(Source: ECI/ABP News/ABP Majha)
భారత్‌లోకి అక్రమ చొరబాటుకి ఇద్దరు పాక్ ఉగ్రవాదుల కుట్ర, మట్టుబెట్టిన ఆర్మీ
Pakistani Terrorists Killed: భారత్‌లోకి అక్రమ చొరబాటుకి ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదుల్ని ఆర్మీ ఎన్‌కౌంటర్ చేసింది.
Pakistani Terrorists Killed:
ఇద్దరు ఉగ్రవాదులు హతం..
జమ్ముకశ్మీర్ పోలీసులు ఇద్దరు పాకిస్థాన్ ఉగ్రవాదుల్ని మట్టుబెట్టారు. కుప్వారా వద్ద LACని దాటి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారు ముష్కరులు. వెంటనే పసిగట్టిన ఆర్మీ వాళ్లను ఎన్‌కౌంటర్ చేసింది. నార్త్ కశ్మీర్‌లోని మచిల్ సెక్టార్ వద్ద అక్రమ చొరబాటుకి యత్నించినట్టు పోలీసులు వెల్లడించారు. నిఘా వర్గాల సమాచారంతో ముందుగానే ఆర్మీ, పోలీసులు అప్రమత్తమయ్యారు. జాయింట్ ఆపరేషన్ నిర్వహించి ఆ ఇద్దరు తీవ్రవాదుల్ని మట్టుబెట్టారు. ఎన్‌కౌంటర్ చేసిన ప్రాంతం నుంచి 2 AK రైఫిల్స్, 4 AK మ్యాగజైన్స్, పాకిస్థానీ పిస్టోల్‌ని స్వాధీనం చేసుకున్నారు. పాకిస్థాన్ కరెన్సీని సీజ్ చేశారు. ఇదే విషయాన్ని కుప్వారా జిల్లా పోలీసులు ట్విటర్‌లో అధికారికంగా వెల్లడించారు.
Based on an intelligence input provided by Kupwara Police,in a joint operation carried by Army and Police in kumkadiarea of Machal sector,2 infiltrating terrorists have been killed so far.The operation is still in progress @JmuKmrPolice @KashmirPolice @DIGBaramulla @ManhasYougal
— DISTRICT POLICE KUPWARA. (@KupwaraCops) September 30, 2023
గత నెలలో భద్రతా బలగాల వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేశారు ముష్కరులు. ఈ దాడిలో సైనికులు సురక్షితంగా బయటపడ్డారు. ఖన్యార్ ప్రాంతం వద్ద దాడి జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. ఓ ఉగ్రవాది CRPF బలగాలున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపాడు. ఆ తరవాత అక్కడి నుంచి పారిపోయాడు. ఆ ఉగ్రవాదిని పట్టుకునేందుకు ప్రయత్నించినప్పటికీ దొరక్కుండా తప్పించుకున్నాడు. తరచూ LAC వద్ద ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. పోలీసులతో పాటు సైనికులూ చాలా అప్రమత్తంగా ఉంటున్నారు. ఎక్కడా అలజడులు సృష్టించకుండా ముందస్తుగానే కుట్రల్ని భగ్నం చేస్తున్నారు.
Jammu & Kashmir | Acting on a specific tip off, J&K Police and Army's 42 RR laid a cordon in the forest area of Nagbal Forest, Gulshanpora Tral. During searches, two terror hideouts were busted: Indian Army
— ANI (@ANI) September 30, 2023
(Source: Indian Army) pic.twitter.com/kXkRbkp3wV
ఇటీవలే జమ్మూ కశ్మీర్ లో భద్రతా బలగాలు ఉగ్రవాదుల ఆటకట్టించాయి. తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆరుగురు వ్యక్తులను భద్రతా సిబ్బంది అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు మహిళలతో పాటు ఓ మైనర్ కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇటీవల జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదుల కదలికలు పెరిగిపోయాయి. అనంత్ నాగ్ జిల్లాలో ఉగ్రవాదులకు, భద్రతా సిబ్బందికి మధ్య జరిగిన కాల్పుల్లో కొంత మంది జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. దీంతో జమ్మూ కశ్మీర్ లో ఉగ్రకదలికలపై పోలీసులు దృష్టి సారించారు. పోలీసులు, ఆర్మీ జవాన్లు కలిసి పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాయి. ఈ క్రమంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆరుగురిని గుర్తించి అరెస్టు చేశారు. వారి నుంచి మూడు తుపాకులు, 5 హ్యాండ్ గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నారు.భద్రతా సిబ్బంది మొత్తం ఆరుగురిని అరెస్టు చేయగా.. అందులో యాసిర్ అహ్మద్ షా అనే యాక్టివ్ టెర్రరిస్టు కూడా ఉన్నాడు. మిగతా ఐదుగురు అతడికి సహాయం చేస్తున్నట్లు బారాముల్లా జిల్లా పోలీసులు గుర్తించారు.
Also Read: మహాత్మా గాంధీజీ ఓవైపు గాడ్సే మరో వైపు, యుద్ధం మొదలైంది - కాంగ్రెస్ బీజేపీ ఫైట్‌పై రాహుల్