India Pakistan Relations: కశ్మీర్ సమస్యపై పాక్-భారత్ మధ్య చర్చ జరిగిందా? రెండేళ్ల క్రితమే కీలక భేటీ!
India Pakistan Relations: కశ్మీర్ సమస్యపై భారత్, పాక్ మధ్య రెండేళ్ల క్రితమే కీలక సమావేశం జరిగినట్టు పాక్ జర్నలిస్ట్ వెల్లడించారు.
India Pakistan Relations:
2021లోనే సమావేశం..
కశ్మీర్ సమస్యను కేంద్రం పరిష్కరించి మూడేళ్లు దాటుతున్నా..ఇంకా దానిపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కశ్మీర్ అంశంపై ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. 2021లోనే భారత్-పాక్ బంధం బలపడేందుకు అత్యున్నత స్థాయి సమావేశం జరిగిందని పాక్ సైన్యం వెల్లడించింది. ఇదే సమావేశంలో కశ్మీర్ సమస్య గురించీ చర్చించినట్టు చెప్పింది. అయితే...ఆ సమయంలో కశ్మీర్ సమస్యను చర్చించేందుకు పాక్ సైన్యం అంగీకరించలేదని తెలిసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK) పైనా చర్చ జరిగినట్టు సమాచారం. ఇరు దేశాలకు
చెందిన ఉన్నతాధికారులు ఆ భేటీలో ఉన్నారని చెబుతున్నారు. ABP Newsతో ప్రత్యేకంగా మాట్లాడిన పాక్ జర్నలిస్ట్ జావేద్ చౌదరి ఈ కీలక విషయాలు చెప్పారు. ఈ భేటీ జరిగిన సమయంలో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కశ్మీర్ సమస్యపై చర్చిందేందుకు ఆసక్తి చూపలేదని, మధ్యలోనే డిస్కషన్‌ను ఆపేశారని చెప్పారు జావేద్. అప్పటి విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ సూచన మేరకు ఇమ్రాన్ ఈ విషయాన్ని దాటేశారని వెల్లడించారు. పాకిస్థాన్ ఆర్మీకి చెందిన ఉన్నతాధికారులు ఈ సమావేశంలో ఉన్నారని తెలిపారు. పాకిస్థాన్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ ISI DG కూడా అక్కడే ఉన్నట్టు చెప్పారు. పాక్ ఆర్మీ...భారత్‌తో సంబంధాన్ని మెరుగు పరుచుకునేందుకు ప్రయత్నించిందని అన్నారు.
ఉగ్రదాడులు..
జమ్ముకశ్మీర్‌లో ఈ మధ్య కాలంలో మళ్లీ ఉగ్రదాడులు పెరుగుతున్నాయి. రాజౌరి జిల్లాలో జరిగిన దాడిలో ఆరుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో కేంద్రం అప్రమత్తమైంది. భద్రతను కట్టుదిట్టం చేస్తోంది. ఇందులో భాగంగానే...18 వందల మంది అదనపు CFPF బలగాలను రంగంలోకి దించనుంది. పూంచ్, రాజౌరీ జిల్లాల్లో వీరిని మొహరించనున్నారు. ANI తెలిపిన వివరాల ప్రకారం...CRPFకి చెందిన
18 కంపెనీల బలగాలు రంగంలోకి దిగనున్నాయి. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ అదనపు బలగాలతో ఉగ్రవాదంపై పోరాడటం మరింత సులువవుతుందని కేంద్రం భావిస్తోంది. ఇప్పటికే 9 సీఆర్‌పీఎఫ్ కంపెనీలు రాజౌరికి చేరుకున్నాయి. మిగతా బలగాలు ఢిల్లీ నుంచి వెళ్లనున్నాయి. వీరంతా కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్‌లో కీలక పాత్ర పోషించనున్నారు. జమ్ముకశ్మీర్‌లో జరుగుతున్న
ఉగ్రదాడులపై ప్రతిపక్షాలు మండి పడుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ బీజేపీని తీవ్రంగా విమర్శించారు. జమ్ముకశ్మీర్‌లో జరుగుతున్న ఈ విధ్వంసానికి కేంద్ర ప్రభుత్వమే కారణమని అన్నారు. రోజురోజుకీ జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులు అదుపు తప్పుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు.
జమ్ము ప్రజలు బీజేపీకి మద్దతుగా నిలబడ్డారని...కానీ వారికి రక్షణ లేకుండా పోయిందని అన్నారు. ఇటీవల రాజౌరీలో ఉగ్రదాడి జరగ్గా ఓ చిన్నారితో పాటు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల ఘటనలో సాధారణ పౌరులు చని పోవడంపై స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. డంగ్రీలోని మెయిన్ చౌక్‌లో ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. ఆ సమయంలోనే బాంబు పేలుడు సంభవించింది. " అధికారులు, పోలీసులు దాడులు జరగకుండా ఆపడంలో విఫలమయ్యారు. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఇక్కడికి రావాలి. మా డిమాండ్‌లు వినాలి" అని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: Ayodhya News: అయోధ్య రాముడిని చూస్తే కన్నార్పుకోలేరు, నీలి రంగులోనే విగ్రహం - పూజారి