అన్వేషించండి

Bharat Rice: కిలో RS. 29కే వచ్చే భారత్‌ రైస్‌ను ఇలా కొనుగోలు చేయండి

Bharath Rice : కేంద్ర ప్రభుత్వం భారత రైస్ పేరుతో తక్కువ ధరకే బియ్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తోంది. దేశవ్యాప్తంగా మంగళవారం నుంచి మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువస్తోంది.

Bharath Rice Sale KG RS 29 Only: సాధారణ, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి ఉండేలా కేంద్ర ప్రభుత్వం భారత రైస్ పేరుతో అతి తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తోంది. దేశవ్యాప్తంగా ఈ రైస్ ను మంగళవారం నుంచి మార్కెట్లో అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ బియ్యాన్ని మార్కెట్లోకి తీసుకువచ్చే పథకాన్ని కేంద్రమంత్రి పీయుష్ గోయల్ ఢిల్లీలో మంగళవారం ప్రారంభించనున్నారు. దేశంలోని బహిరంగ మార్కెట్లో భారీగా పెరిగిన బియ్యం ధరల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా కేంద్రం 'భారత్‌ రైస్‌' (Bharat rice) పేరిట బియ్యాన్ని విక్రయించే కార్యక్రమాన్ని ఫిబ్రవరి 6న (మంగళవారం) ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.

నేడు ప్రారంభించనున్న కేంద్ర మంత్రి 

కేంద్రం తీసుకువస్తున్న భారత్ రైస్ కిలో రూ.29కే అందించే పథకాన్ని కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ (Piyush Goyal) దిల్లీలోని కర్తవ్య పథ్‌లో ప్రారంభించనున్నారు. భారత ఆహార సంస్థ (FCI) నుంచి సేకరించిన ఐదు లక్షల టన్నుల బియ్యాన్ని భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్‌ సమాఖ్య(NAFED), భారత జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య (NCCF), కేంద్రీయ భండార్‌ విక్రయ కేంద్రాల ద్వారా తొలి విడతలో విక్రయించనున్నారు. ఈ రైస్‌ను 5 కిలోలు, 10 కిలోల బ్యాగుల్లో అందుబాటులో తీసుకువచ్చారు. ఇప్పటికే భారత్‌ గోధుమపిండి కిలో రూ.27.50, భారత్‌ శనగ పప్పును రూ.60 చొప్పున నాఫెడ్‌బజార్‌.కాం తదితర ఈ-కామర్స్‌ వేదికల్లో విక్రయిస్తున్నారు. ఈ విక్రయాలకు మంచి స్పందన వస్తుండగా,  భారత్‌ రైస్‌కు అదే స్థాయిలో ఆదరణ లభిస్తుందని కేంద్రం భావిస్తోంది.

ఇలా కొనుగోలు చేయొచ్చు..

ఈ భారత్ రైస్ కావాలనుకునేవారు https://www.nafedbazaar.com/product-tag/online-shopping లోకి వెళ్ళాలి. ఇక్కడ భారత రైస్ తో పాటు పప్పు, శనగపిండి వంటి ఇతర ఉత్పత్తులు కూడా ఉంటాయి. నచ్చిన ఉత్పత్తులను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడే కాకుండా ఇతర ఈ కామర్స్ సైట్లలో నుంచి కూడా ఆర్డర్ చేసుకునే అవకాశం వినియోగదారులకు ఉంది. బహిరంగ మార్కెట్లతో పోలిస్తే సగానికి పైగా తక్కువ ధరకు బియ్యం లభిస్తుండడం, అందులోనూ నాణ్యమైన బియ్యాన్ని అందిస్తుండడంతో వినియోగదారుల నుంచి డిమాండ్ ఉండే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
Handloom Day Modi Reel: జాతీయ చేనేత దినోత్సవంపై ప్రధాని మోదీ కొత్త రీల్‌! చేనేత వస్త్రాలు కొని రీల్స్ చేయాలని పిలుపు!
జాతీయ చేనేత దినోత్సవంపై ప్రధాని మోదీ కొత్త రీల్‌! చేనేత వస్త్రాలు కొని రీల్స్ చేయాలని పిలుపు!
PM Modi: రూపాయికి 66వేల రూపాయల పెట్టుబడి! ప్రధాని మోదీ విదేశీ పర్యటన ఖర్చుపై కీలక ప్రకటన!
రూపాయికి 66వేల రూపాయల పెట్టుబడి! ప్రధాని మోదీ విదేశీ పర్యటన ఖర్చుపై కీలక ప్రకటన!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Embed widget