక్షించారు. చంద్రయాన్ విజయవంతం కావడంతో ప్రపంచ దేశాల అధినేతలు భారత్ కు అభినందనలు తెలుపుతున్నారు.
9.1 మిలియన్ల మంది వీక్షణలతో ఇస్రో సరికొత్త రికార్డు..
భారతదేశం దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన క్షణాలను దాదాపు 9.1 మిలియన్ల మంది వీక్షించారు. ఇస్రో యూట్యూబ్ ఛానల్ లో 80,59,688 మందికి పైగా జాబిల్లిపై విక్రమ్ ల్యాండింగ్ ను లైవ్ చూశారు. మరోవైపు చంద్రయాన్-3 ల్యాండర్ చంద్రుని ఉపరితలాన్ని తాకినప్పుడు ఫేస్ బుక్ లో 3.55 మిలియన్ల మంది ఇస్త్రో శాస్త్రవేత్తలు సాధించిన ఈ ఘనతను వీక్షించారు.
దూరదర్శన్ టీవీలో ఎంత మంది చూశారో అధికారిక సంఖ్యలు ఇంకా రాలేదు. అయితే చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ జాబిల్లిని తాకినప్పుడు ఛానెల్ యొక్క యూట్యూబ్ పేజీని 750,822 మంది వీక్షిస్తున్నారు. చంద్రయాన్-3 ల్యాండింగ్‌ను ఇస్రో అధికారిక యూట్యూబ్ ఛానల్ తో పాటు పలు పేజీలలో విక్రమ్ ల్యాండింగ్ కావడాన్ని లైవ్ చూడటంతో రికార్డులు నమోదయ్యాయి.
అంతకుముందు.. చంద్రయాన్ 3 ప్రయోగం మొదలైన కొంత సమయానికే స్పానిష్ లైవ్ స్ట్రీమర్ Ibai అరుదైన రికార్డును భారత్ బ్రేక్ చేసింది. స్పెయిన్ లైవ్ స్ట్రీమింగ్ Ibaiని ఒక్కసారిగా 3.4 మిలియన్ల వీక్షకులతో ప్రపంచ రికార్డు (విదేశాల నుంచి) నమోదు చేసింది. అయితే భారత్ కు చెందిన ఇస్రో అధికారిక యూట్యూబ్ ఛానల్ నేటి సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియ సమయంలో 3.6 మిలియన్ల మంది వీక్షించి Ibai రికార్డు తిరగరాసింది. దేశ వ్యాప్తంగా ప్రజలతో పాటు విదేశాల నుంచి చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియను వీక్షించారు.
⚡️ #Chandrayaan3 live stream breaks World record of Spanish streamer Ibai of 3.4 million viewers.
— Megh Updates 🚨™ (@MeghUpdates) August 23, 2023
At present more than 3.6 million people are watching #Chandrayaan3Landing on ISRO's official YouTube channel.
2019లో చంద్రయాన్-2 మిషన్, విక్రమ్ ల్యాండర్ చంద్రుని ఉపరితలంపై కుప్పకూలింది. దాంతో చంద్రయాన్-3 మిషన్ ను ఇస్రో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రపంచంలో జాబిల్లి దక్షిణ ధృవంపై కాలుపెట్టిన తొలి దేశంగా భారత్ నిలిచింది. చంద్రయాన్-3కి రూ. 615 కోట్లు ఖర్చుచేశారు. గతంలో చేసిన ప్రయోగాలతో పోలిస్తే అత్యంత ఖర్చుతో కూడుకున్న ప్రయోగంగా చెప్పవచ్చు. జూలై 22, 2019న ప్రయోగించిన చంద్రయాన్-2, కోసం రూ. 603 కోట్లు, GSLV రాకెట్ కోసం రూ. 375 కోట్లు వెచ్చించారు.
The Journey of Chandrayaan 3 : ఇస్రో చంద్రయాన్ 3 జర్నీ ఇక్కడ వీక్షించండి