అన్వేషించండి

Chandrayaan-3: ఆగస్టు 16 చంద్రయాన్‌కు కీలకం, ఇస్రో ఏం చేస్తుందంటే?

Chandrayaan-3: చంద్రయాన్-3 విజయవంతం అవడానికి మరికొన్ని అడుగుల దూరంలో ఉంది. తాజాగా చంద్రయాన్-3 దీర్ఘవృత్తాకార కక్ష్య నుంచి వృత్తాకార కక్ష్య వైపు అడుగులు వేస్తోంది.

Chandrayaan-3: చంద్రయాన్-3 విజయవంతం అవడానికి మరికొన్ని అడుగుల దూరంలో ఉంది. తాజాగా చంద్రయాన్-3 దీర్ఘవృత్తాకార కక్ష్య నుంచి వృత్తాకార కక్ష్య వైపు అడుగులు వేస్తోంది. ప్రస్తుతం చంద్రయాన్-3 150 కిలోమీటర్ల * 177 కిలోమీటర్ల సమీప కక్ష్యలో ఉందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఇటీవల అప్‌డేట్‌లో తెలిపింది. తాజాగా సోమవారం ఉదయం 11:50కు కక్ష్య సర్క్యులరైజేషన్ దశలోకి చంద్రయాన్ ప్రవేశించింది. ఆగస్టు 16 ఉదయం 8:30 గంటలకు తదుపరి చంద్రునిపైకి వెళ్లే విన్యాసాన్ని ఇస్రో  నిర్వహించనుంది. 

చంద్రుని వైపు అంతరిక్ష నౌక, ఉపగ్రహం ద్వారా వెళ్ళే మార్గం వృత్తాకారంగా ఉంటుంది. కానీ ఖచ్చితంగా గుండ్రంగా ఉండదు. మరో మాటలో చెప్పాలంటే, ఇది ఒక వృత్తాన్ని పోలి ఉండే కక్ష్య, కానీ కొంచెం పొడవు, వైవిధ్యాన్ని కలిగి ఉంటుంది. 

సాధారణంగా, ఒక స్పేస్‌క్రాఫ్ట్ మార్గం దీర్ఘవృత్తాకారంగా ఉంటుంది. దీన్ని పరిష్కరించడానికి, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు వ్యోమనౌక ఇంజిన్‌లను ఒక నిర్దిష్ట మార్గంలో నెట్టుతారు. ఈ 'పుష్' ప్రక్రియ అంతరిక్ష నౌక మార్గాన్ని వృత్తాకారంగా మార్చేందుకు ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియను ఆర్బిట్ సర్క్యులరైజేషన్ అంటారు. 

ఈ సర్క్యులరైజేషన్ కారణంగా చంద్రయాన్-3 చంద్రుని చుట్టూ వృత్తాకార కక్ష్యకు చేరుకుందని ఇస్రో మాజీ శాస్త్రవేత్త తెలిపారు. గతంలో, అంతరిక్ష నౌక చంద్రుడి అంతరిక్షంలోకి ప్రవేశించినప్పుడు 174 కి.మీ * 18,000 కి.మీ. దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరిగేది. అయితే ఇస్రో విజయవంతంగా కక్ష్య తగ్గింపు ప్రక్రియ  నిర్వహించింది. ఈ ఖచ్చితమైన ప్రక్రియ ద్వారా చంద్రయాన్-3 ఇప్పుడు దాదాపు 151 కి.మీ * 179 కి.మీ కక్ష్యలో  చంద్రుని చుట్టూ తిరుగుతోంది. ఇది మిషన్ పురోగతిలో కీలకమైన మైలురాయిగా నిలుస్తుంది.   

ఆగస్టు 16న జరగనున్న తదుపరి ఆపరేషన్ చంద్రయాన్-3 కక్ష్యను పూర్తిగా వృత్తాకారంగా మారుస్తుంది. ఈ యుక్తి తర్వాత, చంద్రయాన్-3 100 కిమీ * 100 కిమీ చంద్ర వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశిస్తుంది.  

