By: Ram Manohar | Updated at : 05 Jun 2023 12:12 PM (IST)
ఒడిశాలో ఓ సిమెంట్ ఫ్యాక్టరీకి చెందిన గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.(Image Credits: ANI)
ఒడిశాలో మరో రైలు ప్రమాదం జరిగింది. బార్‌గర్ జిల్లాలో ఓ గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పింది. ఐదు బోగీలు ట్రాక్ తప్పి కింద పడిపోయాయి. డుంగురి నుంచి బార్‌గర్ వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు. అయితే...ఈ ప్రమాదంపై ఈస్ట్ కోస్ట్ రైల్వే స్పందించింది. ఈ ఘటనతో రైల్వేకి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఓ ప్రైవేట్ సిమెంట్ ఫ్యాక్టరీకి చెందిన గూడ్స్ ట్రైన్ ఫ్యాక్టరీ ప్రాంగణంలోనే అదుపు తప్పి పడిపోయిందని స్పష్టం చేసింది.
#WATCH | Some wagons of a goods train operated by a private cement factory derailed inside the factory premises near Mendhapali of Bargarh district in Odisha. There is no role of Railways in this matter: East Coast Railway pic.twitter.com/x6pJ3H9DRC
— ANI (@ANI) June 5, 2023
This is completely a narrow gauge siding of a private cement company. All the infrastructure including rolling stock, engine, wagons, train tracks (narrow gauge) are being maintained by the company: East Coast Railway
— ANI (@ANI) June 5, 2023
సీబీఐ విచారణ...
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కోరమండల్ రైలు ప్రమాదంపై సీబీఐ విచారణకు రైల్వే బోర్డు సిఫారసు చేసింది. ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. సీబీఐ సమగ్ర దర్యాప్తుతో ప్రమాదానికి కారణాలు, బాధ్యులెవరో తేలుతుందన్నారు. రైలు ప్రమాదం ఘటనలో ఇప్పటికే 275 మంది ప్రాణాలు కోల్పోగా, 800 మందికి పైగా గాయపడ్డారు. కొందరి డెడ్ బాడీలను గుర్తించి వారి కుటుంబసభ్యులకు అప్పగించగా, 170 నుంచి 180 వరకు డెబ్ బాడీలను గుర్తించలేదని, అవి కుళ్లిపోయే అవకాశం ఉండటంతో గుర్తించడం కష్టమేనని కొందరు అధికారులు భావిస్తున్నారు. శుక్రవారం జరిగిన ఈ రైలు ప్రమాదం ప్రపంచ దేశాలను సైతం కలచివేసింది. మెయిన్ లైన్ లో వెళ్లాల్సిన కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు లూప్ లైన్ లోకి వచ్చి గూడ్స్ రైలును ఢీకొట్టడంతో కొన్ని బోగీలు పట్టాలు తప్పాయి. ఆ తరువాత హౌరాకు వెళ్తున్న యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ రైలు.. కోరమండల్ బోగీలను ఢీకొట్టడంతో భారీ విషాదంగా మారింది. ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్, పాయింట్ మెషీన్లో చేసిన మార్పు వల్ల రైలు ప్రమాదం జరిగిందని బాలాసోర్ జిల్లాలో ప్రమాద స్థలంలో మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. ఈ కేసు దర్యాప్తును సీబీఐ అప్పగించాలని భావిస్తున్నట్లు అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.
Also Read: Amit Shah meets wrestlers: కేంద్ర హోంమంత్రితో రెజ్లర్ల భేటీ, చట్టం పని చట్టాన్ని చేసుకోనివ్వండన్న అమిత్షా
Ram Sethu: రామసేతు వద్ద గోడ నిర్మించాలని పిల్- తిరస్కరించిన సుప్రీం
Delhi-NCR Earthquake: ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూప్రకంపనలు, నేపాల్ లో 6.2 తీవ్రతతో భూకంపం
Modi In Chhattisgarh: కాంగ్రెస్ లోక్‌తంత్రను లూట్‌తంత్రగా మారుస్తోంది: ప్రధాని మోదీ
SSC: స్టెనోగ్రాఫర్ అభ్యర్థులకు అలర్ట్. 'అప్లికేషన్ స్టేటస్' వివరాలు చెక్ చేసుకోండి, త్వరలో అడ్మిట్ కార్డులు అందుబాటులో
Maharashtra Hospital: ఒకే ఆస్పత్రిలో ఒకే రోజులో 24 మంది మృతి - నాందేడ్‌లో తీవ్ర విషాదం!
Pawan Kalyan Health: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత, జనవాణి మధ్యలోనే వెళ్లిపోయిన జనసేనాని - అసలేం జరిగింది!
Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మాగుంట రాఘవ కూడా అప్రూవరే - ఆమోదించిన రౌస్ అవెన్యూ కోర్ట్ !
Bala Krishna: బాలకృష్ణ ముఖం మీద గాజులు పగలగొట్టించుకున్నారు, ఉమ్మి వేయమన్నారు - నటుడు అప్పాజీ సంచలన వ్యాఖ్యలు!
Yashasvi Jaiswal: బాబోయ్ ఏంటీ విధ్వంసం! యంగెస్ట్ టీ20 సెంచూరియన్‌గా గిల్ రికార్డు బద్దలు కొట్టిన జైశ్వాల్
/body>