IND in IRE, 2 T20Is, 2022 | 2nd T20I | Malahide Cricket Club Ground, Dublin - 28 Jun, 09:00 pm IST
(Match Yet To Begin)
IRE
IRE
VS
IND
IND

Rajkundra case : రాజ్‌కుంద్రా కేసులో మరో మలుపు... నటి షెర్లీ చోప్రాకు నోటీసులు

పోర్నోగ్రఫీ కేసు మరో మలుపు తిరిగింది. నటి షర్లీ చోప్రాను పోలీసులు మంగళవారం విచారించనున్నారు. అనంతరం మరికొందరికి నోటీసులు ఇవ్వనున్నారు.

FOLLOW US: 

రాజ్‌కుంద్రా ఫోర్నోగ్రఫీ కేసు మరికొందరు నటుల మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. ఈ కేసులో మోడల్, నటి షెర్లి చోప్రాను విచారణకు పిలిచారు పోలీసులు. ఫోర్న్ సినిమాలు తెరకెక్కిచి.. యాప్‌లలో అప్‌లోడ్ చేస్తున్నారన్న ఆరోపణలపై వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాను ఇటీవలే అరెస్టు చేశారు. ఆయన్ని అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఆయనతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కర్ని పిలిచి విచారిస్తున్నారు. అందులో భాగంగానే నటి షెర్లి చోప్లాకు నోటీసులు జారీ చేశారు. 

నటి షెర్లి చోప్రాకు నోటీసులు ఇచ్చిన ముంబయి క్రైం బ్రాంచ్ ప్రాపర్టీ సెల్‌ పోలీసులు... మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని పేర్కన్నారు. ఇప్పటికే కుంద్రా ఉద్యోగులు ఇచ్చిన ఇన్‌ఫర్మేషన్ కీలకంగా భావిస్తున్న పోలీసులు, ఈ వ్యవహారంపై మరింత కూపీ లాగుతున్నారు.  ఈ క్రమంలోనే షెర్లిన్‌ చోప్రా విచారణ అనంతరం పలువురికి సమన్లు జారీ చేసే ఛాన్స్‌ ఉంది. 

ఈ కేసుపై సోషల్‌ మీడియా ద్వారాషెర్లిన్ చోప్రా స్పందించింది. ఈ ఏడాది ప్రారంభంలో సైబర్ సెల్‌కు అధికారిక ప్రకటన ఇచ్చిన మొదటి వ్యక్తిని తానేనంటూ..పరోక్షంగా మరో వివాదాస్పద నటి పూనం పాండేపై  ఎటాక్‌ చేసింది. అలాగే తనపై ప్రచారం జరుగుతున్నట్లుగా తాను ఎక్కడకీ పారిపోలేదని తెలిపారు. ఇప్పటికే డైరెక్టర్‌ తన్వీర్‌ హష్మిని విచారించారు. నిజంగానే 20 నుంచి 25 నిమిషాల లెంత్‌ ఉన్న షార్ట్‌ఫిల్మ్స్‌ తీసినట్టు ఒప్పకున్నట్టు తెలుస్తోంది. 

రాజ్‌కుంద్రా కేసు నేపథ్యంలో ఆయనతో పని చేసిన చాలా మంది బయటకి వచ్చి వివరణ ఇస్తున్నారు. నటి ఫ్లోరా సైనీ కూడా కేసుపై స్పందించారు. తానెప్పుడూ రాజ్‌కుంద్రాను కలవలేదని చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా తాను మాట్లాడకుంటే తప్పుచేసినట్టు అవుతుందని... అంతా అలానే ఫీల్ అవుతారని అన్నారు. ఎవరో ఇద్దరు చాటింగ్ చేసుకొని తన పేరు ప్రస్తావిస్తే ఈ కేసులో తనను ఇన్వాల్వ్‌ చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. కెరీర్‌ స్టార్టింగ్‌లో అలాంటి సినిమాల్లో నటించానేమో కానీ... గుర్తింపు వచ్చిన తర్వాత అలాంటి వాటి జోలికి వెళ్లలేదని వివరణ ఇచ్చారు. 

కేసులో నటి శిల్పాశెట్టిని కూడా మరోసారి విచారించారుపోలసులు. రాజ్ కుంద్రాను వెంటబెట్టుకొని జుహులోని నివాసంలో సోదాలు చేపట్టారు. కేసుకు సంబంధించిన కొన్ని ఆధారాలు దొరికినట్టు తెలుస్తోంది. రాజ్‌కుంద్రా, శిల్పాశెట్టిని ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారిస్తుంటే శిల్పా శెట్టి కన్నీళ్లు పెట్టుకున్నట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. 

