అన్వేషించండి

ఈ డిసెంబర్‌లోనే లోక్‌సభ ఎన్నికలు! ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మమతా బెనర్జీ

Loksabha Election 2024: ఈ డిసెంబర్‌లోనే లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశముందని మమతా బెనర్జీ అన్నారు.

 Loksabha Election 2024: 

డిసెంబర్‌లోనే ఎన్నికలు..? 

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది డిసెంబర్‌లోనే లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశముందని అన్నారు. బీజేపీ ఇందుకోసం ముందుగానే కసరత్తు చేసిందని వెల్లడించారు. ఇప్పటికే బీజేపీ అన్ని చాపర్స్‌ని బుక్ చేసుకుందని, దేశవ్యాప్తంగా ప్రచారానికి సిద్ధమవుతోందని స్పష్టం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ యూత్ ర్యాలీలో పాల్గొన్న మమతా బెనర్జీ ఈ కామెంట్స్ చేశారు. మూడోసారి కూడా బీజేపీ అధికారంలోకి వస్తే దేశంలో నిరంకుశ పాలన తప్పదని హెచ్చరించారు. ఇటీవల బరాసత్‌లో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు జరిగింది. ఈ ఘటన గురించీ ప్రస్తావించారు దీదీ. కొందరు కుట్రపూరితంగా ఇక్కడ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, వీళ్లకు కొందరు పోలీసులు కూడా వత్తాసు పలుకుతున్నారని మండి పడ్డారు. ఈ క్రమంలోనే బీజేపీపైనా ఆరోపణలు చేశారు. 

"కేంద్రంలో వరుసగా మూడోసారి కూడా బీజేపీ అధికారంలోకి వస్తే దేశంలో నిరంకుశ పాలన తప్పదు. నాకున్న సమాచారం మేరకు ఈ ఏడాది డిసెంబర్‌లోనే బీజేపీ లోక్‌సభ ఎన్నికలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. ఎన్నికల ప్రచారం కోసం అన్ని చాపర్స్‌ని బుక్ చేసుకుంటోంది. ముందస్తుగానే బుకింగ్స్ చేసుకుని వేరే పార్టీకి ప్రచారం చేసుకునే అవకాశమే లేకుండా చేస్తోంది. ఇప్పటికే బీజేపీ దేశంలో మతాల పేరిట చిచ్చు పెడుతోంది. మళ్లీ ఆ పార్టీయే అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా విద్వేషాలు పెరిగిపోతాయి"

- మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి 

మూడు దశాబ్దాల పాటు పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాలదే హవా. ఆ కంచుకోటను బద్దలు కొట్టి అధికారంలోకి వచ్చింది TMC.ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ దీదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు వామపక్షాలను ఓడించానని, ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీనీ తప్పకుండా ఓడిస్తానని తేల్చి చెప్పారు. గవర్నర్‌ సీవీ ఆనంద్‌ బోస్‌తో ఉన్న విభేదాలనూ ప్రస్తావించారు. రాజ్యాంగ నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నారని మండి పడ్డారు. ఆ పదవికి గౌరవిస్తానని, కానీ రాజ్యాంగబద్ధంగా నడుచుకోకపోవడాన్ని సహించేదే లేదని వెల్లడించారు. మమతా బెనర్జీ కన్నా ముందే పలువురు కీలక నేతలు లోక్‌సభ ఎన్నికలు ముందుగానే వచ్చే అవకాశముందని అన్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎన్‌కే స్టాలిన్ కూడా గతంలో ఈ వ్యాఖ్యలు చేశారు. 

Also Read: Chandrayaan 3 Rover Pragyan: మూన్ వాక్ లో చంద్రయాన్ రోవర్ కు తప్పిన పెను ప్రమాదం, ISRO అలర్ట్

టాప్ హెడ్ లైన్స్

Breaking News: గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
Kerala Influencer Akhil Megha: కేరళం సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ జంటకు దిష్టి తగిలేసిందా? బస్సు క్లీనర్‌తో భార్య పరార్‌! బోరుమంటున్న భర్త!
కేరళం సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ జంటకు దిష్టి తగిలేసిందా? బస్సు క్లీనర్‌తో భార్య పరార్‌! బోరుమంటున్న భర్త!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Miss Apoorva: 'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
Embed widget