అన్వేషించండి

మీరు కూడా అధికార దాహంతో ఉన్నట్టు కనిపిస్తోంది- కేజ్రీవాల్‌కు అన్నాహజారే ఘాటు లేఖ

మద్యం మత్తు ఎలా ఉంటుందో, అధికార మత్తు కూడా ఉంటుంది. అలాంటి అధికార మత్తులో మీరు మునిగిపోయినట్టు కనిపిస్తున్నారని కేజ్రీవాల్‌కు లేటర్ రాశారు అన్నాహజారే.

ఢిల్లీ లిక్కర్ పాలసీ వివాదంపై సామాజిక ఉద్యమకారులు అన్నాహజారే స్పందించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్ కేజ్రివాల్‌కు లేఖ రాశారు. ప్రస్తుతం నడుస్తున్న లిక్కర్‌పాలసీపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.  

2012లో ఇండియా అగైనెస్ట్ కరప్షన్ ఉద్యమంలో తనతోపాటు నడిచిన కేజ్రీవాల్‌కు రాసిన లేఖలో హజారే కీలక కామెంట్స్ చేశారు. అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి బయటపడిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇతర పార్టీల మార్గాన్నే అనుసరించడం ప్రారంభించిందని ఆక్షేపించారు. 

"10 సంవత్సరాల క్రితం 18 సెప్టెంబర్ 2012న అన్నా టీమ్ సభ్యులందరూ ఢిల్లీలో సమావేశమయ్యారు. అప్పుడే రాజకీయాల్లో ప్రవేశించాలన్న అంశంపై చర్చ జరిగింది. కానీ రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడం ఉద్యమ లక్ష్యం కాదని అప్పుడు అనుకున్నది మీరు మర్చిపోయారు.  ఆ సమయంలో అన్నా టీమ్‌పై ప్రజల్లో ఎంతో నమ్మకం ఉండేది.' అని లేఖలో పేర్కొన్నారు.

అన్నా టీమ్ దేశవ్యాప్తంగా పర్యటించింది... ప్రభుత్వ విద్య కోసం పని చేయాల్సిన అవసరంపై ప్రచారం చేసింది. అలాంటి విద్యరంగం అభివృద్ధి కోసం ప్రభుత్వాలు పని చేసి ఉంటే.. దేశంలో ఎక్కడా ఇలాంటి తప్పుడు లిక్కర్ పాలసీ ఏర్పడి ఉండేది కాదు. ప్రభుత్వం ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వంతో పని చేయించడానికి ఓ గ్రూప్‌ అవసరం ఉంది. భావసారూప్యత కలిగిన వ్యక్తుల సమూహమై ఉండాలని అన్నాహజారే అన్నారు. 

అలాంటిది జరిగి ఉంటే ఈ రోజు దేశంలో పరిస్థితి భిన్నంగా ఉండేది. పేద ప్రజలు ప్రయోజనం పొందేవారు. కానీ దురదృష్టవశాత్తు ఇది జరగలేదు. ఆ తర్వాత ఆప్, మనీష్ సిసోడియా, మీ ఇతర సహచరులు కలిసి పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వచ్చారు. ఢిల్లీ ప్రభుత్వ నూతన మద్యం పాలసీని చూసిన తర్వాత చారిత్రాత్మక ఉద్యమంలో ఓడిపోయారనిపిస్తోంది. ఉద్యమం నుంచి ఆవిర్భవించిన పార్టీ కూడా ఇతర పార్టీల బాటలోనే పయనిస్తున్నట్టుగానే ఉంది. ఇది చాలా బాధాకరం' అని లేఖలో రాశారు.

మద్యం మత్తు ఎలా ఉంటుందో, అదే విధంగా అధికార మత్తు కూడా ఉంది. నువ్వు కూడా అలాంటి అధికారం మత్తులో మునిగిపోయావు అని సీరియస్ కామెంట్స్ చేశారు. 

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ వివాదంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు చెందిన ఘజియాబాద్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ లాకర్‌ను సీబీఐ మంగళవారం తనిఖీ చేసింది. 