తమ ఇమేజ్‌ డ్యామేజ్‌ అయ్యిందని చెబుతూ పోలీసుల ముందు శిల్పాశెట్టి ఎమోషనల్‌ అయిందట. ఈ కేసు వల్ల కొన్ని అగ్రిమెంట్స్‌ క్యాన్సిల్‌ అయ్యాయని, తీవ్రంగా నష్టాలు వస్తున్నాయని ఆవేదన చెందారు. విచారణ కోసం పోలీసులు తీసుకొచ్చిన రాజ్‌కుంద్రాతో శిల్ప వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తోంది. విచారణలో రాజ్‌కుంద్రా అడల్ట్‌ సినిమాలు తీస్తారే కానీ.. పోర్న్‌ సినిమాలు తీయరని స్టేట్‌మెంట్‌లో శిల్ప వివరించింది. 

హాట్‌షాట్స్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో వచ్చే కంటెంట్‌పై అవగాహన లేదని... అందులో తన ప్రమేయం ఏ మాత్రం లేదని వెల్లడించింది శిల్పా.  మరోవైపు రాజ్‌కుంద్రాకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను ముంబయి పోలీసులు సీజ్‌ చేస్తున్నారు. కాన్పూర్‌లోని స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా శాఖలో రాజ్‌కుంద్రా, శిల్పాశెట్టికి ఉన్న అకౌంట్స్‌  సీజ్ చేయాలని ఎస్‌బీఐకి లెటర్ రాశారు. 

Published at : 26 Jul 2021 09:29 PM (IST) Tags: rajkudnra Shipla Shetty pornography case sharlyn chopra

సంబంధిత కథనాలు

Mohammed Zubair Arrested : జర్నలిస్ట్ మహ్మద్ జుబేర్ అరెస్ట్, ఓ మతాన్ని కించపరిచేలా మాట్లాడారని ఆరోపణలు

Mohammed Zubair Arrested : జర్నలిస్ట్ మహ్మద్ జుబేర్ అరెస్ట్, ఓ మతాన్ని కించపరిచేలా మాట్లాడారని ఆరోపణలు

AAI Junior Executive Recruitment: సైన్స్‌లో డిగ్రీ చేసిన వాళ్లకు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆహ్వానం- లక్షన్నర వరకు జీతం

AAI Junior Executive Recruitment: సైన్స్‌లో డిగ్రీ చేసిన వాళ్లకు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆహ్వానం- లక్షన్నర వరకు జీతం

PSLV C-53 Launch : ఈ నెల 30న నింగిలోకి పీఎస్ఎల్వీ సీ53, శ్రీహరికోటలో ప్రయోగ ఏర్పాట్లు షురూ

PSLV C-53 Launch : ఈ నెల 30న నింగిలోకి పీఎస్ఎల్వీ సీ53, శ్రీహరికోటలో ప్రయోగ ఏర్పాట్లు షురూ

Wanted Bride Posters : పెళ్లి కూతురు కావాలని ఊరి నిండా జగన్ పోస్టర్లు - పిల్ల దొరుకుతుందా ?

Wanted Bride Posters :  పెళ్లి కూతురు కావాలని ఊరి నిండా జగన్ పోస్టర్లు - పిల్ల దొరుకుతుందా ?

Get Free iPadi: సెల్ఫీ తీసి పంపిస్తే ఐపాడ్‌- దిల్లీ ప్రభుత్వం అదిరిపోయే ఆఫర్

Get Free iPadi: సెల్ఫీ తీసి పంపిస్తే ఐపాడ్‌- దిల్లీ ప్రభుత్వం అదిరిపోయే ఆఫర్

టాప్ స్టోరీస్

Actor Prasad: చెట్టుకి ఉరేసుకొని చనిపోయిన నటుడు - కారణమేంటంటే?

Actor Prasad: చెట్టుకి ఉరేసుకొని చనిపోయిన నటుడు - కారణమేంటంటే?

Srilanka Crisis : శ్రీలంకలో పెట్రోల్ సెలవులు - ఎప్పటి వరకో తెలియదు!

Srilanka Crisis : శ్రీలంకలో పెట్రోల్ సెలవులు - ఎప్పటి వరకో తెలియదు!

Mahindra Scorpio N Launched: తక్కువ ధరతో, సూపర్ ఫీచర్లతో కొత్త స్కార్పియో - మహీంద్రా మళ్లీ కొట్టిందిగా!

Mahindra Scorpio N Launched: తక్కువ ధరతో, సూపర్ ఫీచర్లతో కొత్త స్కార్పియో - మహీంద్రా మళ్లీ కొట్టిందిగా!

Tollywood: ప్లాప్ సినిమాలను బ్లాక్ బస్టర్స్ అంటున్నారే!

Tollywood: ప్లాప్ సినిమాలను బ్లాక్ బస్టర్స్ అంటున్నారే!