అన్వేషించండి

Chandrayaan-2 Discovery Ice on Moon:చంద్రుడి దక్షిణ ధ్రువంలో భారీగా మంచు! చంద్రయాన్ -2 ఆర్బిటర్ పంపిన అద్భుత డేటా!

చంద్రయాన్ -2 ఆర్బిటర్ పంపిన సమాచారంతో చంద్రుడి దక్షిణ ధ్రువంలోని అత్యంత శీతల ప్రాంతాల్లో భారీగా మంచు ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది భవిష్యత్‌లో మానవ నివాసాలకు, ఇంధన తయారీకి కీలకం కానుంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • చంద్రయాన్-2 ఆర్బిటర్ చంద్రుడి దక్షిణ ధ్రువంలో ఉపరితలం కింద నీటి మంచును గుర్తించింది.
  • శాస్త్రవేత్తలు డబ్లీ షాడోడ క్రేటర్స్ లో, బిలియన్ ఏళ్లుగా సూర్యరశ్మి పడని ప్రాంతాల్లో నిక్షేపాలు గుర్తించారు.
  • DFSAR పరికరం మైక్రోవేవ్ ఇమేజింగ్ తో మంచు ఉన్న ప్రాంతాలను నిర్ధారించింది, రాళ్లు, మంచును వేరు చేసింది.
  • ఈ నీటి మంచు భవిష్యత్ అంతరిక్షయానాలకు ప్రాణవాయువు, రాకెట్ ఇంధన వనరుగా ఉపయోగపడుతుంది.

Chandrayaan-2 Discovery Ice on Moon South Pole:ఇస్రో చేపట్టిన చంద్రయాన్-2 మిషన్ అనగానే చాలామందికి ల్యాండర్ వైఫల్యం గుర్తుకు రావచ్చు. కానీ, ఆ మిషన్‌లో భాగమైన ఆర్బిటర్ గత కొన్నేళ్లుగా చంద్రుడి చుట్టూ తిరుగుతూ మన ఊహకందని రహస్యాలను ఛేదిస్తోంది. తాజాగా చంద్రుడి దక్షిణ ధ్రువంలో ఉపరితలం కింద వాటర్ ఐస్ ఉందని ఈ ఆర్బిటర్‌ పంపిన డేటా ద్వారా శాస్త్రవేత్తలు నిర్దారించారు. 

ఆర్బిటర్ అద్భుత అన్వేషణ 

చంద్రుడిపై నీటి జాడలు ఉన్నాయని గతంలోనే తెలుసు, కానీ ఇప్పుడు సర్ఫేస్‌ ఐస్ వెలుగులోకి వచ్చింది. అంటే చంద్రుడి ఉపరితలంపై  కాకుండా కింది పొరల్లో ఈ మంచు దాగి ఉంది. అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనను నిర్వహించారు. ముఖ్యంగా డబ్లీ షాడోడ‌ క్రేటర్స్ అని పిలిచే ప్రాంతాల్లో ఈ నిక్షేపాలు ఉన్నాయి. ఇవి ఎంత చీకటిగా ఉంటాయంటే, కొన్ని బిలియన్ ఏళ్లుగా అక్కడ సూర్యకాంతి అనేది పడలేదు. 

చంద్రుడి దక్షిణ ధ్రువం సౌర కుటుంబంలోనే అత్యంత రహస్యమైన, శీతల ప్రాంతం, ఇక్కడ ఫౌస్టిని అనే పెద్ద గుంత లోపల ఉన్న సుమారు 1.1 కిలోమీటర్ల వ్యాసం కలిగిన ఒక చిన్న గుంతలో అత్యధిక స్థాయిలో మంచు ఉన్నట్టు గుర్తించారు. ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సుమాుర మైనస్‌ 248 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉంటాయి. ఇంతటి విపరీతమైన చలి వల్ల అక్కడ నీరు బిలియన్ల ఏళ్లుగా మంచు గడ్డలుగా  స్థిరంగా ఉంది. 

ఎలా గుర్తించారంటే...?

ఈ అన్వేషణలో చంద్రయాన్ -2 ఆర్బిటర్ మోసుకెళ్లిన DFSAR అనే పరికరం కీలక పాత్ర పోషించింది. ఎల్‌ బ్యాండ్, ఎస్ బ్యాండ్‌ ఫ్రీక్వెన్సీలను ఉపయోగించి మైక్రోవేవ్‌ ఇమేజింగ్‌తో చంద్రుడి ఉపరితలాన్ని స్కాన్ చేశారు. రాళ్లు, మంచును వేరు చేయడానికి శాస్త్రవేత్తలు  సీపీఆర్ , డీఓపీను ఉపయోగించారు. సీపీఆర్ విలువ కంటే 1  కంటే ఎక్కువగా, డీఓపీ విలువ కంటే 0.13 కంట తక్కువగా ఉన్న ప్రాంతాలను మంచు ఉన్న ప్రాంతాలుగా గుర్తించారు. శాస్త్రవేత్తలు అక్కడ లోబేట్ రిమ్‌ ఫీచర్లను కూడా గమనించారు. ఇవి సాధారణంగా ఏదైనా గ్రహ శకలం భూగర్భంలోని మంచు పొరను ఢీ కొట్టినప్పుడు ఏర్పడే ప్రవాహ గుర్తులుగా భావిస్తారు.          

