కెనడాలో భారత వీసా సర్వీస్‌లపై ఆంక్షలు, వీసా అప్లికేషన్ సెంటర్ అధికారిక ప్రకటన
Canada Visa Service Suspend: కెనడాలో భారత్ వీసా సర్వీస్‌లను సస్పెండ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
Canada Visa Service Suspend:
కీలక నిర్ణయం..
భారత్ కెనడా మధ్య ఉద్రిక్తతలు (India Canada Tensions) అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కెనడాకు వెళ్లే వాళ్లకు వీసాలు జారీ చేసే ప్రక్రియను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. మళ్లీ ఆదేశాలిచ్చేంత వరకూ ఈ ఆంక్షలు కొనసాగుతాయని తేల్చి చెప్పింది. ఇవాళ్టి నుంచే (సెప్టెంబర్ 21) ఇది అమల్లోకి వస్తుందని వెల్లడించింది. దీనిపై కెనడాలోని ఇండియన్ వీసా అప్లికేషన్ సెంటర్ అధికారికంగా ప్రకటన చేసింది. పలు కారణాల వల్ల ఈ ఆంక్షలు విధించాల్సి వస్తోందని తెలిపింది.
"కొన్ని కారణాల వల్ల ఇవాళ్టి నుంచి కెనడాకి వెళ్లే వాళ్లకు వీసాలు జారీ చేసే ప్రక్రియను నిలిపివేస్తున్నాం. సెప్టెంబర్ 21 నుంచే ఇది అమల్లోకి వస్తుంది. తదుపరి ఆదేశాలిచ్చేంత వరకూ ఈ ఆంక్షలు కొనసాగుతాయి. మరిన్ని అప్‌డేట్స్ కోసం వెబ్‌సైట్‌ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి"
- ఇండియా వీసా అప్లికేషన్ సెంటర్, కెనడా
Important notice from Indian Mission | "Due to operational reasons, with effect from 21 September 2023, Indian visa services have been suspended till further notice. Please keep checking BLS website for further updates," India Visa Application Center Canada says. pic.twitter.com/hQz296ewKC
— ANI (@ANI) September 21, 2023
ఈ నిర్ణయంపై ఉన్నతాధికారులెవరూ మాట్లాడేందుకు ఇష్టపడడం లేదు. తాము చెప్పాలనుకున్నదేంటో అధికారికంగా ప్రకటించేశామని చెబుతున్నారు. కొవిడ్ సంక్షోభం తరవాత భారత్ తొలిసారి ఇలా వీసా సర్వీస్‌లపై ఆంక్షలు విధించింది. ఇటీవలే భారతీయ పౌరులను ఉద్దేశిస్తూ విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. కెనడాలోని ఇండియన్స్ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భారత్కి వెళ్లే వాళ్లపై ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది కెనడా. ఇప్పుడు భారత విదేశాంగ శాఖ కెనడాలోని భారతీయుల కోసం అడ్వైజరీ జారీ చేసింది. రాజకీయ కక్షతో కొందరు హింసను ప్రేరేపిస్తున్నారని వెల్లడించింది. ప్రయాణాలు చేయాలనుకునే వాళ్లు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కెనడాలోని అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్టు స్పష్టం చేసింది. కెనడాలోని భారతీయ విద్యార్థులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని భారత విదేశాంగ శాఖ తెలిపింది. గతేడాది సెప్టెంబర్లోనూ ఇదే తరహా అడ్వైజరీ జారీ చేసింది. దాదాపు ఏడాదిగా అక్కడ పరిస్థితులు ఇలానే ఉన్నాయి. పలు హిందూ ఆలయాలపై ఖలిస్థాన్ మద్దతుదారులు దాడులు చేస్తున్నారు. దీనిపై ప్రధాని మోదీ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు.
India issues advisory for Indian nationals and students in Canada
— ANI (@ANI) September 20, 2023
"In view of growing anti-India activities and politically-condoned hate crimes and criminal violence in Canada, all Indian nationals there and those contemplating travel are urged to exercise utmost caution.… pic.twitter.com/G6cmhSuGfb
Also Read: కెనడాలో మరో ఖలిస్థాన్ టెర్రరిస్ట్ హతం, పెరుగుతున్న ఉద్రిక్తతలు