Air India Plane Crash Death Toll: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 24 మంది మెడికోలు సహా 265 మంది మృతి
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 24 మంది మెడికోలు సహా మొత్తం 265 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో రమేష్ విశ్వాస్ కుమార్ అనే ఓ ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.

అహ్మదాబాద్: అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన వెంటనే గురువారం (జూన్ 12, 2025) మధ్యాహ్నం ఎయిర్ ఇండియా విమానం క్రాష్ అయింది. అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్తున్న వైడ్‌బాడీ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ ఎయిరిండియా విమానం (AI171 Boeing 787 Dreamliner) కూలిన ప్రమాదంలో భారీగా ప్రాణ నష్టం సంభవించింది. ఇప్పటివరకు 265 మంది మరణించినట్లు అధికారులు చెబుతున్నారు. విమానంలో ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది, 229 మంది ప్రయాణికులు మరణించారు. ఈ ప్రమాదం నుంచి రమేష్ విశ్వాస్‌కుమార్ అనే 11ఏ సీటు ప్రయాణికుడు ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డారు. అయితే విమానం పడటంతో మెడికల్ కాలేజీకి చెందిన 24 మంది చనిపోయారు.
ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ సహా అందులోని మొత్తం సిబ్బంది, ఓ ప్రయాణికుడు సహా అంతా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఎయిరిండియా ఫ్లైట్ మెయిన్ పైలట్ స్లైవ్ కుందర్ నటుడు విక్రాంత్ మాస్సే సోదరుడు. తన సోదరుడి మృతిపై నటుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
🚨 MIRACLE SURVIVAL 🚨
— Shilpa Sahu (@shilpasahu432) June 12, 2025
Man on Seat 11A survives deadly Air India crash in Ahmedabad!
🙏 Ramesh Vishwaskumar Bucharvada reportedly jumped from the plane during the incident.
He's alive and receiving treatment in hospital.
Police Commissioner GS Malik confirms survival.… pic.twitter.com/QggYGfJM7Q
ఈ సంఘటన గురించి ABP అస్మిత ఎడిటర్ రౌనక్ పటేల్ మాట్లాడుతూ, "సివిల్ ఆసుపత్రికి వచ్చిన మృతదేహాలన్నీ తీవ్రంగా కాలిపోయాయి. వాటిని గుర్తించడం చాలా కష్టంగా మారింది. కొందరు ప్రయాణికుల మృతదేహాలు ముక్కలుగా సైతం వచ్చాయి. తీవ్రంగా కాలిపోవడం, శరీరం ముక్కలు కావడంతో పరిస్థితి భయానకంగా మారింది. అయితే హాస్పిటల్‌కు వచ్చిన మృతదేహాలను లెక్కించిన తరువాత ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ క్రాష్ అయిన ప్రమాదంలో మృతుల సంఖ్య 265 కి పెరిగింది." అని తెలిపారు.
మెడికల్ కాలేజీపై కూలడంతో పెరిగిన ప్రాణనష్టం..
లండన్‌కు టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం రెండు ఇంజిన్లు పనిచేయకపోవడంతో మేడే కాల్ చేశారు. వెంటనే అది నియంత్రణ కోల్పోయిన మెడికల్ కాలేజీ హాస్టల్ బిల్డింగ్ మీద కూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 242 మందిలో ఒక్క ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డాడు. మెడికల్ కాలేజీలో లంచ్ టైం కావడంతో చాలా మంది మెడికోలు తినడానికి వచ్చారు. అదే సమయంలో విమానం కూలడంతో మంటలు చెలరేగి దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. ఈ ప్రమాదంలో మెడికల్ కాలేజీ హాస్టల్లోని 24 మంది మెడికోలు సైతం ప్రాణాలు కోల్పోయారు. మృతుల వివరాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ సంఘటనపై ఎయిర్ ఇండియా తీవ్ర విచారం వ్యక్తం చేసింది మరియు మృతుల కుటుంబాలకు అన్ని విధాలుగా సహాయం చేస్తామని హామీ ఇచ్చింది. అహ్మదాబాద్‌లోని సివిల్ హాస్పిటల్ పక్కన ఉన్న బిజె మెడికల్ కాలేజీ హాస్టల్‌పై విమానం కూలిపోయింది. భోజన సమయంలో ఈ సంఘటన జరిగింది, ఆ సమయంలో హాస్టల్‌లోని మెస్ ఏరియా వైద్య విద్యార్థులతో నిండి ఉంది. శిథిలాల ఫోటోలు మరియు వీడియోలు మరియు హాస్టల్‌పై ప్రమాదం యొక్క ప్రభావం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, ఇది దేశవ్యాప్తంగా షాక్ మరియు దుఃఖాన్ని రేకెత్తిస్తోంది.






















