అన్వేషించండి

దేశంలోని తొలి 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ ప్రారంభం, 45 రోజుల్లోనే పూర్తి చేసిన రోబోలు

3D Printed Post Office: దేశంలోనే తొలి 3D ప్రింటెడ్ పోస్ట్‌ ఆఫీస్‌ని బెంగళూరులో కేంద్రమంత్రి ప్రారంభిచారు.

3D Printed Post Office: 


తొలి 3D పోస్ట్ ఆఫీస్ ప్రారంభం..

కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ దేశంలోనే తొలి 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్‌ని ప్రారంభించారు. బెంగళూరులోని Cambridge Layout వద్ద 1,021 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ పోస్ట్‌ ఆఫీస్‌ని నిర్మించారు. పోస్టల్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం...ఈ ఆఫీస్‌ని  Larsen & Toubro Limited కంపెనీ నిర్మించింది. ఐఐటీ మద్రాస్ టెక్నికల్ గైడెన్స్ ఇచ్చింది. ఈ కార్యాలయాన్ని ప్రారంభించిన అశ్వినీ వైష్ణవ్...గతంలో అసాధ్యం అనుకున్న వాటిని సాధ్యం చేయగలుగుతున్నామని వెల్లడించారు. 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో ఈ ఆఫీస్‌ని నిర్మించినట్టు వివరించారు. 

"గతంలో అసాధ్యం అనుకున్నవి ఇప్పుడు సుసాధ్యం అవుతున్నాయి. ఇదంతా టెక్నాలజీ మహిమ. అభివృద్ధి చేయాలనే స్ఫూర్తి మనలో ఉంటే...సొంత టెక్నాలజీతో అద్భుతాలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయం. త్రీడీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో దీన్ని నిర్మించారు. ఇది ఫుల్లీ ఆటోమేటెడ్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ. రోబోటిక్ ప్రింటర్ డిజైన్ ఆధారంగా లేయర్‌ల వారీగా కాంక్రీట్‌ని పోస్తుంది. దీనికోసం స్పెషల్ గ్రేడ్ కాంక్రీట్‌ని వినియోగించారు. తక్కువ సమయంలోనే గోడలు గట్టి పడడానికి దీన్ని వాడారు. సాధారణ నిర్మాణాలకు 6-8 నెలల సమయం పడుతుంది. కానీ...ఈ టెక్నాలజీతో 45 రోజుల్లోనే నిర్మాణం పూర్తైంది"

- అశ్వినీ వైష్ణవ్, కేంద్రమంత్రి 

సంప్రదాయ నిర్మాణాలకు విభిన్నం..

సంప్రదాయ నిర్మాణాలకు పూర్తి భిన్నంగా ఉంటుందీ 3D Printed నిర్మాణాలు. ముందుగా నిర్దేశించిన డిజైన్ ప్రకారం అంతా రోబోలే పూర్తి చేస్తాయి. టైమ్‌తో పాటు మనీ కూడా సేవ్ అవుతుంది. బెంగళూరులోని పోస్ట్ ఆఫీస్ నిర్మాణం...ఐఐటీ మద్రాస్ టెక్నికల్ సపోర్ట్‌తో పూర్తైంది. 

"త్రీడీ ప్రింటెడ్ కాంక్రీట్ బిల్డింగ్‌లు నిర్మించాలన్న ఆలోచనే గొప్పది. టెక్నాలజీతో ఇది మరో ముందడుగు. ఐఐటీ మద్రాస్ అద్భుతంగా పని చేసింది. టెక్నాలజీని సరైన విధంగా వినియోగించుకుంటే మున్ముందు మరెన్నో నిర్మాణాలు చేయొచ్చు"

-  అశ్వినీ వైష్ణవ్, కేంద్రమంత్రి 

Also Read: కోటాలోని హాస్టళ్లలో సీలింగ్ ఫ్యాన్స్‌కి స్ప్రింగ్‌లు, ఆత్మహత్యలను అడ్డుకునేందుకు కొత్త ప్లాన్

టాప్ హెడ్ లైన్స్

Sonia Gandhi Book: ప్రధాని పదవి వదులుకోవడానికి అదే కారణం.. సోనియా గాంధీ ఆత్మకథలో కీలక అంశాలు!
ప్రధాని పదవి వదులుకోవడానికి అదే కారణం.. సోనియా గాంధీ ఆత్మకథలో కీలక అంశాలు!
Congress Vote Chori Campaign: ఓట్ చోరీ సమరానికి తెరపడినట్లేనా? ఢిల్లీకే పరిమితమైన కాంగ్రెస్ నిరసన.. కొత్త అజెండా వెతుక్కోవాల్సిందేనా?
ఓట్ చోరీ సమరానికి తెరపడినట్లేనా? ఢిల్లీకే పరిమితమైన కాంగ్రెస్ నిరసన.. కొత్త అజెండా వెతుక్కోవాల్సిందేనా?
DK Shivakumar: వీఐపీ దర్శనాలపై భక్తులు ఆగ్రహం.. సీఎం డీకే శివకుమార్‌పై చెప్పుల వర్షం !
వీఐపీ దర్శనాలపై భక్తులు ఆగ్రహం.. సీఎం డీకే శివకుమార్‌పై చెప్పుల వర్షం !
Software Engineer Murder: పూజ చేసి బలిచ్చింది! సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను హత్య చేసిన ప్రియురాలు.. ఆమెతో పాటు తల్లి అరెస్ట్
పూజ చేసి బలిచ్చింది! సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను హత్య చేసిన ప్రియురాలు.. ఆమెతో పాటు తల్లి అరెస్ట్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PRC ఆలస్యం..ఉద్యోగుల్లో అసంతృప్తి.. కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పి!
PRC ఆలస్యం..ఉద్యోగుల్లో అసంతృప్తి.. కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పి!
YSRCP On Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయవద్దు: క్యాడర్‌కు వైసీపీ అధినేత ఆదేశాలు
పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయవద్దు: క్యాడర్‌కు వైసీపీ అధినేత ఆదేశాలు
KA Paul: నేను ఆ పని చేస్తే వారం రోజుల్లోగా రేవంత్ రెడ్డి సీఎం పదవి పోతుంది: కేఏ పాల్ సంచలనం
నేను ఆ పని చేస్తే వారం రోజుల్లోగా రేవంత్ రెడ్డి సీఎం పదవి పోతుంది: కేఏ పాల్ సంచలనం
Makhana Benefits : రోజూ మఖానా తింటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఇవే.. డైట్‌లో ఇలా చేర్చుకోండి
రోజూ మఖానా తింటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఇవే.. డైట్‌లో ఇలా చేర్చుకోండి
Pawan Kalyan Divorce: పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకుల ప్రకటన ఇప్పుడు ఎందుకు చేశారంటే !
పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకుల ప్రకటన ఇప్పుడు ఎందుకు చేశారంటే !
Car Engine Problems: మిస్‌ఫైరింగ్ నుంచి 'చెక్ ఇంజిన్' లైట్ వరకు.. ఇంజిన్‌కు ప్రమాదం తెచ్చే 3 సమస్యలు ఇవే
కారు ఇంజిన్‌లో ఈ 3 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. సర్వీస్ సెంటర్‌కు మాత్రమే వెళ్లండి
Weight Loss Recipe : బరువు తగ్గాలనుకునేవారి నోరూరించే టేస్టీ రెసిపీ.. పనీర్, వెజిటెబుల్స్​తో ఈ రైస్ ట్రై చేయండి
బరువు తగ్గాలనుకునేవారి నోరూరించే టేస్టీ రెసిపీ.. పనీర్, వెజిటెబుల్స్​తో ఈ రైస్ ట్రై చేయండి
Congress Politics: 9 సార్లు ఛాన్స్ ఇచ్చిన కాంగ్రెస్.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా చిన్నారెడ్డి! అసలేం జరుగుతోంది?
9 సార్లు ఛాన్స్ ఇచ్చిన కాంగ్రెస్.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా చిన్నారెడ్డి! అసలేం జరుగుతోంది?
Embed widget