India Covid Updates: దేశంలో శాంతించిన కరోనా, కొత్తగా 14,148 కేసులు, 302 మరణాలు
దేశంలో కరోనా శాంతించింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 14,148 మందికి కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో 302 మంది మరణించారు.
దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. రోజువారీ కేసుల్లో స్వల్ప హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 11 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 14,148 మందికి కరోనా వైరస్ సోకింది. ముందు రోజు కన్నా కేసుల్లో 6 శాతం తగ్గుదల నమోదు అయ్యాయి. దేశంలో పాజిటివిటీ రేటు 1.22 శాతానికి తగ్గింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 302 మంది కరోనాతో మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,12,924కు చేరింది. ఇప్పటికి వరకూ 4.28 కోట్ల మందికి కరోనా సోకింది. గురువారం ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించింది. వైరస్ వ్యాప్తి కట్టడిలో ఉందని తెలిపింది.
దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,48,359కి చేరాయి. నిన్న ఒక్కరోజే 30 వేల మంది కోవిడ్ నుంచి రికవరీ అయ్యారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 4.22 కోట్లకు చేరింది. రికవరీ రేటు 98.46 శాతానికి పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. బుధవారం 30 లక్షల మందికి వ్యాక్సిన్లు వేశారు. 13 నెలల వ్యవధిలో 176 కోట్లకు పైగా డోసులు పంపిణీ చేశారు.