ఇదో పెట్రోల్ బంకులాంటిది! 

చంద్రుడిపై నీరు దొరకడం అనేది కేవలం దాహం తీర్చుకోవడానికే కాదు, భవిష్యత్తు అంతరిక్ష ప్రయాణాలకు అది ఒక పెట్రోల్ బంక్‌ లాంటిది. భవిష్యత్‌్లో చంద్రుడిపై స్థిరపడే వ్యోమగాములు ఇది ఉపయోగపడుతుంది. ఈ నీటిని విడగొట్టడం ద్వారా శ్వాస తీసుకోవడానికి అవసరమైన ప్రాణవాయువును తయారు చేయవచ్చు. నీటిలోని హైడ్రోజన్, ఆక్సిజన్‌ను విడదీసి రాకెట్ ఇంధనంగా వాడవచ్చు. దీని వల్ల భూమి నుంచి భారీ ఇంధనాన్ని మోసుకెళ్లాల్సిన అవసరం తగ్గుంది.           

చంద్రయాన్-3 విజయం మనకు చంద్రుడిపై అడుగుపెట్టే సామర్థ్యాన్ని నిరూపిస్తే, చంద్రయాన్-2 ఆర్బిటర్‌ మనకు అక్కడ ఎక్కడ వనరులు ఉన్నాయో దారి చూపిస్తోంది. ల్యాండర్ విఫలమైనప్పటికీ, ఆర్బిటర్ ఇప్పటికీ అద్భుతమైన డేటాని అందిస్తోంది.  

Frequently Asked Questions

చంద్రయాన్-2 ఆర్బిటర్ చంద్రుడిపై ఏమి కనుగొంది?

చంద్రయాన్-2 ఆర్బిటర్ చంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలం కింద నీటి మంచు నిల్వలను కనుగొంది. ఈ మంచు అత్యంత శీతలమైన, చీకటి ప్రాంతాలలో ఉంది.

చంద్రుడిపై నీటి మంచు ఎక్కడ కనుగొనబడింది?

ఈ నీటి మంచు చంద్రుడి దక్షిణ ధ్రువంలో, ముఖ్యంగా సూర్యరశ్మి పడని 'డబ్లీ షాడోడ క్రేటర్స్' అని పిలిచే ప్రాంతాలలో గుర్తించబడింది. ఫౌస్టిని అనే గుంత లోపల ఉన్న చిన్న గుంతలో అధిక మొత్తంలో మంచు ఉంది.

ఈ నీటి మంచును ఎలా గుర్తించారు?

చంద్రయాన్-2 ఆర్బిటర్ లోని DFSAR అనే పరికరం మైక్రోవేవ్ ఇమేజింగ్ ద్వారా చంద్రుడి ఉపరితలాన్ని స్కాన్ చేసింది. ప్రత్యేక కొలమానాల ఆధారంగా శాస్త్రవేత్తలు మంచు ఉన్న ప్రాంతాలను గుర్తించారు.

చంద్రుడిపై నీటి మంచు యొక్క ప్రాముఖ్యత ఏమిటి?

చంద్రుడిపై నీటి మంచు భవిష్యత్ అంతరిక్ష ప్రయాణాలకు 'పెట్రోల్ బంక్' లాంటిది. దీనిని ఆక్సిజన్, రాకెట్ ఇంధనం కోసం ఉపయోగించవచ్చు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News:అన్నం పెట్టిన వాడిని మర్చిపోతమా? మరోసారి హాట్ కామెంట్స్ చేసిన పోచారం! 
అన్నం పెట్టిన వాడిని మర్చిపోతమా? మరోసారి హాట్ కామెంట్స్ చేసిన పోచారం! 
Sukhbir Singh Badal News: నాందేడ్‌లో సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై కత్తితో దాడి!  
నాందేడ్‌లో సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై కత్తితో దాడి!  
Digital India: డిజిటల్ ఇండియా మీ జీవితాన్ని ఎలా మార్చింది?
డిజిటల్ ఇండియా మీ జీవితాన్ని ఎలా మార్చింది?
Parliament Monsoon Session: లోక్‌సభ నిరవధికంగా వాయిదా!సమావేశాల చివరి రోజున అమిత్ షా రాక!
లోక్‌సభ నిరవధికంగా వాయిదా!సమావేశాల చివరి రోజున అమిత్ షా రాక!
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
Embed widget