ఆగస్టు 9న ఇస్రో ప్రణాళికాబద్ధంగా చంద్రయాన్-3 కక్ష్య తగ్గింపు విన్యాసాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఇది చంద్రయాన్-3ని చంద్రునికి చేరువ చేసింది. ఈ ఆపరేషన్ చేయడానికి, ఇంజిన్ల రెట్రో-ఫైరింగ్ నిర్వహించించింది.  ఈ ప్రక్రియ అంతరిక్ష నౌకను ముందుకు నెట్టడానికి ఉపయోగపడుతుంది. ఇంజిన్‌లు వ్యతిరేక దిశలో మండడం ద్వారా నౌక ముందుకు కదులుతుంది. 

ఆగష్టు 5న చంద్రయాన్ చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. మరుసటి రోజు ఇస్రో కక్ష్య విన్యాసాన్ని నిర్వహించింది. టెలిమెట్రీ, ట్రాకింగ్, కమాండ్ నెట్‌వర్క్ (ISTRAC) పెరిలూన్ వద్ద రెట్రో-ఫైరింగ్‌ చేపట్టి చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్‌ను చొప్పించింది. పెరిలూన్ అనేది చంద్ర కక్ష్యలోని పాయింట్, దీనిలో అంతరిక్ష నౌక చంద్రుడికి దగ్గరగా ఉంటుంది.  

ఆగస్టు 4న చంద్రయాన్-3 భూమికి చంద్రునికి మధ్య ఉన్న దూరాన్ని మూడింట రెండు వంతుల వరకు కవర్ చేసింది. ఆగస్టు 1న, చంద్రయాన్-3 కక్ష్యను పెంచే పెరిజీ బర్న్‌ని విజయవంతంగా పూర్తి చేసింది. ఆగష్టు 1 తెల్లవారుజామున, చంద్రయాన్-3 భూమి చుట్టూ దాని కక్ష్యను పూర్తి చేసింది, తరువాత దానిని ట్రాన్స్‌లూనార్ ఆర్బిట్‌లోకి ప్రవేశించింది. 

చంద్రయాన్-3 ల్యాండర్‌ను చంద్రుని దక్షిణ ధృవం మీద మెత్తగా దింపాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. ఇది సాధ్యమయితే, చంద్రునిపై అంతరిక్ష నౌకను సాఫ్ట్ ల్యాండింగ్ పూర్తి చేసిన నాల్గో దేశంగా ఇండియా అవతరిస్తుంది. చంద్రుని దక్షిణ ధ్రువంపై అంతరిక్ష నౌకను ల్యాండ్ చేసిన మొదటి దేశం కూడా అవుతుంది. 

అయితే ఆగస్టు 11న రష్యా లూనా 25 అంతరిక్ష నౌకను ప్రయోగించింది. చంద్రయాన్ తాత్కాలిక ల్యాండింగ్ తేదీకి రెండు రోజుల ముందు ఆగస్టు 21న చంద్రుని దక్షిణ ధృవం మీద దిగుతుందని భావిస్తున్నారు. దీంతో ఎవరు మొదటి సారి చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగుతారనే ఉత్కంఠ ఏర్పడింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Earthquake In Prakasam: ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
Earthquake In Prakasam: ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
Agriculture: వ్యస'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
వ్యస'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Earthquake In Prakasam: ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
Earthquake In Prakasam: ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
Agriculture: వ్యస'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
వ్యస'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
UI Movie Leaked Online: రియల్ స్టార్ ఉపేంద్రకు షాక్... విడుదలైన గంటల్లోనే ఆన్‌లైన్‌లో 'యూఐ' మూవీ లీక్
రియల్ స్టార్ ఉపేంద్రకు షాక్... విడుదలైన గంటల్లోనే ఆన్‌లైన్‌లో 'యూఐ' మూవీ లీక్ చేసేశారు
Ind Vs Aus Series: అదరగొడుతున్న బుమ్రా.. ఆ లోపాలు సరిదిద్దుకుంటే కోహ్లీ, రోహిత్‌కు తిరుగుండదు
అదరగొడుతున్న బుమ్రా.. ఆ లోపాలు సరిదిద్దుకుంటే కోహ్లీ, రోహిత్‌కు తిరుగుండదు
Look Back 2024 - Celebrity Divorce: పెటాకులైన పెళ్లిళ్లు... 2024లో విడాకులు తీసుకున్న సెలబ్రిటీ కపుల్స్ వీళ్లే
పెటాకులైన పెళ్లిళ్లు... 2024లో విడాకులు తీసుకున్న సెలబ్రిటీ కపుల్స్ వీళ్లే
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Embed widget