టాప్ హెడ్ లైన్స్

Viral Video: భార్యతో గొడవ.. బ్యాంక్ నుంచి తెచ్చి రూ.500 నోట్లు తగలబెట్టిన భర్త 
భార్యతో గొడవ.. బ్యాంక్ నుంచి తెచ్చి రూ.500 నోట్లు తగలబెట్టిన భర్త 
Chahal Politics: బీజేపీలో చేరిన భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. ప్రధాని మోదీతో పాత వీడియో వైరల్
బీజేపీలో చేరిన భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. ప్రధాని మోదీతో పాత వీడియో వైరల్
EPFO కొత్త రూల్స్.. హోమ్ లోన్ కోసం పీఎఫ్ ఖాతా నుంచి ఎంత విత్‌డ్రా చేయవచ్చు
EPFO కొత్త రూల్స్.. హోమ్ లోన్ కోసం పీఎఫ్ ఖాతా నుంచి ఎంత విత్‌డ్రా చేయవచ్చు
Kolathur By Election 2026: కొళత్తూర్ ఉపఎన్నికతో అసెంబ్లీలో స్టాలిన్ రీఎంట్రీ ఛాన్స్.. తమిళనాట వేడెక్కిన రాజకీయం!
కొళత్తూర్ ఉపఎన్నికతో అసెంబ్లీలో స్టాలిన్ రీఎంట్రీ ఛాన్స్.. తమిళనాట వేడెక్కిన రాజకీయం!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గాంధీ భవన్‌లో కొత్త ఇంఛార్జ్ సందీప్‌నకు సీఎం రేవంత్ ఘనస్వాగతం.. కీలక అంశాలపై చర్చ
గాంధీ భవన్‌లో కొత్త ఇంఛార్జ్ సందీప్‌నకు సీఎం రేవంత్ ఘనస్వాగతం.. కీలక అంశాలపై చర్చ
Pawan Kalyan: పంచాయతీ ఎన్నికల్లో పోటీపై జనసైనికులకు పూర్తి స్వేచ్ఛ.. పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన
పంచాయతీ ఎన్నికల్లో పోటీపై జనసైనికులకు పూర్తి స్వేచ్ఛ.. పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన
Viral Video: భార్యతో గొడవ.. బ్యాంక్ నుంచి తెచ్చి రూ.500 నోట్లు తగలబెట్టిన భర్త 
భార్యతో గొడవ.. బ్యాంక్ నుంచి తెచ్చి రూ.500 నోట్లు తగలబెట్టిన భర్త 
Rishabh Pant Century: తొలి టెస్టులో 720 పరుగులతో ఇండియా రికార్డు.. ఆసియా తొలి వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ అరుదైన మైలురాయి
తొలి టెస్టులో 720 పరుగులతో India రికార్డు.. ఆసియా తొలి వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ అరుదైన మైలురాయి
AgriGold Scam: అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. ఈ నెల 25 నుంచి బాండ్ల వెరిఫికేషన్.. వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలివే
అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. ఈ నెల 25 నుంచి బాండ్ల వెరిఫికేషన్.. వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలివే
Hyderabad Crime News: డబ్బులు ఇవ్వకపోతే కుటుంబాన్ని లేపేస్తానంటూ బెదిరింపులు.. లేడీ డాన్ అరెస్ట్!
డబ్బులు ఇవ్వకపోతే కుటుంబాన్ని లేపేస్తానంటూ బెదిరింపులు.. లేడీ డాన్ అరెస్ట్!
Jagan vs Sharmila: యలహంక ప్యాలెస్ వివాదం.. షర్మిలను అడ్డుకునేందుకు కోర్టులో వైఎస్ జగన్ పిటిషన్!
యలహంక ప్యాలెస్ వివాదం.. షర్మిలను అడ్డుకునేందుకు కోర్టులో వైఎస్ జగన్ పిటిషన్!
Jabardasth Team Accident : రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ టీం సభ్యులకు గాయాలు - పంచాయతీ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా...
రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ టీం సభ్యులకు గాయాలు - పంచాయతీ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా...
Embed widget