హిమాలయాల్లో 60 కోట్ల సంవత్సరాల క్రితం నాటి సముద్రపు ఆనవాళ్లు, కనుగొన్న సైంటిస్ట్‌లు
Ocean in Himalayas: హిమాలయాల్లో 60 కోట్ల సంవత్సరాల క్రితం నాటి సముద్రపు ఆనవాళ్లను సైంటిస్ట్‌లు కనుగొన్నారు.
Ocean in Himalayas:
మరో మిస్టరీ..
హిమాలయాలు ఎన్నో మిస్టరీలు దాచుకున్నాయి. స్టడీ చేయాలే వాటన్నింటినీ ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకురావచ్చు. అందుకే... ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్ట్‌లు వీటిపై పరిశోధనలు కొనసాగిస్తూనే ఉన్నారు. జపాన్‌లోని Niigata University సైంటిస్ట్‌లతో పాటు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సైంటిస్ట్‌లూ మరో ఆసక్తికర విషయం వెలుగులోకి తీసుకొచ్చారు. 60 కోట్ల సంవత్సరాల క్రితం నాటి సముద్రపు ఆనవాళ్లు ఇక్కడ నీటి బిందువుల రూపంలో కనిపించాయి. ఇక్కడే కొన్ని మినరల్ డిపాజిట్స్‌నీ గుర్తించారు. వీటని కలెక్ట్ చేసిన సైంటిస్ట్‌లు అధ్యయనం చేశారు. ఈ మినరల్స్‌లో కాల్షియంతో పాటు మెగ్నీషియం కార్బొనేట్స్ ఉన్నట్టు గుర్తించారు. శాస్త్రవేత్తలు చెబుతున్న వివరాల ప్రకారం...50-70 కోట్ల సంవత్సరాల క్రితం భూగోళమంతా మంచుతో కప్పేసి ఉంది. దీన్నే Snowball Earth Glaciation అంటారు. భూమి చరిత్రలో అత్యంత కీలకమైన శకం ఇదే. అయితే...ఆ తరవాత భూమి వాతావరణంలో ఆక్సిజన్ పెరుగుతూ వచ్చింది. దీన్నే Second Great Oxygenation Eventగా పిలుస్తారు. కోట్ల సంవత్సరాల క్రితం ఉన్న సముద్రాలు క్రమంగా ఎలా మాయమైపోయాయన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. దీనిపై ఇంకా అధ్యయనాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో హిమాలయాల్లో సముద్రపు ఆనవాళ్లు కనిపించడం ఈ పరిశోధనలకు తోడ్పడనుంది. ఇప్పటికీ శాస్త్రవేత్తలు చెప్పే మాట ఒకటే "మనకు సముద్రాల గురించి తెలిసింది చాలా తక్కువ" అని. ప్రస్తుత సముద్రాలతో పోల్చి చూస్తే అవి ఎలా ఉండేవో స్పష్టంగా చెప్పలేకపోతున్నామని అంటున్నారు.
"కోట్ల సంవత్సరాల క్రితం ఉనికిలో ఉన్న సముద్రాలు ఎలా ఉండేవో స్పష్టంగా చెప్పలేం. ప్రస్తుత సముద్రాలతో వాటిని పోల్చలేం. వాటిలో యాసిడ్స్ ఉన్నాయా..? న్యూట్రియెంట్‌లు ఉన్నాయా..? వేడిగా ఉన్నాయా లేదంటే చల్లగా ఉన్నాయా..? ఇలా ఎన్నో ప్రశ్నలు చుట్టుముడుతున్నాయి. ఇప్పుడు హిమాలయాల్లో సముద్రపు జాడలు కనిపించాయి. ఇలాంటివి మా పరిశోధనలకు ఎంతో హెల్ప్ అవుతాయి. భూ వాతావరణం ఒకప్పుడు ఎలా ఉండేదో అంచనా వేయడానికి వీలవుతుంది. హిమాలయాల్లో కనిపించిన డిపాజిట్స్ స్నోబాల్ ఎర్త్ గ్లేషియేషన్ శకానికి చెందినవిగా భావిస్తున్నాం"
- సైంటిస్ట్‌లు
పరిశోధనలకు ఊతం..
ఒకప్పుడు సముద్రాల్లో ప్రవాహం చాలా తక్కువగా ఉండేదని వివరిస్తున్నారు శాస్త్రవేత్తలు. వాటిలో కాల్షియమ్ కూడా తక్కువే అని చెబుతున్నారు. ఇలాంటి సమయంలోనే నీళ్లలో మెగ్నీషియం మోతాదు పెరుగుతుందని వెల్లడించారు. కుమావో హిమాలయాల్లో ప్రస్తుతం డిపాజిట్‌లను కనుగొన్నారు. సముద్రాల చరిత్రను మరింత క్షుణ్ణంగా అర్థం చేసుకునేందుకు ఇవి ఉపయోగపడతాయని భావిస్తున్నారు.
కరుగుతున్న హిమాలయాలు..
గతేడాది వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు, విపరీతమైన వేడిగాలుల కారణంగా హిమాలయా ల్లోని గ్లేషియర్స్ కరిగిపోయాయి. దాదాపు 15 ఏళ్లుగా హిమాలయాల స్థితిగతులపై అధ్యయనం చేస్తోంది పరిశోధకుల బృందం. మంచుఅత్యంత వేగంగా కరిగిపోతున్నట్టు గుర్తించారు. గతేడాది మార్చి, ఏప్రిల్‌లో 100 ఏళ్ల రికార్డులూ చెరిపేసి అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆ సమయంలోనే గ్లేషియర్స్ కరిగిపోవటాన్ని గమనించారు. ఈ కరిగిపోవటం కూడా చాలా వేగంగా, భారీగా జరుగుతోందన్నది పరిశోధకులు తేల్చి చెప్పిన విషయం. మంచు పొరలతో ఏర్పడ్డ గ్లేషియర్స్ కొన్ని వందల కిలోమీటర్ల మేర పై నుంచి కిందక వరకూ విస్తరించి ఉంటాయి. కేవలం హిమాలయాల్లోనే కాదు. ఐరోపాలోని ఆల్ప్స్ (Alps) పర్వతాల్లోని మంచు కూడా చాలా వేగంగా కరిగిపోతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే..హిమాలయాల్లోని నార్త్, సౌత్ పోల్స్‌లో భారీ మొత్తంలో మంచి నీరు గడ్డకట్టుకుని ఉంటుంది. ఈ మంచు అధిక ఉష్ణోగ్రతల కారణంగా కరిగిపోయి...మంచి నీళ్లన్నీ అలా వరదల్లా ముంచెత్తుతున్నాయి. వృథా అవుతున్నాయి.
Also Read: కుతకుత ఉడికిపోతున్న భూమి, జులైలో పాత రికార్డులన్నీ బద్దలు - గ్లోబల్ బాయిలింగ్ మొదలైందా?