Jammu & Kashmir: జమ్మూలోని ఉదంపూర్ జిల్లా కోర్టు వెలుపల పేలుడు, ఒకరు మృతి, పలువురు గాయాలు
జమ్ముకశ్మీర్‌లోని ఉదంపూర్‌లో పేలుడు కలకలం రేపింది. ఇందులో గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పేలుడు కారణాలపై పోలీసులు అన్వేషిస్తున్నారు.
జమ్మూ ప్రాంతంలోని ఉదంపూర్ పట్టణం పేలుడు భయభ్రాంతులకు గురి చేసింది. ఉదంపూర్ జిల్లా కోర్టు కాంప్లెక్స్ వెలుపల ఈ పేలుడు జరిగింది. ఈ పేలుడులో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.
Seven injured in a blast at Slathia Chowk in Udhampur: Jammu &Kashmir Police
— ANI (@ANI) March 9, 2022
ఉదంపూర్ పేలుడులో మొత్తం 15 మంది గాయపడ్డారని, వారిలో ఒకరు గాయాలతో మరణించారని ANI వార్తాసంస్థకు ఒక వైద్యుడు తెలియజేశాడు.
గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామని, పేలుడు తీవ్రతను తదుపరి విచారణలో వెల్లడిస్తామన్నారు జమ్మూ & కశ్మీర్ ఎస్‌ఎస్పీ వినోద్ కుమార్ విలేకరులకు తెలిపారు.
ఉదంపూర్‌లోని స్లాథియా చౌక్ సమీపంలో పేలుడు జరిగినట్లు పోలీసులు కూడా సమాచారం అందించారు.
Blast explosion around “Rehri” near Tehsildar office at #Udhampur. One life lost, 13 injured being moved to hospital.I am in touch with D.C Smt Indu Chib on minute to minute basis. Exact cause and origin of the blast being worked out..too early to draw any definite conclusion.
— Dr Jitendra Singh (@DrJitendraSingh) March 9, 2022