Ayodhya Ram Mandir: భక్తులతో కిక్కిరిసిపోయిన అయోధ్య - స్వామి దర్శనానికి 40 గంటల సమయం.!
Ram Mandir News: అయోధ్య రాముడిని చూసేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. తొలి దర్శనానికి అర్థరాత్రి నుంచే బారులు తీరారు.
Srhree Ram Mandir News: అంగరంగవైభవంగా ప్రాణప్రతిష్ఠాపనా మహోత్సవం పూర్తైన తర్వాత ఈ రోజు నుంచి అయోధ్య బాలరాముడు సామాన్య భక్తులకు దర్శనమిస్తున్నారు. సోమవారం వీఐపీల రాకతో సామాన్యులను అయోధ్యలోకి అనుమతించని భద్రతా బలగాలు నిన్న రాత్రి నుంచి సామాన్య భక్తులకూ అవకాశమిచ్చాయి.
#WATCH | Ayodhya, Uttar Pradesh: Devotees gather in large numbers at Shri Ram temple on the first day after the Pran Pratishtha ceremony pic.twitter.com/EGo9yr9sXS
— ANI (@ANI) January 23, 2024
ప్రాణప్రతిష్ఠ పూర్తైన తర్వాత జరిగే ప్రభాత కాల దర్శనం కావటంతో భక్తులు వేల సంఖ్యలో అయోధ్య రాముడి ఆలయానికి చేరుకున్నారు. అర్థరాత్రి నుంచి ప్రధాన ద్వారం వద్ద వేలాదిగా రామ భక్తులు దర్శనం కోసం నిలబడ్డారు. స్వామివారి దర్శనానికి టికెట్లు లేకపోవటం..ఐదువందల ఏళ్ల తర్వాత రాముడికి గుడి కట్టి భక్తులకు దర్శన అవకాశం కల్పించటంతో తీర్థక్షేత్ర ట్రస్ట్ కూడా ఊహించని స్థాయిలో అయోధ్యకు భక్తులు చేరుకున్నారు.
#WATCH | Ayodhya, Uttar Pradesh: Security outside Shri Ram Temple to manage the crowd pic.twitter.com/KliJ9dYh2b
— ANI (@ANI) January 23, 2024
వసతి సౌకర్యాలు గదులు ఏ మాత్రం సరిపోకపోగా..ప్రస్తుతం ఉన్న రద్దీ తగ్గాలంటే 40గంటలు పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. భక్తులు సహకరించాలని రామయ్య దర్శించుకునేందుకు కాస్త సంమయమనం ప్రదర్శించాలని ఆలయ అధికారులు కోరుతున్నారు.
#WATCH | Ayodhya, Uttar Pradesh: Heavy rush outside the Ram Temple as devotees throng the temple to offer prayers and have Darshan of Shri Ram Lalla on the first morning after the Pran Pratishtha ceremony pic.twitter.com/gQHInJ5FTz
— ANI (@ANI) January 23, 2024
#WATCH | Ayodhya, Uttar Pradesh: Visuals from the main gate of Shri Ram Temple where devotees have gathered in large numbers since 3 am to offer prayers and have Darshan of Shri Ram Lalla on the first morning after the Pran Pratishtha ceremony pic.twitter.com/hKUJRvIOtm
— ANI (@ANI) January 23, 2024