Viral News: ప్రేమ కోసం అబ్బాయిగా మారిన యుువతి- ఉత్తర్‌ప్రదేశ్‌లో సంచలనం
ఈ మధ్యకాలంలో ఇద్దరు అమ్మాయిలు, లేదా ఇద్దరు అబ్బాయిలు ప్రేమించుకోవడం.. పెళ్లి చేసుకోవడం తరచూ చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సంఘటనే ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో ఇద్దరు యువతులు ప్రేమించుకున్నారు. ఒకర్ని విడిచి మరొకరు ఉండలేని పరిస్థితికి వెళ్లిపోయారు. ఇంట్లో వాళ్లు సంబంధాలు చూస్తున్నారన్న సంగతి తెలుసుకున్న ఈ ఇద్దరి యువతులు ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు.
ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్న ఇద్దరు యువతులు.. తమ సంగతి పెద్దల ముందు ఉంచారు. ఒకరంటే ఇంకొకరికి ఇష్టమని చెప్పారు. పెళ్లంటూ చేసుకుంటే తామే చేసుకుంటామని తెగేసి చెప్పారు.
దీన్ని అనర్ధంగా భావించిన పెద్దలు ఆ యువతుల ప్రోపజ్‌లను తిరస్కరించారు. ఇలాంటివి మరోసారి తమ వద్ద ప్రస్తావిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఇద్దరు యువతులు ప్రేమించుకోవడం ఏంటని పెళ్లి చేసుకోవడం ఏంటని ఆశ్చర్యపోయారు.
తాము ఇద్దరం అమ్మాయిలైన కారణంగానే పెద్దలు తమ పెళ్లికి అంగీకరించడం లేదని గ్రహించిన ఆ యువతులు సంచలనం నిర్ణయం తీసుకున్నారు. అందులో ఒకామె లింగమార్పిడి చికిత్స చేసుకునేందుకు అంగీకరించింది. ఒకరు అబ్బాయిగా మారితే ఇంట్లో వాళ్లను ఒప్పించవచ్చని ఆలోచించి ఇలాంటి డెసిషన్‌కు వచ్చారు.
అంతే ప్రయాగ్‌రాజ్‌లోని నెహ్రూ ఆసుపత్రికి వెళ్లి డాక్టర్ స్వరూప రాణిని కలిశారు. ఒకరికి లింగమార్పిడి చికిత్స చేయాలని చెప్పారు. ఇద్దరూ మేజర్లు కావడంతో డాక్టర్ కూడా ఓకే చెప్పారు. దీంతో ఆపరేషన్ చేశారు. మరో ఏడాదిన్నరలో ఆమె పూర్తిగా అతడుగా మారిపోతుందన్నారు.
అతడుగా మారుదామనుకున్న యువతికి టెస్టోస్టెరాన్ రీప్లేస్‌మెంట్ థెరపీ నిర్వహించారు. దీని వల్ల చాతీపై వెంట్రుకలు వస్తాయని.. మహిళా లక్షణాలు పోతాయని వైద్యులు వివరించారు. ఈ చికిత్స తర్వాత తను గర్భవతి కావాలంటే మాత్రం వీలు పడదని వివరించారు. అన్నింటికీ సిద్ధపడే ఆ యువతి లింగమార్పిడి చికిత్సకు రెడీ అయ్యారు.