భారత్- చైనా సైనిక చర్చలపై కీలక నిర్ణయం తీసుకున్నాయి ఇరు దేశాలు. సరిహద్దులో ఇరుదేశాల మధ్య నెలకొన్న సమస్యలకు సత్వర పరిష్కారం కనుగొనాలని ఇరువర్గాలు అంగీకరించుకున్నట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ మేరకు సరిహద్దు సమస్యపై ఏర్పాటైన 'వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్'(డబ్ల్యూఎంసీసీ) సమావేశంలో చర్చలు జరిపినట్లు విదేశాంగా శాఖ పేర్కొంది.


లోతైన చర్చలు..


తూర్పు లద్దాఖ్​లో చైనా సైన్యంతో నెలకొన్న ప్రతిష్టంభనపై ఆ దేశ సైనిక ప్రతినిధులతో లోతైన చర్చలు జరిపినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఇటీవల జరిగిన 13వ దఫా చర్చలు విఫలం కావడం వల్ల తర్వాతి దఫా చర్చలు త్వరగానే జరపాలని నిర్ణయించినట్లు పేర్కొంది.


కీ పాయింట్స్..



  • ఇరువర్గాలు సరిహద్దులో క్షేత్రస్థాయి పరిస్థితులను చేయిదాటిపోకుండా చూసుకోవాలని నిర్ణయించుకున్నాయి.

  • వాస్తవాధీన రేఖ వెంబడి అన్ని ఘర్షణ ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణను పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని సాధించాలని నిర్ణయించాయి.

  • 14వ విడత సీనియర్ కమాండర్ల చర్చలు త్వరగా నిర్వహించుకునేందుకు ఇరువర్గాలు అంగీకరించాయి.

  •  అవాంఛనీయ ఘటనలు జరగకుండా క్షేత్రస్థాయిలో సంయమనం పాటించాలని ఏకాభిప్రాయానికి వచ్చాయి.

  • చర్చలు విఫలం..


తూర్పు లద్దాఖ్‌లో నియంత్రణ రేఖ వద్ద శాంతి నెలకొల్పేందుకు చైనా- భారత్ మధ్య ఇటీవల జరిగిన 13వ విడత చర్చలు విఫలమయ్యాయి. ఎల్‌ఏసీ వద్ద ప్రస్తుత పరిణామాలకు చైనా చేసిన దుస్సాహసాలే కారణమని డ్రాగన్‌తో జరిగిన చర్చల్లో భారత్ ప్రస్తావించినట్లు అధికారులు తెలిపారు. ఇరు దేశాల మధ్య జరిగిన ద్వైపాక్షిక ఒప్పందాలకు తూట్లు పొడుస్తూ, ఎల్‌ఏసీ వద్ద యథాతథ స్థితిని మార్చేందుకు చైనా ప్రయత్నం చేసిందని భారత ఆర్మీ స్పష్టం చేసింది. ఎల్‌ఏసీ వద్ద ఉద్రిక్తతలు తగ్గించేందుకు చైనా తగిన చర్యలు చేపట్టాలని, తద్వారా శాంతి నెలకొల్పాలని భారత సైన్యం అభిప్రాయపడింది.


Also Read: Dead Snakelet In Food: ఉప్మాలో చచ్చిన పాము పిల్ల.. 56 మంది పిల్లలకు అస్వస్థత


Also Read: Param Bir Singh News: 'ముందు ఎక్కడున్నారో చెప్పండి ఫస్ట్.. రక్షణ మాట అప్పుడు చూద్దాం'


Also Read: Nawab Malik: వాంఖడే వెనుక 'దావూద్'.. ఆయన ఓ ముస్లిం.. ఇదిగో సాక్ష్యం: నవాబ్ మాలిక్


Also Read: Money Laundering Case: 'మీకు అధికార మదం తలకెక్కింది.. తగిన శాస్తి చేస్తాం'


Also Read: Supreme Court on Assault Case: 'దుస్తులపై నుంచి శరీర భాగాలను తాకినా లైంగిక వేధింపే'


Also Read: Google Pay Voice Feature: వాయిస్‌తో డబ్బులు ట్రాన్స్‌ఫర్.. ఇక డిజిటల్ చెల్లింపులు మరింత ఈజీ!


Also Read: Corona Cases:- స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా 11,919 మందికి వైరస్


Also Read: రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విషయం మర్చిపోయాయ్.. చిరు వ్యాఖ్యలు


Also Read: మోహన్ బాబు ఇంట్లో విషాదం.. పునీత్ భార్య ఎమోషనల్ పోస్ట్..


Also Read: ‘స్పైడర్ మ్యాన్ - నో వే హోమ్’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. అన్ని విశ్వాల విలన్లతో భారీ పోరు!


Also Read: అప్‌క‌మింగ్ టాలెంట్‌కు ఛాన్స్ ఇచ్చిన‌ అల్లు అర్జున్... సమంతతో స్పెషల్ సాంగ్‌కు అతడే కొరియోగ్రాఫర్!


Also Read: రూపాయి పాపాయి లాంటిది.. పెంచి పెద్ద చేసుకోవాలి.. ఇంట్రెస్టింగ్‌గా ‘అనుభవించురాజా’ ట్రైలర్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి