అన్వేషించండి

Maharashtra: గడ్చిరోలి అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు.. 26 మంది మావోయిస్టులు మృతి

మహారాష్ట్రలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. గడ్చిరోలి జిల్లాలోని కొత్గుల్-గ్యారపట్టి అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. 

మహారాష్ట్రలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన భికర ఎదురుకాల్పుల్లో 26 మంది మావోయిస్టులు మృతి చెందారు. కొంతమంది గాయపడినట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం 6.30గం. సమయంలో కాల్పులు మొదలైనట్లు గడ్చిరోలి ఎస్పీ అంకిత్ గోయల్ తెలిపారు. ప్రస్తుతం పోలీసులకు, మావోలకు మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని సమాచారం. ఇప్పటి వరకూ 26 మంది మృతి చెందగా.. ఇంకా మృతులు పెరిగే అవకాశం ఉంది. ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశంలో పోలీసులు భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. 

కొత్గుల్-గ్యారపట్టి ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్టు.. పోలీసులకు సమాచారం అందడంతో ఆ ప్రాంతంలో కూంబింగ్‌కు వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎదురుపడగా.. మావోయిస్టులకు, పోలీసులకు నడుమ ఎదురు కాల్పులు మెుదలయ్యాయి. అయితే మావోయిస్టు కేంద్ర కమిటీ సీనియర్ సభ్యులు మిలింద్ బాబురావు తెల్తుంబ్డే అలియాస్ దీపక్ తెల్తుంబ్డే, ఛత్తీస్‌గఢ్ (MMC)  ప్రత్యేక జోనల్ కార్యదర్శి, డీవీసీ శుల్కలాల్ కూడా చనిపోయినట్టు సమాచారం. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. 

కొన్ని సంవత్సరాలుగా.. మావోయిస్టు పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లతో ఇప్పటికే పార్టీ బలహీనపడిపోయిందన్న చర్చ ఓ వైపు నడుస్తోంది. మావోయిస్టు పార్టీ మాత్రం ఇప్పటికీ తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది. కొన్ని నెలల క్రితం విశాఖలో జరిగిన ఎదురుకాల్పుల్లోనూ.. ముఖ్యమైన నేతలు మరణించారు. ఇటీవలే.. మావోయిస్టు నేత అగ్రనేత.. ఆర్కే కూడా మృతి చెందారు. మళ్లీ 26 మంది మృతితో మావోయిస్టు పార్టీకు పెద్ద దెబ్బ పడినట్టైంది.

బాంబు పేలి..  మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మృతి

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రవి మృతి చెందినట్లు మావోయిస్టు కేంద్ర కమిటీ ఓ ప్రకటన జారీ చేసింది. బాంబులు పరిశీలిస్తున్న సమయంలో ప్రమాదం జరిగి మావోయిస్టు రవి మృతి చెందాడని పేర్కొంది. మావోయిస్టు కేంద్ర కమిటీ టెక్ టీంలో రవి కీలక సభ్యుడు. రవి చనిపోయిన ఏడాదిన్నర తర్వాత ఆయన మృతిని మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటించింది. ఝార్ఖండ్ లోని మారుమూల ప్రాంతంలో రవి మృతి చెందినట్లు మావోయిస్టులు తెలిపారు. టెక్నికల్ టీమ్ లో కీలక సభ్యులుగా కొనసాగిన రవి... కమ్యూనికేషన్స్ తోపాటుగా ఎలక్ట్రానిక్ డివైస్ తయారు చేయడంలో దిట్ట. 

తాను తయారుచేసిన బాంబులను పరీక్షిస్తున్న సమయంలోనే ప్రమాదవశాత్తు పేలి రవి మృతి చెందారు. ఏడాదిన్నర క్రితమే ఈ ప్రమాదం జరిగింది. అయితే మావోయిస్టు కేంద్ర కమిటీ రవి మరణాన్ని ఆలస్యంగా ధ్రువీకరించింది. మావోయిస్టు టెక్నికల్ టీంలో సభ్యుడిగా ఉన్న రవికి కమ్యునికేషన్స్‌తో పాటు ఎలక్ర్టికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్ పరికరాలు తయారుచేయడంలో సిద్ధహస్తుడు. జూన్ 5, 2020న ఝార్ఖండ్‌లో జరిగిన ఓ బాంబు ప్రమాదంలో రవి మృతి చెందాడని, అతడి భౌతిక కాయాన్ని విప్లవ లాంఛనాలతో అంత్యక్రియలు చేశామని మావోయిస్టు పార్టీ వెల్లడించింది.

Also Read: Delhi LockDown : ఢిల్లీలో లాక్ డౌన్ తరహా ఆంక్షలు.. కరోనా కాదు కాలుష్యం కారణం !

Also Read: Terrorist Attack: అస్సాం రైఫిల్స్ కాన్వాయ్ పై ఉగ్రదాడి.. ఏడుగురు మృతి

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
Breaking News: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
BJP Grassroots Leadership: వారసత్వాలకు చెక్.. ప్యాషన్‌కే ప్రాధాన్యం - బీజేపీ గ్రాస్‌రూట్ లీడర్‌షిప్ మోడల్ - లీడర్లు ప్రజల నుంచే !
వారసత్వాలకు చెక్.. ప్యాషన్‌కే ప్రాధాన్యం - బీజేపీ గ్రాస్‌రూట్ లీడర్‌షిప్ మోడల్ - లీడర్లు ప్రజల నుంచే !
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget